వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్… స్టోరీ ఇదే

కొత్త ప్రయాగం చేస్తున్న వంశీ పైడిపల్లి ...

సూపర్ స్టార్ మహేష్ బాబు – డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన 25 వ సినిమా మహర్షి .. మహేష్ కెరీర్ లోనే మైల్డ్ స్టోన్ సినిమా కావడం పెద్ద విశేషం .. మహేష్ బాబు 25 వ సినిమా కాబట్టి ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు , అశ్వినీదత్ , పీవీపీ లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించారు .. మహేష్‌ ఇమేజ్‌ను మరింత ఎలివేట్‌ చేసే విధంగా యాక్షన్‌, ఎమోషన్‌, కామెడీ, మెసేజ్‌ ఇలా అన్ని ఎలిమెంట్స్‌ ఉండేలా డైరెక్టర్ వంశీ పైడిపల్లి స్టోరీ రెడీ చేశారు ..

52

ఊపిరి సినిమా తరువాత డైరెక్టర్ వంశీ పైడిపల్లి చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మహేష్ బాబు కోసం వెయిట్ చేసి మహర్షి సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు .. మహర్షి లాంటి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాక డైరెక్టర్ వంశీ పైడిపల్లి చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది .. మహర్షి సినిమా తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం డైరెక్టర్ వంశీ పైడిపల్లి పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసినట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి .. ఫైనల్ గా వంశీ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అన్నిటికి ఫుల్ స్టాప్ పెడుతూ , కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ తో సినిమా ఎనౌన్సమెంట్ చేశారు .. కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన తొలి తమిళ-తెలుగు ద్విభాషా సినిమా . ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. విజయ్ తన 65వ చిత్రం ‘బీస్ట్’ సినిమా పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది నుండి ప్రారంభమవుతుంది. ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది .. డైరెక్టర్ వంశీ పైడిపల్లి , విజయ్ కోసం ఎరోటోమానియా అనే అరుదైన మానసిక సబ్జెక్ట్ , తో ఈ స్టోరీ రెడీ చేసినట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి .. విభిన్నమైన స్టోరీ తో వస్తున్న ఈ సినిమా పాయింట్ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకొంటారు అనే సందేహం విజయ అభిమానుల్లో ఉంది . మొత్తానికి ఈ సినిమా స్టోరీ కి సంబంధించి సోషల్ మీడియా లో వస్తున్న వార్తల్లో ఎంత వరకు నిజం ఉన్నదో తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగాలిసిందే …