హైదరాబాద్‌లో పెయిడ్ ఓటీటీ చందాదారులు : వీక్షణ ప్రాధాన్యతలలో ఒక తరం అంతరం ఉంది
తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్,ఏప్రిల్ 17,2023:సుప్రసిద్ధ మార్కెటింగ్ స్ట్రాటజీ కన్సల్టెన్సీ ఆర్ఎంటీ (రెడ్ మ్యాటర్ టెక్నాలజీస్) తమ నూతన నివేదిక ‘ అండర్స్టాండింగ్ పెయిడ్ ఓటీటీ సబ్‌స్ర్కైబర్స్ ఆఫ్ హైదరాబాద్’ను విడుదల చేసింది. ఈ నివేదికలో హైదరాబాదీల ఓటీటీ వీక్షణ అలవాట్లను వెల్లడించారు. ఇంటర్నెట్పై చురుకుగా ఉన్న, ఇంటర్నెట్ సబ్‌స్ర్కిప్షన్‌పై ఖర్చు చేస్తున్న మరీ ముఖ్యంగా వర్కింగ్ గ్రూప్ వీక్షకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ నివేదిక వెల్లడించే దాని ప్రకారం 77% మంది ఉద్యోగాలు లేదంటే సొంత వ్యాపారాలు చేస్తున్న వారు మాత్రమే గాక, సరాసరిన నెలకు 60 వేల రూపాయలు ఆర్జిస్తున్నవారు.
ఈ నివేదిక వెల్లడించే దాని ప్రకారం, 26 ఏళ్ల లోపు వ్యక్తులు ఓటీటీని ఒంటరిగా వీక్షించాలనుకుంటున్నారు. పెద్ద వయసు అంటే 35 సంవత్సరాల లోపు వ్యక్తులు 55% మంది కుటుంబంతో కలిసి టీవీ చూడాలనుకుంటున్నారు.
ఈ నివేదికలో ఓటీటీ ప్లాట్‌ఫామ్ చందాలను కలిగిన హైదరాబాద్ వీక్షకుల వీక్షణ అలవాట్లను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఉదాహరణకు, 62% మంది యాక్టివ్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ కలిగి ఉన్నారు. ఓటీటీ కంటెంట్ పరంగా 52% మంది హిందీ కంటెంట్ చూస్తుంటే, 14% మంది మాత్రమే తెలుగు కంటెంట్ చూస్తున్నారు. మహిళల పరంగా మాత్రమే చూస్తే 60% మంది తెలుగు కంటే హిందీ, ఇంగ్లీష్ కంటెంట్ చూడటానికి ఇష్టపడుతున్నారు.
ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో 70% యూజర్లను ప్రైమ్ వీడియో కలిగి ఉంటే, ప్రతి రోజూ 3గంటలకు పైగా సమయాన్ని ఓటీటీల్లోనే హైదరాబాదీలు గడుపుతున్నారు. అలాగే వారాంతాలలో 10% అదనపు వ్యూయర్షిప్ మిగిలిన రోజులతో పోలిస్తే కనిపిస్తుంది.
ఆర్ఎంటీ సీఈఓ శ్రీకాంత్ రాజశేఖరుని మాట్లాడుతూ మన రోజువారీ జీవితాలలో ఓటీటీలు అంతర్భాగమయ్యాయి. వినియోగదారుల ప్రాధాన్యతలను తెలుసుకుని తదనుగుణంగా కంటెంట్‌ను ఓటీటీలు సృష్టించడం కీలకమన్నారు.
ఆర్ఎంటీ వద్ద ఇన్సైట్స్ హెడ్ అమన్ మాట్లాడుతూ ఈ నివేదికలోని అంశాలతో వ్యాపార సంస్ధలు మరింతగా లక్ష్యిత కంటెంట్ సృష్టించగలవన్నారు.
· 36 సంవత్సరాలు దాటిన వ్యక్తులలో 55% మంది తమ కుటుంబ సభ్యులతో కలిసి చూడాలనుకుంటున్నారు
· విభిన్న వయసు వ్యక్తుల వీక్షణ ప్రాధాన్యతలకనుగుణంగా హైదరాబాద్‌లో పెయిడ్ ఓటీటీ చందాదారుల అలవాట్లను వెల్లడించారు
· హైదరాబాద్‌లో 52% మంది హిందీ ఓటీటీ కంటెంట్‌కు ప్రాధాన్యతనిస్తున్నారు. ఆ తరువాత 28% మంది ఇంగ్లీష్ ఓటీటీ కంటెంట్‌కు ప్రాధాన్యతనిస్తే, 14% మంది మాత్రమే తెలుగు కంటెంట్‌కు ప్రాధాన్యతనిస్తున్నారు.
· హైదరాబాదీలను ఆకట్టుకోవడంలో ప్రాంతీయ ఓటీటీ సంస్థలు ఇబ్బంది పడుతున్నాయి