BikeBazaar ఫైనాన్స్ ద్వారా PIQYU డెలివరీ భాగస్వాములకు 2000 ఎలక్ట్రిక్ వాహనాలను పంపిణీ చేయనున్న BGAUSS

ప్రముఖ లాస్ట్-మైల్ లాజిస్టిక్స్ ప్రొవైడర్ అయిన PIQYU , ప్రముఖ ఫైనాన్స్ ప్లాట్‌ఫారమ్ అయిన Bikebazaarతో ప్రతిష్టాత్మక భాగస్వామ్యం చేసుకున్నట్లు ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ BGauss వెల్లడించింది. చివరి-మైలు డెలివరీ కార్యకలాపాలను విప్లవాత్మకంగా మార్చడం. స్థిరమైన రవాణా పరిష్కారాల స్వీకరణను ప్రోత్సహించడం ఈ భాగస్వామ్యం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ భాగస్వామ్యం ద్వారా, BGAUSS నుండి ప్రారంభ 150 యూనిట్ ల ఎలక్ట్రిక్ వాహనాలకు ఫైనాన్సింగ్‌ను బైక్ బజార్ సులభతరం చేస్తుంది. తద్వారా PIQYU ఈ వాహనాలను సజావుగా కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ వ్యూహాత్మక భాఫాస్వామ్యం, హైదరాబాద్‌లో PIQYU 3PL లాస్ట్ మైల్ డెలివరీ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం ఈ సంవత్సరం ఇతర నగరాల్లో విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ భాగస్వామ్యాన్ని గురించి BG ఎలక్ట్రిక్ స్కూటర్స్ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ మరియు RR గ్లోబల్ డైరెక్టర్ హేమంత్ కబ్రా మాట్లాడుతూ, ” ప్రపంచ స్థాయి నాణ్యత మరియు సాంకేతికతతో కూడిన దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తుది వినియోగదారుల కు మాత్రమే కాకుండా వృద్ధి,స్థిరత్వం కోసం ఈ వ్యవస్థ అంతటా భాగస్వామ్యాలతో ముందుకు వెళ్లడమే మా లక్ష్యం. PIQYU,BikeBazaarతో ఈ భాగస్వామ్యంతో, మేము పొదుపు పరంగా ఎలక్ట్రిక్ మొబిలిటీని స్వీకరించడం వల్ల కలిగే ప్రత్యక్ష ప్రయోజనాన్ని ప్రదర్శించాలనుకుంటున్నాము,పరిశుభ్రమైన వాతావరణానికి తోడ్పాటు అందించటం గురించి కూడా వెల్లడిస్తున్నాము” అని అన్నారు.

BG ఎలక్ట్రిక్ స్కూటర్స్ వద్ద , EV ఎకో సిస్టమ్‌ను మెరుగుపరచడానికి ఎలక్ట్రిక్ స్కూటర్‌ల యొక్క ఉత్తమ నాణ్యత, అమ్మకాల తర్వాత సేవను అందించడం లక్ష్యం గా చేసుకున్నాము,ఈ తరహా B2B భాగస్వామ్యాలు జీరో ఉద్గారాల ద్వారా చివరి మైలు డెలివరీలను విస్తరింప చేయడానికి అనుమతిస్తుంది.

BG ఎలక్ట్రిక్ స్కూటర్లు BG D15 ను విడుదల చేసింది. అత్యంత ఆకర్షణీయమైన , 16” వీల్స్ మెటల్ బాడీ స్కూటర్‌ను పూర్తిగా భారతదేశంలోనే తయారు చేసి, సౌకర్యం,భద్రతతో ఎక్కువ సవారీ చేయాలనుకునే భారతీయ వినియోగదారుల పెరుగుతున్న డిమాండ్‌లను తీర్చడానికి పరిచయం చేసింది. ఇది కఠినమైన, స్టైలిష్ మరియు స్మార్ట్ ఉత్పత్తి, ఇది లాస్ట్ మైల్ డెలివరీ భాగస్వాములతో సహా ప్రతి EV ఔత్సాహికుల ఎంపికగా నిలువడానికి సాంకేతికత ,అత్యుత్తమ రైడింగ్ అనుభవాన్ని మిళితం చేస్తుంది.

