గని కి అండగా ఐకాన్ స్టార్…

2019 లో గద్దల కొండ గణేష్ మూవీ తో హిట్ అందుకున్నాడు , ఈ మూవీ తరువాత వరుణ్ తేజ్ కు చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది .. ఈ గ్యాప్ లో వరుణ్ తేజ్ రెండు మూవీస్ ని లైన్ లో పెట్టాడు , వాటిలో ఒకటి గని మూవీ , మరొకటి ఎఫ్ 3 మూవీ .. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన గని మూవీ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి .. ఈ మూవీ తో డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కి దర్శకుడిగా గా పరిచయం అవుతున్నారు …

కరోనా కారణంగా గని మోవి గత కొన్ని నెలలుగా రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వచ్చింది .. ఎట్టకేలకు ఈ మూవీ ఏప్రిల్ 8న థియేటర్లలో విడుదుల అవుతున్నది .. ఇక ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కు ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది .. ఈ మూవీ కి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ .. ఈ ట్రైలర్ వరుణ్ తేజ్ అభిమానులకు బిగ్ విజువల్ ట్రీట్ .. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ కోసం వరుణ్ తేజ్ బాగా కష్టపడ్డాడు .. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ ప్రమోషన్స్ ని స్పీడ్ అప్ చేసింది చిత్ర యూనిట్ .. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి .. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది .. ఈ క్రమంలో గని ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏప్రిల్ 2న వైజాగ్ వేదికగా నిర్వహించనున్నట్లు మూవీ టీమ్ ప్లాన్ చేస్తుంది .. అయితే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వస్తున్నారు అని మూవీ టీమ్ ప్రకటించింది .. సుమారు రెండు ఏళ్ళ గ్యాప్ తరువాత వస్తున్న గని మూవీ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి .. ఇక మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగానే ప్లాన్ చేసింది , మొత్తం మీద గని ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్ హాజరు కావడం మెగా అభిమానులందరికి గుడ్ న్యూస్ ….

గీత ఆర్ట్స్ బ్యానర్ లో దర్శకుడు కరుణ కుమార్…

గీత ఆర్ట్స్ లో డైరెక్టర్ కరుణకుమార్ సినిమా అఫీషియల్ ఎనౌన్సమెంట్ …

1978 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘పలాస 1978’. రక్షిత్‌, నక్షత్ర జంటగా తెరకెక్కిన ఈ చిత్రంతో కరుణకుమార్‌ అనే నూతన దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. రివెంజ్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుంది .. సుకుమార్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా “రంగస్థలం ” ఈ సినిమా కూడా వాస్తవా సంఘటనల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది .. “పలాస 1978 ” సినిమా ఎనౌన్స్ చేస్తూ , మోషన్ పోస్టర్ , మరియు క్యారెక్టర్స్ పరిచయము చేస్తూ ఒక్కక్కరి లుక్ రిలీజ్ చేసి , ఈ సినిమా గురించి భారీ అంచనాలు క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. పలాస సినిమా క్యారెక్టర్స్ పరిచయం కోసం డైరెక్టర్ పూరి , మరియు సుకుమార్ , ముందుకు వచ్చి బాగా ప్రమోట్ చేశారు .. మొదటి సినిమా నే విభిన్నమైన స్టోరీ ని సెలెక్ట్ చేసుకున్న డైరెక్టర్ కరుణకుమార కు ఈ సినిమా హిట్ అవ్వడమే కాకుండా , ప్రేక్షకుల దగ్గర నుంచి , మరియు ఇండస్ట్రీ లో నుండి మంచి ప్రశంసలు అందుకున్నారు ..

“పలాస 1978 ” సినిమా డీసెంట్ హిట్ తరువాత డైరెక్టర్ కరుణకుమార చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు .. పలాస సినిమా చుసిన స్టార్ నిర్మాత అల్లు అరవింద్ సినిమా బాగుంది అని మెచ్చుకొని , గీత ఆర్ట్స్ లో ఒక సినిమా చెయ్యాలి అని కోరి అడ్వాన్స్ ఇచ్చారు అని సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపించాయి ..పలాస 1978 వంటి డీసెంట్ హిట్ తరువాత , డైరెక్టర్ కరుణకుమార కు చాలా పెద్ద ఆఫర్స్ వచ్చాయి , కానీ ఇండస్ట్రీ స్లో అండ్ స్టడీ పద్దతిని ఫాలో అయి ,కొంత గ్యాప్ తీసుకొని ,హీరో సుధీర్ బాబు తో శ్రీదేవి షోడా సెంటర్ అనే సినిమా తెరకెక్కించారు .. సుధీర్ బాబు చివరిగా చేసిన “వి ” సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంతగా విజయం సాధించలేకపోయింది .. అలానే పలాస సినిమా తరువాత డైరెక్టర్ కరుణకుమార్ ఈ సారి మంచి కమర్షియల్ సినిమా చేద్దాము అని డిసైడ్ అయి , హీరో సుధీర్ బాబు తో శ్రీదేవి షోడా సెంటర్ అనే సినిమా డైరెక్ట్ చేశారు .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని హిట్ టాక్ తెచ్చుకుంది .. శ్రీదేవి షోడా సెంటర్ లాంటి హిట్ సినిమా తరువాత డైరెక్టర్ కరుణ కుమార్ మల్లి కొంత గ్యాప్ తీసుకొని , బంపర్ ఆఫర్ దక్కించుకున్నారు .. డైరెక్టర్ కరుణ కుమార్ – ఈ సారి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సీనిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు .. గీత ఆర్ట్స్ బ్యానర్ , టాలెంటెడ్ డైరెక్టర్స్ , మరియు కొత్త డైరెక్టర్స్ ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు , ఇక పలాస దర్శకుడు కరుణ కుమార్ తో జీఏ2లో సినిమా త్వరలో ఉంటుంది అని సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపించాయి .. పలాస సినిమా చూసిన స్టార్ నిర్మాత అల్లు అరవింద్ డైరెక్టర్ కరుణకుమార కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు .. మొత్తానికి అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో కరుణ కుమార్ దర్శకుడిగా సినిమా ప్రారంభమైంది. బన్నీ వాసు- విద్య మాధురి ఈ చిత్రానికి నిర్మాతలు.

మారుతి సినిమా అంటే నవ్వులు గ్యారెంటీ …మ్యాచో హీరో గోపీచంద్

సంద‌డిగా సాగిన మంచి రోజులు వ‌చ్చాయి ప్రీ రిలీజ్ ఈవెంట్

సంతోష్ శోభన్, మెహరీన్ కౌర్ జంటగా వరుస విజయాలతో దూసుకుపోతున్న మారుతి తెరకెక్కిస్తున్న సినిమా మంచి రోజులు వచ్చాయి. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. యాక్షన్ హీరో గోపీచంద్, అల్లు అరవింద్ గారు ముఖ్య అతిథులుగా వచ్చిన ఈవెంట్ విశేషాలు ఏంటో చూద్దాం..

హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. “కేవలం నా టాలెంట్ నమ్మి మళ్లీ మళ్లీ నాకు అవకాశాలు ఇస్తున్న యు.వి.కాన్సెప్ట్స్ కు జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ స్టేజ్ ఎక్కడానికి ఎంతో కష్టపడ్డాను. మంచి రోజులు వచ్చాయి ఖచ్చితంగా అందరినీ అలరిస్తోంది. నవంబర్ 4న థియేటర్స్ అన్నీ నవ్వులతో నిండిపోవాలి అని కోరుకుంటున్నాను..” అని తెలిపారు.

హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. ” మారుతి సినిమా అంటే నవ్వులు గ్యారెంటీ. అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నాను అనేది రేపు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను.. మీకు కూడా రేపు నవంబర్ 4న థియేటర్లలో అది తెలుస్తుంది. సినిమా అంతా పగలబడి నవ్వడం ఖాయం. మంచి రోజులు వచ్చాయి పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..” అని తెలిపారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. “కరోనా తర్వాత అందరు తెలియకుండానే ఒక భయంలోకి వెళ్లిపోతున్నారు. ఆ భయం మీద ఎందుకు సినిమా చేయకూడదు అనే ఐడియా నాకు వచ్చింది. అది వచ్చిన వెంటనే 20 రోజుల్లో కథ రాసి.. 30 రోజుల్లో సినిమా తీశాను. ముందు నా పేరు వేసుకోకూడదు అనుకున్నాను. కానీ ఒక మంచి విషయం చెబుతున్నప్పుడు దాని ఫలితం కూడా మనమే తీసుకోవాలని అల్లు అరవింద్ గారితో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నాను. సాధారణంగా ఒక పెద్ద సినిమా చేస్తున్నప్పుడు చిన్న సినిమా చేయాలి అంటే నిర్మాతలు ఒప్పుకోరు. కానీ నేనేం చేసినా కూడా నా వెనక మంచి మనుషులు ఉన్నారు. ఆ ధైర్యంతోనే మంచి రోజులు వచ్చాయి సినిమా మీ ముందుకు తీసుకు వస్తున్నాను. ఈ సినిమా సరదాగా చేసినా.. సీరియస్ విషయం ఉంది. ఖచ్చితంగా నవంబర్ 4న థియేటర్లలో మీరు ఈ సినిమా చూసి నవ్వుతారు.. ఎంజాయ్ చేస్తారు అని నమ్ముతున్నాను..” అని తెలిపారు.

నిర్మాత అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ..” సినిమా వాళ్లకు మంచి రోజులు రావడం అంటే జనం థియేటర్స్ కు వచ్చి ఆశీర్వదించడం. ఈ మధ్య విడుదలైన రెండు మూడు సినిమాలకు అలాంటి మంచి రోజులు చూపించారు. నేను ఓటిటి ఓనర్ అయ్యుండి కూడా సినిమాను తెరమీదే చూడండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. మారుతి నాకు బన్నీ ఫ్రెండ్ గా తెలుసు. మా ఇంట్లో కుర్రాడి కింద చూస్తాం. ఎంటర్టైన్మెంట్ లోనే సందేశం ఇచ్చే దర్శకుడు మారుతి. శోభన్ నీ గురించి పేపర్ బాయ్ ఈవెంట్ లోనే చెప్పాను. నువ్వు గీతా ఆర్ట్స్ లో సినిమా చేయాలి. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఇండస్ట్రీలో టాలెంటు లేకపోతే ఎత్తుకోదు. నీకు చాలా టాలెంట్ ఉంది. మెహరీన్ నువ్వు స్వీట్ హార్ట్. స్టార్ హీరోలు ముందుకొచ్చి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నారు. అది చాలా మంచి సంప్రదాయం. ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా అవసరం. మంచి రోజులు మనకు ముందున్నాయి..” అని తెలిపారు.