“మిస్టర్ కళ్యాణ్”చిత్రం రివ్యూ

Mr Kalyan (2023) movie review and rating

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్,మార్చి 10,2023:శ్రీమతి ఉష శ్రీ సమర్పణలో శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించబడిన చిత్రం మిస్టర్ కళ్యాణ్. మార్చి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో మాన్యం కృష్ణ, అర్చన, హీరో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాతో పండు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాత సుబ్బారెడ్డి ఈ సినిమాను నిర్మించారు. సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం.

కథ:
హీరో కళ్యాణ్ (కృష్ణ మాన్యం) ఒక కాల్ బాయ్. అలా అతని వృత్తిలో ఉన్న కళ్యాణ్ కు కొన్ని క్యారెక్టర్లు తారసపడతాయి. ఆ పాత్రలు కళ్యాణ్ తో కొన్ని ఎమోషన్స్ ను పంచుకుంటాయి. అదే సిటీలో చాపెల్ ( సప్తగిరి ) ఒక కార్పొరేట్ వ్యవస్థ పెట్టి కాల్ బాయ్ కంపెని రన్ చేస్తూ ఉంటాడు, ఈ క్రమంలో చాపెల్ తన కంపెనీలో జాన్ అవ్వమని కళ్యాణ్ ను రిక్వెస్ట్ చేస్తాడు. కానీ కళ్యాణ్ అతని మాట వినడు. కళ్యాణ్ కాల్ బాయ్ గా చేస్తున్న ఒకానొక సందర్భంలో తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి సారిక (అర్చన) కు దొరికిపోతాడు. ఆ తరువాత సారిక కళ్యాణ్ ను ఎలా ట్రీట్ చేసింది ? కళ్యాణ్, చాపెల్ చివరికి ఏమయ్యారు ? అసలు కళ్యాణ్ కాల్ బాయ్ గా ఎందుకు మారాడు వంటి విషయాలు తెలియాలంటే మిస్టర్ కళ్యాణ్ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
మిస్టర్ కళ్యాణ్ సినిమా మొదటి భాగం వినోదాత్మకంగా సాగుతుంది. సప్తగిరి తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. సప్తగిరి కి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ పాత్రల్లో నటించిన ధనరాజ్, బాబీ వారి పాత్రల్లో బాగా నటించి మెప్పించారు. హీరోయిన్ అర్చన బాగా నటించింది, సారిక పాత్రలో ఒదిగిపోయింది. హీరో ప్రయాణంలో తనకు పరిచయం అయిన నాలుగు పాత్రలు మనలోని ఎమోషన్స్ ను తట్టి లేపుతాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఒక ఇంట్రెస్ర్ తప్పకుండా కలుగుతుంది. సెకండ్ హాఫ్ హ్యూమన్ ఎమోషన్స్, బంధాలు వాటి విలువల గురించి అద్భుతంగా చూపించారు.

దర్శకుడు పండు కు మిస్టర్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ మూవీ అయినప్పటికీ అనుభవం కలిగిన దర్శకుడిలా చేశాడు. తాను రాసుకున్న కథ కథనాలు తెర మీద చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. మ్యూజిక్ డైరెక్టర్ సుక్కు మొత్తం 5 పాటలను బాగా ఇచ్చాడు. నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా చేశాడు. సాహిత్యం కూడా తనే ఇవ్వడం విశేషం. ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ గా మ్యూజిక్ డైరెక్టర్ సుకుమార్ నిలబడ్డాడని చెపొచ్చు. కెమెరామెన్ నానాజి, ఎమ్.వి.గోపి వీరి పనితనం అద్భుతం వారి కెమెరా వర్క్ తో సినిమా నెక్స్ట్ లెవెల్ వెళ్లిందని చెప్పక తప్పదు.

