గని కి అండగా ఐకాన్ స్టార్…

2019 లో గద్దల కొండ గణేష్ మూవీ తో హిట్ అందుకున్నాడు , ఈ మూవీ తరువాత వరుణ్ తేజ్ కు చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది .. ఈ గ్యాప్ లో వరుణ్ తేజ్ రెండు మూవీస్ ని లైన్ లో పెట్టాడు , వాటిలో ఒకటి గని మూవీ , మరొకటి ఎఫ్ 3 మూవీ .. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన గని మూవీ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి .. ఈ మూవీ తో డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కి దర్శకుడిగా గా పరిచయం అవుతున్నారు …

కరోనా కారణంగా గని మోవి గత కొన్ని నెలలుగా రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వచ్చింది .. ఎట్టకేలకు ఈ మూవీ ఏప్రిల్ 8న థియేటర్లలో విడుదుల అవుతున్నది .. ఇక ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కు ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది .. ఈ మూవీ కి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ .. ఈ ట్రైలర్ వరుణ్ తేజ్ అభిమానులకు బిగ్ విజువల్ ట్రీట్ .. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ కోసం వరుణ్ తేజ్ బాగా కష్టపడ్డాడు .. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ ప్రమోషన్స్ ని స్పీడ్ అప్ చేసింది చిత్ర యూనిట్ .. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి .. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది .. ఈ క్రమంలో గని ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏప్రిల్ 2న వైజాగ్ వేదికగా నిర్వహించనున్నట్లు మూవీ టీమ్ ప్లాన్ చేస్తుంది .. అయితే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వస్తున్నారు అని మూవీ టీమ్ ప్రకటించింది .. సుమారు రెండు ఏళ్ళ గ్యాప్ తరువాత వస్తున్న గని మూవీ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి .. ఇక మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగానే ప్లాన్ చేసింది , మొత్తం మీద గని ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్ హాజరు కావడం మెగా అభిమానులందరికి గుడ్ న్యూస్ ….