నాగ్ సినిమా లో స్పెషల్ సాంగ్ చేస్తున్న ఫరియా…

స్పెషల్ సాంగ్ చేస్తున్న ఫరియా అబ్దుల్లా …

టాలీవుడ్ లో విభిన్నమైన స్టోరీస్ , కంటెంట్ ఉన్న సినిమాలకు డిమాండ్ బాగానే ఉంటుంది , ప్రేక్షకులు అభిరుచులు సినిమా విషయంలోనూ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంది .. కొత్తరకమైన స్టోరీస్ , ఎక్స్పెరిమెంటల్ స్టోరీస్ , కధలో దమ్ము ఉంటే తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాని బాగా ఆదరిస్తారు .. ‘ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ’ సినిమా తో డీసెంట్ హిట్ అందుకున్న నవీన్‌ పొలిశెట్టి ఆ తరువాత అప్ కమింగ్ డైరెక్టర్ తో ‘జాతి రత్నాలు అనే కామిడీ సినిమా చేశారు .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .. ఈ సినిమాలో హీరో నవీన్‌ పొలిశెట్టి సరసన కొత్త హీరోయిన్ ఫరియా అబ్దుల్లా నటించింది ఆరు అడుగుల ఎత్తు , గుడ్ లుకింగ్ స్మైల్ , యాక్టింగ్ తో మొదటి సినిమాతోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది .. ఫరియా అబ్దుల్లా అంటే గుర్తు పట్టడం కాస్త కష్టమవుతుందేమో కానీ, చిట్టి అంటే మాత్రం చాలా త్వరగా గుర్తుపడతారు .. . ఈ సినిమాలో ఫరియా నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు . జాతిరత్నాలు సూపర్ హిట్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మకు వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి ..

తాజాగా ఈ మూడుగుమ్మగా గోల్డెన్ ఛాన్స్ దక్కింది … నాగ్ ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 2016లో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సోగ్గాడే చిన్నినాయనా చిత్రానికి సీక్వెల్ గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. అలాగే నాగ చైతన్య, కృతి శెట్టిలు జంటగా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్ . ఈ సాంగ్ కోసం మేకర్స్ తాజాగా ఫరియాను సంప్రదించారని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి . నాగార్జున, ఫరియాలపై చిత్రీకరించనున్న ఈ స్పెషల్ సాంగ్ ఎంతో ప్రత్యేకంగా ఉండనుందని తెలుస్తోంది. మొత్తానికి సీనియర్ హీరో నాగార్జున తో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం లభించడంతో ఈ అమ్మడు చాలా ఆనందంగా ఉంది …