అండర్ 15 ఆప్టిమిస్ట్ బాలుర చాంపియన్ ఏకలవ్య బాతంబాలికల్లో స్వర్ణం కోసం పోటీ పడుతున్న దీక్షిత, షాగున్

హైదరాబాద్, జూలై 22 2023: ప్రతిష్టాత్మకమైన మాన్‌సూన్ రెగట్టా జాతీయ ర్యాంకింగ్ సెయిలింగ్ చాంపియన్‌ షిప్‌ లో మధ్యప్రదేశ్ కు చెందిన ఏకలవ్య బాతం అండర్15 ఆప్టిమిస్టిక్ బాలుర విభాగంలో బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. ఎన్‌బీఎస్సీ గోవాకు చెందిన శరణ్య జాదవ్, అజయ్ గజ్జి రజతం, కాంస్యం కోసం పోరాడుతున్నారు. ఈ టోర్నీలో ఆరంభం నుంచి సత్తా చాటుతున్న ఏకలవ్య బాతం శనివారం జరిగిన రెండు రేసుల్లోనూ అగ్రస్ధానం సాధించాడు.

దాంతో, 11 రేసుల తర్వాత 15 పాయింట్లతో నిలిచిన బాతం మరో రేసు మిగిలుండగానే మాన్‌సూన్ రెగట్టా ట్రోఫీతో పాటు ఎస్ హెచ్ బాబు మెమోరియల్ ట్రోఫీ రెండింటినీ గెలిచిన రికార్డును సమం చేసి చరిత్ర సృష్ష్టించాడు. ఇది వరకు యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన ప్రీతి కొంగర 2019లో ఈ ఫీట్‌ను సాధించింది. ప్రస్తుతం ఆమె నెదర్లాండ్స్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ బరిలో నిలిచింది.

అండర్15 బాలికల ఆప్టిమిస్టిక్‌ విభాగంలో శుక్రవారం వరకూ తిరుగులేని తెలంగాణ సెయిలర్ దీక్షిత కొమరవెల్లి శనివారం కాస్త తడబడింది. అయినా 52 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో ఉండగా.. రెండు పాయింట్ల అంతరాన్ని తగ్గించిన మధ్యప్రదేశ్ కు చెందిన షాగున్ ఝా (55) స్వర్ణ పతక బరిలోకి వచ్చింది. అండర్ 19 మిక్స్ డ్ ఇంటర్నేషనల్ క్లాస్ విభాగంలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ జంట ధరణి లావేటి –వడ్ల మల్లేష్‌ (16 పాయింట్లు) 10, 11వ రేసుల్లో నిరాశ పరిచింది.

దాంతో, మధ్య ప్రదేశ్ కు చెందిన నాన్సీ-అనిరాజ్ సెంధవ్ జంట (18 పాయింట్లు) రెండు పాయింట్ల అంతరాన్ని తగ్గించి రెండో స్థానంలో ఉన్నారు. నాన్సీ చేసిన ఫిర్యాదుతో అంతర్జాతీయ జ్యూరీ 10వ రేసులో ధరణి–మహేష్ జంటను అనర్హులుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అండర్ 19 మిక్స్‌డ్ క్లాస్ , అండర్ 15 బాలికల క్లాస్‌లో తెలంగాణ, ఎన్‌ఎస్‌ఎస్ మధ్యప్రదేశ్ సెయిలర్ల మధ్య ఆఖరి, 12వ రేసు రసవత్తరంగా జరగనుంది.

ఆదివారం చివరి రేసును సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్టి సారిన్ ఉదయం 10 గంటలకు జెండా ఊపి ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు బహుమతి ప్రదానోత్సవానికి ఏవీఎస్ఎం, వీఎస్ఎం అడ్మిరల్, చీఫ్ ఆఫ్ పర్సనల్ ఇండియన్ నేవీ కృష్ణ స్వామినాథన్ అధ్యక్షత వహిస్తారు.


Leaderboard after 11 Races

Under 19 International Class
Dharani Laveti and Vadla Mallesh Telangana 16 points
Nancy Rai & Aniraj Sendhav Madhya Pradesh 18 Points
Vidyanshi Mishra & Manish Sharma Madhya Pradesh 25 Points
Under 15 Optimist Class Boys
Eklavya Batham Madhya Pradesh 15 Points
Sharanya Yadav NBSC Goa 27 Points
Ajay Gajji NBSC Goa 39 Points
Under 15 Optimist Girls
Deekshita Komaravelly Telangana 52 Points
Shagun Jha Madhya Pradesh 55 Points
Aarti Verma CESC Maharashtra 142 Points

Leave a Reply