రిటైల్ ఫైనాన్సింగ్ అవకాశాలను మెరుగుపరచడానికి బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ తో భాగస్వామ్యం చేసుకున్న టయోటా కిర్లోస్కర్ మోటర్

తెలుగు సూపర్ న్యూస్,బెంగుళూరు, జూన్ 6, 2023 :వినియోగదారుల అనుభవాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో, టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) , నేడు భారతదేశపు ప్రముఖ,వైవిధ్యభరితమైన ఆర్థిక సేవల సంస్థలలో ఒకటైన బజాజ్ ఫిన్‌సర్వ్ లిమిటెడ్‌లో భాగమైన బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ (BFL) తో ఒక అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేస్తున్నట్లు ప్రకటించింది. టయోటా వాహనాన్ని కొనుగోలు చేసే ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా, వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన మెరుగైన రిటైల్ ఫైనాన్స్ ఎంపికలను అందించడానికి ఈ ఎంఓయూ తోడ్పడనుంది.

సాంకేతికత ఆధారిత NBFC, బజాజ్ ఫైనాన్స్ . ఆర్థిక పరిష్కారాల సమగ్ర సేవలను అందిస్తోంది.డిజిటల్‌గా కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించింది. బజాజ్ ఫైనాన్స్‌తో భాగస్వామ్యం వినియోగదారులకు అనుకూలమైన,ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ ఎంపికలను అందిస్తుంది, చివరికి మొత్తం యాజమాన్య అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. BFL తన కొత్త 4-వీలర్ ఫైనాన్స్ వ్యాపారాన్ని జూన్ 1, 2023 నుండి ఫేజ్ 1లో భాగంగా భారతదేశంలోని 89 కీలక ప్రదేశాలలో ప్రారంభిస్తుందని ప్రకటించింది. ఈ స్థానాలు మొత్తం ఆటో పరిశ్రమ విక్రయాలలో దాదాపు 70% కవర్ చేస్తాయి.

ఈ భాగస్వామ్యం,ముఖ్యాంశాలు:

  • ఫ్లెక్సీ లోన్ ప్రతిపాదనతో అధిక స్థోమత, మెరుగైన ఫ్లెక్సిబిలిటీ… ఇది మొదటి రెండు సంవత్సరాలకు తక్కువ EMIతో పాటు ఎనిమిది సంవత్సరాల ఫండింగ్ తో అత్యున్నత మోడల్స్ లేదా వేరియంట్‌లను ఎంచుకోవడానికి వినియోగదారులను అవకాశం కలుగుతుంది. కస్టమర్‌లు తమ సౌలభ్యం ప్రకారం లోన్ మొత్తాన్ని,డ్రాడౌన్ డబ్బును విడిగా చెల్లించే వెసులుబాటును కూడా కలిగి ఉంటారు.,
  • విస్తరించిన వారంటీ ,యాక్సెసరీలతో సహా 100% వరకు ఆన్ రోడ్ ఫండింగ్
  • సరసమైన రీతిలో వడ్డీ రేట్లు సంవత్సరానికి 8.65% నుండి ప్రారంభమవుతాయి.
  • కస్టమర్లకు సౌలభ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో నేరుగా రుణ పంపిణీ ప్రక్రియ ద్వారా డిజిటల్ గా జరుగుతుంది , తద్వారా వారికి ఇష్టమైన టయోటా వాహనాలను అత్యంత సులభంగా కొనుగోలు చేయవచ్చు.