డైరెక్టర్ పండు, కెమెరామెన్స్ నానాజి , ఎమ్.వి.గోపి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సుకుమార్ కొత్తవల్లే అయినప్పటికీ అనుభవం కలిగిన టెక్నిషన్స్ లా చేసి మిసర్ట్ కళ్యాణ్ సినిమాను నిలబెట్టారు. ఎడిటర్ వినోద్ అద్వయ్ సినిమాను చాలా నీట్ గా కట్ చేశారు. అతని వర్క్ బాగుంది. ఈ సినిమాకు ఫైట్స్ బిగ్ ప్లస్, షావాలింన్ మల్లేష్ మాస్టర్ కంపోజ్ చేసిన నాలుగు ఫైట్స్ అద్భుతంగా ఉన్నాయి. అనిష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన నాలుగు పాటలు డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో బాగా తీశారు. మాస్టర్ కొరియోగ్రఫీ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.

నిర్మాత ఎన్. వి.సుబ్బారెడ్డి ఖర్చుకు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మిస్టర్ కళ్యాణ్ సినిమాను నిర్మించారు. శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ లో వచ్చిన మొదటి సినిమా మిస్టర్ కళ్యాణ్ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. అన్ని వర్గాల వారికి నచ్చే చాలా ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా చూస్తే నిర్మాత ఎన్. వి. సుబ్బారెడ్డి అభిరుచి స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి మంచి కథ బలం ఉన్న సినిమాలు నిర్మాత తీయాలని కోరుకుందాం. వినోదం తో పాటు ఎమోషన్స్, వాల్యూస్, మెసేజ్ ఈ సినిమాలో బాగున్నాయి.

సినిమా: మిస్టర్ కళ్యాణ్
విడుదల తేది: మార్చి 10, 2023.
నటీనటులు: కృష్ణ మాన్యం, అర్చన, సప్తగిరి, ధనరాజ్, తాగుబోతు రమేష్, రాజ్ వర తదితరులు
డైరెక్టర్: పండు
నిర్మాత: ఎన్. వి. సుబ్బారెడ్డి
సంగీతం: సుక్కు
సినిమాటోగ్రఫీ: నానాజీ. ఎంవి.గోపి
ఎడిటర్: వినోద్ అద్వయ్
డాన్స్: అనీష్
ఫైట్స్: మల్లేష్

చివరిగా: మిస్టర్ కళ్యాణ్ అందరిని మెప్పిస్తాడు.

రేటింగ్: 3/5

చెడ్డిగ్యాంగ్ సినిమా రివ్యూ

CheddiGang Movie,

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్,ఫిబ్రవరి 17,2023: వెంకట్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో హీరో గా నటించిన “చెడ్డీ గ్యాంగ్ సినిమా” కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనవస్తుంది.

వెంకట్ కళ్యాణ్, గాయత్రీ పటేల్, లక్ష్మణ్ మీసాల, జబ్బర్థస్ అప్పారావు, విజయ్ కార్తిక్ తోట, తదితర నటీనటులు ఎవరికివారు తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారనే చెప్పాలి.

సినిమా స్టోరీ..

కథ లోకి వెళ్తే హీరొ జానీ (వెంకట్ కళ్యాణ్) వాళ్ల ఫ్రెండ్స్ తో కలిసి చెడ్డి గ్యాంగ్ లా మారి దొంగతనాలు చేస్తుంటారు.. ఒక పల్లటూరికి వెళ్లి దొంగతనం చేస్తుంటే ఆ ఊరి పెద్దలు పట్టుకుంటారు, అసలు మీరు దొంగలుగా ఎలా మారారు..?

అనీ అడుగుతారు..అప్పుడు జానీ దొంగగా ఎలా మారాడు అని ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. ఏం జరిగింది? ఎందుకు దొంగ అయ్యాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!

హీరో; వెంకట్ కళ్యాణ్
హీరోయిన్: గాయత్రి పటేల్
డి ఓ పి: జి కె యాదవ్ బంక
సంగీతం: అర్జున్
లిరిక్స్: విహారి
ఎడిటింగ్; నర్సింగ్ రాథోడ్
ఆర్ట్,; రెడాన్ ఎస్కే, ఎమ్ ఏ
కొరియోగ్రాఫర్ : భాను.
నిర్మాత : సి హెచ్ క్రాంతి కిరణ్
స్టొరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : వెంకట్ కళ్యాణ్.

ప్లస్ పాయింట్ : హీరో వెంకట్ కొత్తవాడైనా గానీ స్క్రీన్ మీద మాంచి ఎనర్జీ తో నటించాడు. యాక్టింగ్ లో చాలా హుషారు కనిపించింది. తన పక్కన ఫ్రెండ్స్ కూడా చాలా బాగా చేశారు. హీరోయిన్ గాయత్రీ అందంగా ఉంది…

మీసాల లక్ష్మణ్ కారెక్టర్ సినిమా కీ మైన్ .. లక్ష్మణ్ చాలా బాగా నటించాడు. ఒక కొత్త కారెక్టర్ అని చెప్పాలి. తనకి.. అలాగే అప్పారావు కారెక్టర్ కూడా చాలా బాగుంది. బాబా కారెక్టర్ లో కడుపుబ్బ నవ్వించాడు. మిగిలిన నటులు కూడా చాలా బాగా చేశారు.

మైనస్ పాయింట్: సెకండ్ హాఫ్ లో కొంచెం కామెడీ సీన్స్ ఉంటే బాగుండు అనిపించింది.

సాంకేతిక వర్గం : ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. కథకి ఎంత అవసరమో అంత ఖర్చుపెట్టారు. కెమెరా పనితనం బాగుంది.. సినిమా అంతా చాలా కలర్ ఫుల్ గా తీర్చి దిద్దారు.. ఎడిటింగ్ బాగుంది..

CheddiGang Movie,

లొకేషన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. మాటలు, పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్.. దర్శకుడు తను చెప్పాలనుకున్న పాయింట్ ను ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా బాగా చెప్పాడు.

మంచి యూత్ ఎంటర్టైనర్..

ఫైనల్ గా చూస్తే.. ఒక మంచి యూత్ ఎంటర్టైన్మెంట్ స్టోరీతో వచ్చిన చెడ్డీ గ్యాంగ్ సినిమా చూసి అందరూ ఎంజాయ్ చేసేలా ఉంది.

రేటింగ్: 3/5..

“దర్జా” మూవీలో.. అదరగొట్టిన అనసూయ..

తెలుగు సూపర్ న్యూస్, హైదరాబాద్,జూలై 22,2022: రంగస్థలం లో రంగం అత్తగా మంచి క్రేజ్ తెచ్చుకున్న బుల్లి తెర యాంకర్ అనసూయ ..పుష్ప సినిమాలో సునీల్ సరసన యాంగ్రీ విమెన్ గా నటించి మంచి మార్కులే కొట్టేసింది. ఇప్పుడు దర్జా గా సోలో గా నటించి మన ముందుకు వచ్చింది. ఇందులో కూడా కమెడియన్ కం హీరో సునీల్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు.

సునీల్ తో పాటు ఈ చిత్ర కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ నిర్మాత రవి పైడిపాటి ఓ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రానికి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సమర్పణ. పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రంగా తెరకెక్కింది. ఈ చిత్రానికి సలీమ్ మాలిక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మించారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా రవి పైడిపాటి వ్యవహరించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లేడీ ఓరియెంటెడ్ క్యారెక్టర్ లో ఆమె ఎలా ఒదిగిపోయిందో ఓ సారి చూద్దాం..

కథ: బందరు కనకం అలియాస్ కనక మహాలక్ష్మి (అనసూయ) అంటే బందరు చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు హడల్. పోలీస్ యంత్రాంగాన్ని సైతం తన రౌడీయిజంతో శాసిస్తు తన గుప్పెట్లో పెట్టుకుని దందా సాగిస్తుంటుంది. ఈ క్రమంలో గణేశ్ (అరుణ్ వర్మ) తను ప్రేమించిన అమ్మాయి పుష్ప(శిరీష) చేతిలో మోసపోయి ఉరేసుకుని చనిపోతాడు. తన అన్న చావుకి కారణం అయిన పుష్పని… గణేశ్ తమ్ముడు రంగ (షమ్ము) చంపాలని చూస్తుండగా… కొత్తగా వచ్చిన బందరు ACP శివ శంకర్ పైడిపాటి(సునీల్) అడ్డుకుని.. ఆ కేసు విచారణ చేపడతాడు. మరి గణేష్ చనిపోవడానికి కారణం పుష్ప మోసం చేయటం వల్లనేనా? బందరు కనకం ఆగడాలను ACP ఎలా ఆట కట్టించాడు? అసలు ACP శివశంకర్ ఎవరు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!!!

