భారతీయ ఫార్మా పరిశ్రమ గౌరవం కాపాడేందుకు నకిలీ ఔషదాలు,అక్రమ వాణిజ్యం గురించి రోగికి అవగాహన మెరుగుపరచాల్సి ఉంది : నిపుణులు

indian pharma industry

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్,ఏప్రిల్ 17,2023:నకిలీ ఔషద ఉత్పత్తుల సమస్యను అధిగమించేందుకు వెబ్‌సైట్లు రాయితీ ధరలలో ఔషదాలను అందించడం పట్ల రోగులకు అవగాహన కల్పించాల్సిన తక్షణావసరం ఉంది. అసలైన ఔషదాలతో పాటుగా ఈ నకిలీ మందులను కూడా రవాణా చేస్తుండటంతో పాటుగా సరైన నిల్వ, తగిన ట్రాకింగ్‌ లేకపోవడం చేత ప్రజా ఆరోగ్యం ప్రమాదంలో పడేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వ్యక్తులకు పరిమిత అవగాహన ఉండటం వల్ల అక్రమ రవాణాకు అవకాశాలెక్కువవుతున్నాయి. ఈ–కామర్స్‌ వ్యాపారం పెరుగుతుండటమనేది పలు సవాళ్లతో పాటుగా అవకాశాలను సైతం మెడికల్‌ ప్రొడక్ట్స్‌ రంగంలో అక్రమ రవాణా సమస్యను పరిష్కరించేందుకు అందిస్తుంది.

అత్యాధునిక పద్ధతులు అయిన ట్రాక్‌, ట్రేస్‌, బ్లాక్‌ చైన్‌, ఆర్టిఫిషీయల్‌ ఇంటిలిజెన్స్‌ వంటి సాంకేతికతలను వినియోగించడం ద్వారా రెగ్యులేటరీ నియంత్రణ సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో విక్రయాల కోసం ఔషద కంపెనీలు జెన్యూన్‌ ఉత్పత్తులను తయారుచేస్తున్నాయి అయితే వీటిలో కొన్ని కంపెనీలు యెమెన్‌, సొమాలియా వంటి దేశాలలో తమ ఉత్పత్తులకు నకిలీ చేసి విక్రయిస్తున్నారు. ఈ తరహా సమాంతర వ్యాపారం చట్టాలకు వ్యతిరేకమంటున్నారు నిపుణులు.

మొత్తంమ్మీద ఎగుమతులను గురించి ఫార్మాస్యూటికల్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రొమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఫార్మాక్సిల్‌) డైరెక్టర్‌ ఉదయ భాస్కర్‌ మాట్లాడుతూ ‘‘భారతీయ ఎగుమతిదారులు ఔషద సరఫరా చైన్‌ గురించి తెలుసుకోవాల్సి ఉంది. అలాగే డిసీజ్‌ ప్రొఫైల్‌ కూడా తెలుసుకోవాల్సి ఉంది’’ అని అన్నారు

ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యుటీఓ) అంచనాల ప్రకారం అంతర్జాతీయంగా వైద్య రంగంలో 1.3% , 4.2% వాణిజ్యం అక్రమంగానే జరుగుతుంది. కొవిడ్‌ కాలంలో ఇది మరింత ఎక్కువగా కనిపించింది. 2019తో పోలిస్తే 2020లో ఈ జప్తులు 5% అధికమయ్యాయి.

ఫార్మాక్సిల్‌ కన్సల్టెంట్‌ సుమంత చౌదరి మాట్లాడుతూ‘‘ భారతదేశం నుంచి ఫార్మాస్యూటికల్‌ ఎగుమతులు అంతర్జాతీయంగా 200 దేశాలకు వెళ్తున్నాయి. అందువల్ల ప్రభుత్వ, లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు అక్రమ రవాణా అడ్డుకోవడానికి తగిన చర్యలు తీసుకోవడం ద్వారా భారతీయ ఫార్మా గౌరవం కాపాడగలుగుతారు’’ అని అన్నారు

ఈ అక్రమ రవాణా నియంత్రించడానికి సరిహద్దుల నియంత్రణ ఓ మార్గం. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఔషదాల అక్రమ రవాణా అడ్డుకోవడానికి సామర్ధయం మెరుగుపరుచుకోవాల్సి ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు.