హౌస్ హెల్ప్స్ తో చేసిన సర్వేలో ఇంటి భారం పంచుకుంటున్న జంటలు సంతోషంగా ఉంటారని తేలింది

తెలుగు సూపర్ న్యూస్,ముంబై, జూన్ 6, 2023: మొట్టమొదటి సారిగా , నటి నేహా ధూపియాతో పాటు 100 మంది హౌస్ హెల్ప్స్, ఇంట్లో సమానత్వం, అసమానత ,సంబంధాలపై దాని ప్రభావం, సంకేతాలను వెలికితీశారు. ఈ కార్యక్రమం ఏరియల్ ‘See the Signs #ShareTheLoad’ ఉద్యమంలో ఒక భాగం.

ఇంటి పని వారలతో ఒక ప్రత్యక్ష సర్వేను వీరు నిర్వహించారు. భర్త ఆసక్తి కనబరిచి, ఇంటి పనుల్లో సహాయం చేస్తే ఆ దంపతులు సంతోషంగా ఉంటారని 95% మంది హౌస్ హెల్ప్స్ వెల్లడించారు . భార్యాభర్తలు ఇంటిపనులను సమానంగా విభజించుకోనప్పుడు, వివాహబంధంలో దూరం ఏర్పడుతుందని 80% మంది అభిప్రాయపడ్డారు. భర్తలు ఇంటి పనుల్లో సహాయం చేయనప్పుడు దంపతుల మధ్య సంభాషణ తగ్గిపోతుందని 85% కంటే ఎక్కువ మంది హౌస్ హెల్ప్స్ వెల్లడించారు .

నటి నేహా ధూపియా మాట్లాడుతూ, “సంబంధాలు కాలక్రమేణా ఎలా మారతాయో తెలుసుకోవటానికి హౌస్ హెల్ప్స్ సహాయపడ్డారు. మేము పొందిన ఫలితాలు లోడ్‌ను పంచుకోవడం ప్రాముఖ్యతను వెల్లడించాయి. ఇంటి పనులు ‘అతని’ లేదా ‘ఆమె’ ఉద్యోగం కాదు, మన భాగస్వామ్య బాధ్యత. భారాన్ని పంచుకోవడం ద్వారా, భర్తలు తమ భార్యలపై భారాన్ని తగ్గించవచ్చు తమ బంధాన్ని బలోపేతం చేయవచ్చు. అసమానత కొనసాగితే; అది ఆ సంబంధంలో భావోద్వేగ దూరాన్ని సృష్టించవచ్చు. సంకేతాలను చూసి, #ShareTheLoad చేయవలసిందిగా నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను” అని అన్నారు

P&G ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, P&G భారత ఉపఖండంలోని ఫ్యాబ్రిక్ కేర్ వైస్ ప్రెసిడెంట్,శరత్ వర్మ మాట్లాడుతూ “ఏరియల్‌లో, మేము సానుకూల మార్పును తీసుకురావడానికి సహాయపడే అర్ధవంతమైన సంభాషణలను ప్రారంభించాలనుకుంటున్నాము. ఈ సంవత్సరం, ఒక జంట మధ్య బయటి వ్యక్తిగా సంబంధాలను గమనించే హౌస్ హెల్ప్స్ తో అధ్యయనం చేసాము. భర్త ఆసక్తి కనబరిచి, ఇంటి పనుల్లో సహాయం చేస్తే దంపతులు సంతోషంగా ఉంటారని 95% మంది ఇంటి పని వారు వెల్లడించారు . భార్యాభర్తలు ఇంటిపనులను సమానంగా విభజించుకోనప్పుడు, వివాహబంధంలో దూరం ఏర్పడుతుందని 80% మంది ఇంటివారు చెప్పారు. సంతోషకరమైన వివాహం కోసం #ShareTheLoad చేయమని కోరుతున్నాయి.” అని అన్నారు

తాజా చిత్రానికి లింక్: సీజన్ 6: https://youtu.be/youeaZyavg