కథ… కథనం విశ్లేషణ: లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ వుంది. ఎప్పుడూ యూత్ ను ఆకట్టుకునే పాత్రల్లో నటించిన యాంకర్ అనసూయ దర్జాలో ఓ పవర్ ఫుల్ విలన్ పాత్ర పోషించింది. ఈ పాత్రను హైలైట్ చేయటం కోసం దర్శకుడు ఎంచుకున్న స్టోరీ… దాని చుట్టూ రాసుకున్న స్క్రీన్ ప్లే ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. అనసూయ పాత్ర ఆది నుంచి చివరి దాకా ఎంతో క్రూరంగా సాగి ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీని పెంచుతుంది. అలాగే సునీల్ ఏసీపీ పాత్రలో వచ్చే ట్విస్ట్ లు ఆడియెన్స్ ని బాగా ఎంగేజ్ చేస్తాయి. ఓ వైపు బందర్ కనకం ఆగడాలను చూపిస్తూనే… మరో వైపు గణేష్, పుష్పాల స్వఛ్చమైన ప్రేమను… అలానే రంగ, తీన్ మార్ గీతల చిలిపి ప్రేమను, ఆమని, తన పిల్లల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్… శకలకశంకర్, థర్టీ ఇయర్స్ పృథ్వీల కామెడి అన్నీ మాస్ ను బాగ ఎంటర్టైన్ చేస్తాయి. చివర్లో వచ్చే మాస్ బీట్ సాంగ్ ఆడియెన్స్ ని అలరిస్తుంది.

అనసూయ పుష్పా తరవాత మంచి రౌద్రం వున్న పాత్రలో నటించి మెప్పించారు. విలనిజం తాలూకు పాత్రలో వచ్చే డైలాగ్స్ చాలా బాగా చెప్పింది. ACP శివశంకర్ పాత్రలో మాస్ ని మెప్పించేలా యాక్షన్ సీన్స్ తో మెప్పించాడు. ఈ చిత్రం కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటి డెబ్యూ అయినా… పోలీస్ పాత్రలో ఒదిగిపోయాడు. శమ్ము, అరుణ్ వర్మ అన్నదమ్ముల పాత్రల్లో లీనమై నటించారు. అలానే శిరీష, అక్సాఖాన్ అక్కా చెల్లెళ్ళుగా నటించి ఆకట్టుకున్నారు. చివర్లో ఆక్సాఖాన్ చేసిన మాస్ బీట్ సాంగ్ యూత్ ని ఉర్రూతలూగిస్తుంది. షకలక శంకర్, పృథ్వీ, పాల్ రాము బాగ నవ్వించారు. మహేష్ సిద్ధాంతిగా తన పాత్రకి న్యాయం చేశాడు. విలన్ గా బళ్ళారి పాత్రలో సమీర్ బాగా క్రూరంగా నటించి మెప్పించాడు.

దర్శకుడు సలీమ్ మాలిక్ రాసుకున్న కథ.. కథనాలు బాగున్నాయి. డెబ్యూ మూవీ ఆయినా బాగానే హ్యాండిల్ చేశాడు. డైలాగ్స్ బాగున్నాయి. సంగీతం పర్వాలేదు. చివర్లో వచ్చే మాస్ సాంగ్ ఆడియెన్స్ కి మాంచి కిక్ ఇస్తుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా వుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సీన్స్ మాస్ ను బాగ ఆకట్టు కుంటాయి. నిర్మాతలు ఖర్చుకి వెనుకాడకుండా సినిమాని క్వాలిటీగా నిర్మించారు. గో అండ్ వాచ్ ఇట్..

రేటింగ్: 3.25.