ఆంధ్రప్రదేశ్‌ యువతను అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లో ఉద్యోగాలకు సిద్ధం చేయడానికి ఏపీ ఇన్నోవేషన్ సొసైటీతో ఒప్పందం చేసుకున్న నెక్స్ట్ వేవ్

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్,ఏప్రిల్ 17,2023:ఆంధ్రప్రదేశ్‌ ఇన్నోవేషన్‌ సొసైటీ, నెక్స్ట్ వేవ్ లు ఇటీవలనే ఒక వ్యూహాత్మక ఒప్పందం చేసుకున్నాయి. ఆవిష్కరణలను ప్రోత్సహించడం, వ్యవస్ధాపకతను మెరుగుపరచడం. ఆంధ్రప్రదేశ్‌లో స్టార్టప్‌ వ్యవస్థను అభివృద్ధి చేయడం ఈ ఒప్పందం లక్ష్యం. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీలో కాలేజీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ వద్ద జరిగిన ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023 లో ఈ అవగాహన ఒప్పందం (ఎంఓయు)ను చేసుకున్నారు.

ఈ ఎంఓయు ద్వారా యువతకు ఇండస్ట్రీ అవసరాలకు సరిపడే ట్రైనింగ్ ఇస్తూ అత్యంత డిమాండ్ లో ఉన్న నైపుణ్యాలు పెంపొందించుకునేలా ఆంధ్రప్రదేశ్‌ ఇన్నోవేషన్‌ సొసైటీ, నెక్స్ట్ వేవ్ కలిసి పనిచేయనున్నాయి. స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రోగ్రామ్‌ల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ లో స్టార్టప్‌ వ్యవస్థను అభివృద్ధి చేయనున్నాయి. తాజా గ్రాడ్యయేట్లు, కాలేజీ విద్యార్ధులలో నైపుణ్యాలను అందించడంతో పాటుగా రాష్ట్ర ఆర్ధికాభివృద్ధికి ఈ భాగస్వామ్యం తోడ్పడనుంది.

ఈ భాగస్వామ్యం ద్వారా అత్యాధునిక సాంకేతికతలలో ఉద్యోగావకశాల పై అవగాహనను కల్పిచడం నెక్స్ట్ వేవ్ లక్ష్యంగా చేసుకుంది. దీనితో పాటుగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు సాధించడానికి అవసరమైన శిక్షణను అందించడం ద్వారా యువతకు అత్యధిక జీతాలు పొందే అవకాశం. కెరీర్‌ కలలను నిజం చేసుకునే అవకాశమూ అందిస్తుంది. 12వ తరగతి నుంచే కోడింగ్‌ నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా భవిష్యత్‌ అవసరాలకు తగిన రీతిలో ఆకర్షణీయమైన కెరీర్‌లను పొందేలా మార్గం చూపిస్తుంది నెక్స్ట్ వేవ్.

ఈ ప్రయత్నాలలో భాగంగా, ఫుల్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌, ఇతర అత్యాధునిక సాంకేతికతలలో శిక్షణ పొందిన అభ్యర్ధులకు ఇంటెర్న్స్‌ లేదా ఫుల్‌ టైమ్‌ ఉద్యోగులుగా ఈ ప్రాంతంలోని స్టార్టప్స్‌లో అవకాశాలను నెక్స్ట్ వేవ్ అందిస్తుంది. అదనంగా ప్రీ ప్లేస్‌ మెంట్‌ టాక్స్‌ను నిర్వహించడం ద్వారా తమ విద్యార్ధులలో అత్యున్నత ప్రతిభావంతులను సొంతం చేసుకునే అవకాశం స్టార్టప్‌ వ్యవస్థాపకులకు నెక్స్ట్ వేవ్ అందిస్తుంది.

అదనంగా, నెక్స్ట్ వేవ్ సర్టిఫైడ్ ఆన్‌లైన్‌లో బూట్‌క్యాంప్స్‌ను నిర్వహించడంతో పాటుగా వర్ట్యువల్‌ 4.0 టెక్‌ కమ్యూనిటీని ఏర్పర్చి సంబంధిత స్టేక్‌హోల్డర్లకు అత్యాధునిక సాంకేతికతలలో తాజా అభివృద్ధిని అర్ధం చేసుకునేలా ప్రోత్సాహాన్ని ఇవ్వనుంది.

నెక్స్ట్ వేవ్ సీఈఓ రాహుల్‌ అత్తులూరి ఈ భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో మరిన్ని ఉద్యోగావకాశాలను కల్పించేందుకు,రాష్ట్రంలో వ్యవస్థాపకతను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఇన్నోవేషన్‌ సొసైటీతో భాగస్వామ్యం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతిభావంతులను ఉద్యోగాలలో నియమించుకునేలా స్టార్టప్స్‌ కు ఈ భాగస్వామ్యం సహాయపడనుంది . అలాగే ఆంధ్రప్రదేశ్‌లో తాజా గ్రాడ్యుయేట్లు, కాలేజీ విద్యార్ధులలో అత్యాధునిక టెక్నాలిజీల పట్ల అవగాహనను సైతం మెరుగుపరచనున్నాము’’ అని అన్నారు

నెక్స్ట్ వేవ్ ఒక ఎడ్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌. ఇది తాజా గ్రాడ్యుయేట్లకు, కాలేజీ విద్యార్ధులకు సాఫ్ట్వేర్ కెరీర్ సాధించడానికి కావలసిన అదనపు నైపుణ్యాలను అందించడం లక్ష్యంగా చేసుకుంది. డిమాండ్‌లో ఉన్న ఉద్యోగాలకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రోగ్రామ్‌ల ద్వారా కెరీర్‌ సంబంధిత విద్యను అందిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ అనేది స్టేట్‌ నోడల్‌ ఏజెన్సీ. ఇది తొలి తరపు వ్యవస్ధాపకులలో, పరిశోధకులల, విద్యార్థులలో, పౌరులలో , ప్రభుత్వంలో ఆవిష్కరణ ధోరణి , వ్యవస్ధాపకతను ప్రోత్సహించడానికి నేతృత్వం వహిస్తుంది.