మెగాఆఫర్ ను దక్కించుకున్న మారుతి …

మెగా స్టార్ చిరంజీవి కోసం పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసిన డైరెక్టర్ మారుతి 
        

టాలీవుడ్ డైరెక్టర్స్ లో మారుతి దారి వేరు .. 2012 లో ఈరోజుల్లో అనే యూత్ ఫుల్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి , మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరారు డైరెక్టర్ మారుతి .. మారుతి సీని కెరీర్ కనుక చూసినట్లు అయితే లో బడ్జెట్ సినిమా తో సినిమా కెరీర్ పారంబించి , ఇటు యూత్ లోను ఫ్యామిలీ ఆడియెన్స్ లోను తన సినిమాకు ప్రత్యేకమైన మార్కు ను క్రియేట్ చేసుకొని మంచి డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు .. మారుతి , రొటీన్ సినిమాలకు దూరంగా ఉంటూ కాన్సెప్ట్ బేస్ స్టోరీస్ ను , సెలెక్ట్ చేసుకొని , వాటిని పెర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసి డైరెక్టర్ గా సక్సెస్ అయి ఇటు ప్రేక్షకుల్లోనూ , ఇండస్ట్రీ లోను అందరి చేత మంచి ప్రశంసలు అందుకుంటున్నారు ..మారుతి సినిమాలు చాలా విభిన్నంగా ఉంటాయి , ఏ సినిమా చుసిన ఎదో కొత్త పాయింట్ కనబడుతుంది .. మారుతి కెరీర్ మొదట్లో యూత్ ఫుల్ స్టోరీస్ కె ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు , కానీ ఆ తరువాత రూట్ మార్చి ఫ్యామిలీ సినిమాలను కూడా డైరెక్ట్ చేసి బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నారు .. ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి వచ్చిన ‘మహానుభావుడు’ .. ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలు మారుతి కి మంచి పేరు తీసుకొచ్చాయి ..

మారుతి – సాయి ధరమ్ తేజ్ , కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా ప్రతిరోజూ పండగే . ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించి బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .. ప్రతిరోజూ పండగే సినిమా తరువాత డైరెక్టర్ మారుతి చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మాస్ హీరో గోపీచంద్ తో “పక్కా కమర్షియల్ ” అనే సినిమా డైరెక్ట్ చేస్తున్నారు .. గోపీచంద్ తో సినిమా చేస్తూనే , మరో యంగ్ హీరో సంతోష్‌ శోభన్‌ తో మంచిరోజులు వచ్చాయి అనే సినిమాను డైరెక్ట్ చేసి దీపావళి రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు .. ప్రస్తుతము డైరెక్టర్ మారుతి కి సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా లో వినిపిస్తుంది .. మారుతి మెగా స్టార్ చిరంజీవి కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశారు అని , అతి త్వరలోనే మెగా స్టార్ చిరంజీవి తో సినిమా డైరెక్ట్ చేస్తాను అని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి . ప్రస్తుతం డైరెక్టర్ మారుతి చేతిలో పక్కా కమర్షియల్ అనే సినిమా ఉంది . ఈ సినిమా పూర్తి అయితేనే గాని మరొక సినిమా మొదలు పెట్టరు . ప్రస్తుతము , మెగా స్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు , మారుతి ఒక వైపున చిన్న హీరోలతో .. మరో వైపున పెద్ద , హీరోలతో సినిమాలను సెట్ చేస్తూ మారుతి తనదైన ప్రత్యేకతను చూపిస్తూ మందుకు వెళ్తతున్నాడు .. మెగా స్టార్ చిరంజీవి కి నచ్చే స్టోరీ డైరెక్టర్ మారుతి రెడీ చేస్తే ఈ కాంబినేషన్ సెట్ అయినట్లే . మొత్తానికి డైరెక్టర్ మారుతి – మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు మొదలౌతుంది అని విషయం పై క్లారిటీ రావాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగాలిసిందే …