వరమహాలక్ష్మి వ్రతం కోసం ‘ఆర్ణ’ కలెక్షన్ విడుదల చేసిన తనిష్క్

ఆగస్టు 21,2023:సంపద, సంతోషం, సుఖం అందించే దేవతను పూజిస్తూ చేసుకునే పండుగ వరమహాలక్ష్మి. భారతదేశపు అతిపెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ కావటం తో పాటుగా టాటా గ్రూప్ కు చెందిన తనిష్క్, కళాత్మకంగా రూపొందించిన, సూక్ష్మ అంశాలకు సైతం అత్యున్నత ప్రాధాన్యత అందిస్తూ తీర్చిదిద్దిన ” ఆర్ణ ” పేరిట కాలాతీత ఆభరణాల కలెక్షన్ ను అందజేస్తుంది.

తమ సొంత వారసత్వాన్ని సృష్టించే ప్రతి మహిళ ఆత్మను ఒడిసిపట్టే రీతిలో ఈ కలెక్షన్ రూపొందించబడింది. పండుగ ఆనందాన్ని జోడించడానికి, తనిష్క్ ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై ఉచిత గోల్డ్ కాయిన్ని అందిస్తోంది. అద్భుతమైన డిజైన్‌ల వైభవాన్ని అనుభవించడానికి ,ఈ సీజన్‌లో కొత్త ప్రారంభాన్ని వేడుకగా జరుపుకోవడానికి వజ్రాభరణాల విలువ తనిష్క్ ఎక్స్‌ఛేంజ్‌పై 20% వరకు తగ్గింపుని అందిస్తోంది.

ఈ ఆఫర్ ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణలోని అన్ని తనిష్క్ స్టోర్‌లలో పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ పవిత్రమైన వర మహాలక్ష్మి సందర్భంగా, తనిష్క్ ఈ వరమహాలక్ష్మీ దేవత & ఆమె వివిధ రూపాల నుండి ప్రేరణ పొంది ప్రత్యేకమైన వరమహాలక్ష్మి కలెక్షన్ ‘ఆర్ణ’ను విడుదల చేసింది.

ఈ కలెక్షన్ మనలో ప్రతి ఒక్కరిలో వైవిధ్యమైన రూపాలలో కనిపించే దైవత్వానికి ఒక నివాళిగా ఉంటుంది. ఇతర పూజ్యమైన భారతీయ పండుగల మాదిరిగానే, వరమహాలక్ష్మిని శ్రావణ మాసంలో ‘వరాలు’, కోరికలు అందించే లక్ష్మీ దేవిని పూజించటం ద్వారా జరుపుకుంటారు. ఆమె సంపద, శ్రేయస్సు, సమృద్ధి దూత! ఈ రోజున అమ్మవారితో కలిసి పని చేయడం ఆమె 8 రూపాలను పూజించటం తో సమానంగా భావిస్తుంటారు.

ఈ వర్మహాలక్ష్మి నాడు, తనిష్క్ లక్ష్మీ దేవి వివిధ రూపాల సమ్మేళనం అయిన స్త్రీ ఆమె ఆత్మను జరుపుకుంటుంది. ఆమె రక్షకురాలు ; ఆమె ఒక మహోన్నత ప్రదాత . ఈ రోజున ఆమె మంజూరు చేసే బహుళ ‘వరాలు’ కోసం ఆమెను అలంకరించాలని తనిష్క్ కోరుకుంటుంది.

ఆమె కోసం, తనిష్క్ ” ఆర్ణ ” ను పరిచయం చేస్తుంది (“అల”. లక్ష్మీ దేవత యొక్క నీటి అర్థంతో కూడిన సారాంశం.) – ఆమెలో ఉండే బంగారు శక్తిని అలంకరించే లక్ష్యంతో రూపొందించబడిన కలెక్షన్ ఇది. నేటి లక్ష్మి కాలాతీత అందమైన , వైవిధ్యమైన అభిరుచులను తీర్చడానికి ఈ కలెక్షన్ లో ప్రత్యేకమైన నెక్‌వేర్, హరామ్‌లు, జడ, వంకీ, నడుము బెల్ట్‌లు, చెవిపోగులు & బ్యాంగిల్స్‌తో కూడిన అత్యంత నాణ్యమైన & విభిన్నమైన డిజైన్‌లతో బంగారం, కలర్ స్టోన్స్ & ముత్యాలు ఉన్నాయి.

ఈ వరమహాలక్ష్మి నాడు , మీ ప్రకాశాన్ని అలంకరించడానికి దివ్యత్వం స్పర్శను కలిగి ఉన్న ఆభరణాలతో మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. అలాగే, ఈ పండుగ సీజన్ కోసం ప్రత్యేకంగా తనిష్క్ అమలు చేస్తున్న అద్భుతమైన ఆఫర్‌లను పొందండి. తనిష్క్ రూపొందించిన ” ఆర్ణ ” తో ఈ అందమైన పండుగ పవిత్రమైన స్ఫూర్తిని సంగ్రహించే ఆభరణాలతో మీ అందాన్ని పెంచుకోండి.

Leave a Reply