10వతరగతి ఫలితాల్లో డీపీఎస్ నాచారం విద్యార్థుల టాలెంట్..

తెలుగు సూపర్ న్యూస్,మే12,2023: SSE (2022-23) బోర్డ్ ఎగ్జామ్స్‌లో 100% ఉత్తీర్ణత సాధించిన 10వ తరగతి విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందిస్తున్నందుకు పాఠశాల యాజమాన్యం ఎంతో గర్వపడుతోంది. తమ స్కూల్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంలో కృషిచేసిన టీచర్స్ ను డీపీఎస్ యాజమాన్యం ప్రశంసించింది.

నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులైన ప్రణవ్ చౌరాసియా (596/600 – 99.3%)తో మొదటి స్థానంలో, సత్యార్థ్ శివకుమార్ అయ్యర్ (593/600-98.8%)తో ద్వితీయ స్థానంలో, గోటూరి షణ్ముఖ శ్రీహర్ష (592/600-98.7%)తో తృతీయ స్థానంలో, చంద్రిక శ్రీష్ నారాయణ్ (591/600-98.5%)తో నాలుగో స్థానంలో, హర్షవర్ధన్ రవిచందర్ (590/600-98.3%)తో ఐదవ స్థానంలో నిలిచారు.

పల్లవి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఛైర్మన్ మల్కా కొమరయ్య, డైరెక్టర్ శ్రీమతి పల్లవి, సీఓఓ మల్కా యశస్వి, సీనియర్ ప్రిన్సిపాల్ సునీతరావు, వైస్ ప్రిన్సిపాల్ సురేఖ నయని ,ఉపాధ్యాయుల దూరదృష్టి వల్లే ఈ సంవత్సరం అత్యుత్తమ ఫలితాలు సాధించామని డీపీస్ యాజమాన్యం తెలిపింది.

డీపీఎస్ లోని 98 మంది విద్యార్థులు 95%అంతకంటే ఎక్కువ, 231 మంది విద్యార్థులు 90% ఆపైన మార్కులు సాధించారు. 445 మంది విద్యార్థులు 80% ఆపైన మార్కులు సాధించారు, 573 మంది 70% ఆపైన మార్కులు తెచ్చుకున్నారు.

మొత్తం 663 మంది విద్యార్థులు (100%) 60% ,అంతకంటే ఎక్కువ స్కోర్ చేశారు. ఇంగ్లిష్, ఫ్రెంచ్, గణితం, సైన్స్, సోషల్ సైన్స్, తెలుగు, ఐటీలో 79 మంది విద్యార్థులు, హిందీలో అత్యధికంగా 99 మంది విద్యార్థులు సెంటమ్‌లు సాధించారు.

Leave a Reply