బైక్ బజార్ ఫైనాన్స్ జాయింట్ ఎండి , కో-ఫౌండర్ కరుణాకరన్ వి మాట్లాడుతూ, “సాంప్రదాయ రిటైల్ ఫైనాన్స్ రుణాలకు భిన్నంగా EV స్వీకరణను వేగవంతం చేయడానికి వినూత్న ఫైనాన్సింగ్ పరిష్కారాలు అవసరం. బైక్ బజార్ ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రత్యేకంగా తీర్చిదిద్ది ఫైనాన్స్ సొల్యూషన్స్‌ని అనుసరించడానికి కట్టుబడి ఉంది. బైక్ బజార్ పర్యావరణ, సామాజిక,పరిపాలన (ESG) అభ్యాసాల రంగంలో సానుకూల ప్రభావాన్ని సృష్టించడానికి అంకితం చేయబడింది,ఈ సహకారం హరిత వాతావరణాన్ని పెంపొందించడంలో మా స్థిరమైన నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. PIQYU , BGAUSS భాగస్వామ్యంతో, ముఖ్యంగా లాస్ట్ మైల్ డెలివరీ సెక్టార్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు మారడాన్ని వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించగల మా సామర్థ్యంపై మాకు నమ్మకం ఉంది…” అని అన్నారు.

ఈ భాగస్వామ్యం సుస్థిర రవాణాకు మూడు కంపెనీల నిబద్ధతను ప్రదర్శించడమే కాకుండా సానుకూల మార్పును నడపడానికి సహకారం ,శక్తిని కూడా ప్రదర్శిస్తుంది. వారి నైపుణ్యం మరియు వనరులను కలపడం ద్వారా, BGauss, PIQYU ,Bikebazzar మరింత స్థిరమైన,పర్యావరణ అనుకూల భవిష్యత్తును సృష్టించే దిశగా గణనీయమైన చర్యలు తీసుకుంటున్నాయి.

PIQYU , సీఈఓ శ్రీ ప్రశాంత్ రెడ్డి ఈ భాగస్వామ్యం గురించి తన ఉత్సాహాన్ని వెల్లడించటం తో పాటుగా మరింత స్థిరమైన భవిష్యత్తు కోసం సంస్థ యొక్క విజన్‌ను వివరించారు. “PIQYU వద్ద , మేము హరిత మరియు మరింత స్థిరమైన డెలివరీ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి కట్టుబడి ఉన్నాము. BGauss , బైక్ బజార్‌లతో మా సహకారం కార్బన్ ఉద్గారాలను తగ్గించడం,పర్యావరణ అనుకూలమైన చివరి మైలు పరిష్కారాలను ప్రోత్సహించడం అనే మా లక్ష్యంతో సంపూర్ణంగా సమలేఖనం చేయబడింది.” అని అన్నారు.

EV లీజ్ టు ఓన్ ప్రోగ్రామ్ ద్వారా డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లకు సాధికారత కల్పించడం,ఆవశ్యకతను శ్రీ ప్రశాంత్ నొక్కి చెప్పారు. “మా డెలివరీ భాగస్వాములకు వృద్ధి,ఆర్థిక స్థిరత్వానికి అవకాశాలను అందించడాన్ని మేము విశ్వసిస్తున్నాము. EV లీజ్ టు ఓన్ ప్రోగ్రామ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లను సౌకర్యవంతమైన చెల్లింపు అవకాశాలతో ఎలక్ట్రిక్ టూ-వీలర్‌లను లీజుకు ఇవ్వడానికి అనుమతిస్తుంది. ఈ ప్రోగ్రామ్ పర్యావరణ అనుకూల మొబిలిటీని ప్రోత్సహించడమే కాకుండా వాహన యజమానులు ,వ్యవస్థాపకులుగా మారడంలో మా డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లకు తగిన సాధికారత ఇస్తుంది,వారికి సహాయం చేస్తుంది” అని అన్నారు

