మరోసారి వార్తల్లోకి ఎక్కిన బిగ్ బాస్ బ్యూటీ …

రూమర్స్ కి చెక్ పెట్టిన హీరోయిన్  తేజస్వి ...

2013 లో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో వచ్చిన మల్టీ స్టారర్ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది తేజస్వి.. ఆ తరువాత మనం , హార్ట్ ఎటాక్ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది .. తేజస్వి సినీ కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి తనకు వచ్చిన పాత్రకు న్యాయం చేస్తూ మంచి పేరు సంపాదించుకొంది., తేజస్వి చేసిన సినిమాల్లో ముఖ్యంగా పండగ చేస్కో , కేరింత , సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ,నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ , శ్రీమంతుడు , సినిమాలు తనకు మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది .. 2014 లో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన “ఐస్ క్రీం” సినిమాలో హీరో నవదీప్ సరసన సోలో హీరోయిన్ గా తేజస్వి నటించింది . ఈ సినిమా మాత్రం తేజస్వి కి చేదు అనుభవం మిగిలిచింది .. తెలుగమ్మాయి తేజస్వి యాక్టర్ గా మంచి గుర్తింపు దక్కించుకుని ఆ తరువాత బిగ్ బాస్ షో లో కూడా సందడి చేసింది.

తెలుగు ప్రేక్షకులకు బాగా ఆకట్టుకొని బుల్లి తెర మరియు వెండి తెరతో పాటు ఓటీటీ ద్వారా కూడా ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తుంది. హీరోయిన్ గా కూడా కొన్ని సినిమాల్లో నటిస్తూ ,యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది .. బిగ్ బాస్ షో తో ఫుల్ పాపులర్ అయిన తేజస్వి , సోషల్ మీడియా లో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది , సోషల్ మీడియా లో హాట్ ఫొటో షూట్స్ ను షేర్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది .. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియా లో షేర్ చేసిన ఫొటో షూట్ ఒకటి వైరల్ అయ్యింది. తెల్లటి డ్రస్ లో నడుము అందాలను చూపిస్తూ ఎల్లోర శిల్పం మాదిరిగా నిల్చున్న తేజస్వి చాలా అందంగా ఉందంటూ పలు కామెంట్స్ వచ్చాయి. తేజస్వి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా కొన్ని కామెంట్స్ సోషల్ మీడియా లో వినిపిస్తున్నాయి ..మరి ఈ వార్తల్లో నిజం ఎంతవరకు ఉన్నదో తెలియదు కానీ , సోషల్ మీడియా లో తేజస్వి ఫొటో షూట్ మాత్రం విపరీతంగా వైరల్ అయింది .. సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా తేజస్వి ఆరోగ్యం గురించి కొన్ని వార్తలు వస్తున్నవి రూమర్స్ అని తెలుస్తుంది ..ప్రస్తతం తేజస్వి ” యక్షిణి” అనే ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో రాబోతుంది. అందుకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్పీడ్ గా జరుగుతున్నాయి .. మొత్తానికి తేజస్వి తన ఫొటోలతో మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది. సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన హాట్ ఫొటో షూట్ కు కామెంట్స్ బాగా వస్తున్నాయి …