మంచి రోజులు వచ్చాయి అని అంటున్న స్టార్ హీరోయిన్ మెహరీన్‌ …

ఛాలెంజ్ రోల్స్ లో నటించాలి అని అంటున్న మెహరీన్‌ …

2016 లో డైరెక్టర్ హను రాఘవపూడి – నాచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో ప్రేక్షకులు ముందుకు వచ్చిన సినిమా “కృష్ణ గాడి వీర ప్రేమ గాథ” .. ఈ సినిమాతోనే మెహ్రీన్ పిర్జాదా టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయము అయింది .. “కృష్ణ గాడి వీర ప్రేమ గాథ” సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్స్ వచ్చాయి ..తెలుగు సినిమాలతో పాటు హిందీ , తమిళ సినిమాలు కూడా చేసి మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందింది .. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా వచ్చిన ప్రతి ఆఫర్ ను వినియోగించుకొని , ఒక్కో మెట్టు ఎక్కి మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది .. మెహరీన్‌ చివరిగా చేసిన చాణక్య, ఎంత మంచివాడవురా , రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంత స్థాయి లో విజయం సాధించలేకపోయాయి .. ప్రస్తుతము హీరోయిన్ మెహ్రిన్ రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి ఎఫ్ 3 సినిమా ఒకటి మరోక సినిమా మారుతీ డైరెక్షన్ లో వస్తున్న ‘మంచి రోజులు వచ్చాయి’ .. మారుతి డైరెక్షన్ లో మెహరీన్‌ ” , మహానుభావుడు సినిమాలో నటించింది , దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకోవాలి , వచ్చిన ప్రతి ఆఫర్ ను సద్వినియాగం చేసుకుంటూ ప్రేక్షకులకు నా నుండి ఏ సినిమాలు ఆశిస్తారో , అలాంటి సినిమాలు చేస్తాను అని మెహరీన్‌ తెలిపింది .. ప్రస్తుతము హీరో సంతోష్‌ శోభన్, మెహరీన్‌ జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమాలో నటిస్తుంది . ఈ సినిమాను యూవీ కాన్సెప్ట్స్, మరియు మాస్‌ మూవీ మేకర్స్‌ పతాకాలపై వి సెల్యూలాయిడ్, ఎస్‌కేఎన్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా మెహరీన్‌ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మంచి రోజులు వచ్చాయి’లో సాఫ్ట్‌వేర్‌ పద్దు పాత్రలో కనిపిస్తాను. ఇది ఓ కాలనీలో జరిగే కథ. ఇందులోని సన్నివేశాలు, పరిస్థితులను చాలామంది కోవిడ్‌ టైమ్‌లో ఎక్స్‌పీరియన్స్‌ చేసి ఉంటారు. సాధారణంగానే నేను ఫన్నీగా ఉంటాను. అందుకే అల్లరి సీన్స్, కామెడీ సీన్స్‌లో నటించడం చాలా ఈజీగా అనిపిస్తుంది. మా ఇంట్లో మా అమ్మ, నేను కరోనా బారిన పడి ఇటీవలే , కోలుకున్నాం. ‘మహానటి’లో కీర్తీ సురేశ్, ‘ఓ బేబీ’లో సమంత లాంటి పాత్రలు చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగులో ‘ఎఫ్‌ 3’, కన్నడలో శివరాజ్‌కుమార్‌తో ఓ సినిమా చేస్తున్నాను. మరికొన్ని తెలుగు కథలు వింటున్నాను , గ్లామర్ పాత్రలే కాకుండా , నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చెయ్యాలి అని ఉంది ,భవిష్యత్తు లో మరిన్ని ఛాలెంజింగ్ రోల్స్ , డ్రీమ్ రోల్స్ చెయ్యాలని ఉందని తెలిపింది ..