తమ నూతన విద్యుత్‌ స్కూటర్‌ సీ 12ను విడుదల చేసిన BGAUSS

BGAUSS

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్‌, 7 ఏప్రిల్‌ 2023 : BGAUSS ఆటో ప్రైవేట్‌ లిమిటెడ్‌ తమ ప్రతిష్టాత్మక ఈవీ స్కూటర్‌ బీఐ సీ 12 (ఆఎ ఇ12)ను నేడు విడుదల చేసింది. డీ15, బీ8,ఏ2ల విజయాన్ని సీ 12 అనుసరిస్తుంది. ఇది అత్యంత శక్తివంతంగా ఉండటంతో పాటుగా ఆకర్షణీయంగా, ప్రీమియం స్కూటర్‌ అయినప్పటికీ అత్యంత అందుబాటు ధరలో లభ్యం కానుంది. పూర్తి 100% మేడ్‌ ఇన్‌ ఇండియా విద్యుత్‌ స్కూటర్‌ సీ12 , ప్రతి కుటుంబానికీ కాస్త అదనం అనే రీతిలో వస్తుంది. భద్రత,సౌకర్యం కీలక ప్రాధాన్యతలుగాకలిగిన సీ 12 స్కూటర్లు 20కు పైగా భద్రతా ఫీచర్లతో వస్తున్నాయి.

సీ 12 విడుదల సందర్భంగా BGAUSS ఆటో ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫౌండర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ హేమంత్‌ కాబ్రా మాట్లాడుతూ ‘‘ఫేమ్‌ సర్టిఫైడ్‌ వాహనం సీ12ఐ మ్యాక్స్‌. పరిశ్రమలో మొట్టమొదటి తరహా ఫీచర్లు అయినటువంటి బూట్‌ స్పేస్‌ను ఇది కలిగి ఉంది. దీనిలో ఫుల్‌ ఫేస్‌ హెల్మెట్‌ భద్రపరచవచ్చు. కుటుంబానికి అనువుగా పొడవాటి, అత్యంత సౌకర్యవంతమైన సీట్‌ కలిగి ఉండటంతో పాటుగా ఏఆర్‌ఏఐ సర్టిఫికేషన్‌తో సంబంధం లేకుండా 143 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. వాటర్‌ఫ్రూఫ్‌ ఐపీ67 రేటెడ్‌ విద్యుత్‌ మోటర్‌, బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్‌లో 3.2 కిలోవాట్‌ హవర్‌–క్యాన్‌ ఎనేబల్డ్‌ లిథియం–అయాన్‌ బ్యాటరీ ఉంటుంది’’ అని అన్నారు.

భారతదేశ వ్యాప్తంగా 100 కు పైగా షోరూమ్‌లను BGAUSS కలిగి ఉంది. ఈ బ్రాండ్‌ ఇప్పుడు తమ డీలర్‌నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించడం ద్వారా వినియోగదారులకు మరింత చేరువ కావడానికి ప్రయత్నిస్తుంది. స్మార్ట్‌, సురక్షిత, తెలివైన విద్యుత్‌ స్కూటర్లను అందించడానికి BGAUSS కట్టుబడి ఉంది. ఇది వార్షిక నిర్వహణ మద్దతు, మొబైల్‌ యాప్‌ మద్దతు, రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌ వంటివి సైతం అందిస్తుంది.

వినియోగదారులు తాజా BG C12 విద్యుత్‌ స్కూటర్‌లను కంపెనీ వెబ్‌సైట్‌ లేదా దగ్గరలోని డీలర్‌షిప్‌ వద్ద బుక్‌ చేసుకోవచ్చు. BG C12 పరిచయ ధర 97,999 రూపాయలు (పరిమిత స్టాక్‌ వరకూ). BG C12 రెగ్యులర్‌ ధర ఫేమ్‌ 2 రాయితీ 48వేల రూపాయలు మినహాయించిన తరువాత 1,04,999 రూపాయలు.

For further information, please visit https://www.bgauss.com/book-now/