మదుపరులు స్టాక్‌ ఎగ్జిట్‌ స్ట్రాటజీతో తమ పోర్ట్‌ఫోలియోను ఆప్టిమైజ్‌ చేసుకునేందుకు జార్విస్‌ ప్రొటెక్ట్‌ను విడుదల చేసిన జార్విస్‌..

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్,ఫిబ్రవరి 8,2023: భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత పెట్టుబడి సలహా వేదిక జార్విస్‌ ఇన్వెస్ట్‌ నేడు రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ సేవ జార్విస్‌ ప్రొటెక్ట్‌ను విడుదల చేసింది.

జార్విస్‌ సిస్టమ్‌కు అప్‌లోడ్‌ చేసిన ఏదైనా పోర్ట్‌ఫోలియో నుంచి ఇది మదుపరులు లాభాలను నమోదు చేసుకోవడం లేదా నష్టాలను తగ్గించుకోవడంలో తగిన సూచనలు చేస్తుంది. జార్విస్‌ పోర్ట్‌ఫోలియోను విజయవంతంగా విడుదల చేసిన తరువాత విడుదల చేసిన రెండవ ఉత్పత్తి ఇది.

డీఐవై రిటైల్‌ మదుపరులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే రీతిలో జార్విస్‌ ప్రొటెక్ట్‌ను రూపొందించారు. ఇది అత్యంత సమర్ధవంతమైన రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ టూల్‌గా మదుపరులకు తోడ్పడుతుంది.

ఈ సేవలు అత్యంత అందుబాటు ధరలో భారతీయ ఈక్విటీ మార్కెట్‌లోని ఏదైనా పోర్ట్‌ఫోలియోకు లభ్యమవుతుంది.
జార్విస్‌ ప్రొటెక్ట్‌ గురించి జార్విస్‌ ఇన్వెస్ట్‌ ఫౌండర్‌–సీఈఓ సుమిత్‌ చందా మాట్లాడుతూ ‘‘ సరైన సమయం, ధరలలో స్టాక్స్‌ కొనుగోలు చేయడం వల్లనే దీర్ఘకాలంలో సంపద సృష్టించలేమని అన్నారు.

ఎప్పుడు ఆ స్టాక్‌ లేదా పోర్ట్‌ఫోలియో నుంచి బయటకు రావాలో కూడా తెలిసి ఉండాలి. భారతదేశంలో డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అయితే రిటైల్‌ ఇన్వెస్టర్లు స్టాక్స్‌ ఉంచుకోవడం లేదా తమ వ్యక్తిగత రిస్క్‌ స్వీకరణ, పెట్టుబడి లక్ష్యాలకు తగినట్లుగా లేని స్టాక్స్‌ కొనుగోలు చేయకోవడం వల్ల నష్టపోతుంటారు.

మా ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ పక్షపాత రహిత సూచనలు చేయడం ద్వారా మదుపరులకు సంపద సృష్టిలో సహాయపడుతుంది’’ అని అన్నారు.