ఈ సందర్భంగా టయోటా కిర్లోస్కర్ మోటర్ సేల్స్ అండ్ స్ట్రాటజిక్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ మాట్లాడుతూ, “మా విలువైన వినియోగదారుల కోసం రిటైల్ ఫైనాన్సింగ్ ఆప్షన్‌లను మెరుగుపరచడానికి బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం చేసుకోవటం పట్ల మేము సంతోషిస్తున్నాము. టయోటా బ్రాండ్ విలువ అయిన కస్టమర్ -ఫస్ట్ విధానం కు కట్టుబడి మేము సౌలభ్యం ,అసాధారణమైన యాజమాన్య అనుభవాన్ని అందించడానికి నిరంతరం కృషి చేస్తున్నాము. ఈ సహకారం ఆ నిబద్ధతకు నిదర్శనం. BFLతో చేతులు కలపడం ద్వారా, మేము విస్తృతమైన రీతిలో, ముఖ్యంగా టైర్ II. టైర్ III మార్కెట్‌లలో వినియోగదారులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. కలిసికట్టుగా , మేము భారతీయ ఆటో పరిశ్రమలో రిటైల్ ఫైనాన్సింగ్ ల్యాండ్‌స్కేప్‌ను మరింతగా పెంచాలని, టయోటా వాహనాన్ని సొంతం చేసుకోవటం లో మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని మా కస్టమర్‌లకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని మరియు అది మరింత ఫలప్రదంగా ఉండాలని కోరుకుంటున్నాము” అని అన్నారు.

బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క ఆటో ఫైనాన్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ శ్రీ సిద్ధార్థ భట్ ఈ భాగస్వామ్యం గురించి వివరిస్తూ, ” టయోటా కిర్లోస్కర్ మోటర్‌తో మా భాగస్వామ్యం తమకు ఇష్టమైన టయోటా మోడల్‌ల కోసం వెతుకుతున్న వినియోగదారులకు మెరుగైన రిటైల్ ఫైనాన్స్ అవకాశాలను అందించడానికి అద్భుతమైన మార్గాలను తెరుస్తుంది. ఇది నూతన ఫోర్-వీలర్ ఫైనాన్సింగ్ వ్యాపారంలో మా ప్రవేశాన్ని సైతం సూచిస్తుంది,టయోటా వంటి ప్రఖ్యాత, విశ్వసనీయ బ్రాండ్‌తో సేవలను ప్రారంభించడం మాకు గౌరవంగా ఉంది. మా డిజిటల్- ఫస్ట్ విధానం , అనుకూలీకరించిన పరిష్కారాలు , నేరుగా ప్రక్రియలు వంటివి మా వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడంలో మాకు సహాయపడతాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్ తో కలిసి , మేము దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు సేవలందించేందుకు,అత్యుత్తమ అనుభవాన్ని అందించడానికి ఎదురుచూస్తున్నాము” అని అన్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా , TKM అతి సులభంగా ఫైనాన్సింగ్ అవకాశాలు వంటి సంబంధిత పథకాలను సకాలంలో అమలు చేయడం ద్వారా కొనుగోలు & యాజమాన్య సైకిల్ అంతటా కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి కృషి చేస్తుంది . ఈ తాజా భాగస్వామ్యం తో పాటుగా టయోటా ఫైనాన్షియల్ సర్వీసెస్ (TFS) ద్వారా ఇన్-హౌస్ ఫైనాన్సింగ్ సొల్యూషన్‌లను సైతం అందిస్తుంది. వీటి తో పాటు, వినియోగదారులకు మరిన్ని అవకాశాలు, సౌకర్యాన్ని అందించడానికి అనేక ఇతర ఫైనాన్సింగ్ ఇన్‌స్టిట్యూట్‌లతో టయోటా భాగస్వామ్యం చేసుకుని అనేక ఇతర ప్రత్యేక సేవలను కూడా వారి విభిన్న ఆర్థిక అవసరాలను తీర్చడానికి ప్రారంభించింది. ఈ ఆఫర్‌లు కేవలం కొత్త వాహనాల కొనుగోలు మాత్రమే కాకుండా అంతకు మించి ఉపయోగించిన కార్లు మరియు సర్వీస్ ప్యాకేజీలను కవర్ చేయడానికి కూడా ఉంటాయి, తద్వారా మొత్తం సానుకూల కొనుగోలు,యాజమాన్య అనుభవాన్ని టయోటా కార్స్ సృష్టిస్తుంది

Leave a Reply