బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్న సూపర్ స్టార్ …

గ్యాప్ లేకుండా మూవీ షూటింగ్స్ లో   పాల్గొంటున్న స్థార్ హీరో 

విభిన్నమైన రోల్స్​లో అదరగొట్టే సూర్య సినిమాలపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలుంటాయి. సూర్య చేసిన ‘ ఆకాశమే నీ హద్దురా’, ‘జై భీమ్’​ సినిమాలు కరోనా కారణంగా ఓటీటీల్లో రిలీజయ్యాయి. అయితేనేం అవి బ్లాక్​ బస్టర్ హిట్​ సాధించాయి. సుమారు మూడేళ్ల తర్వాత ‘ఎవరికీ తలవంచడు ‘ సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు. సన్ పిక్చర్స్​ అధినేత కళానిధి మారన్​ నిర్మించిన ఈ చిత్రాన్ని పాండిరాజ్​ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో సూర్య సరసన ప్రియాంక అరుల్​ మోహన్​ హీరోయిన్​గా నటించింది. ఇక ఈ మూవీ ట్రైలర్స్ టీజర్స్ , సాంగ్స్ సూర్య ఇంటెన్స్ యాక్టింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .. రెగ్యులర్ సినిమాలకు దూరంగా ఉంటూ కొత్తరకమైన సినిమాలు చేసే అతి కొద్దీ మంది హీరోల్లో సూర్య ఎప్పుడు ముందు వరుస లో ఉంటారు .. ఇక అసలు విషయానికి వెళ్ళితే సూర్య నటించిన సినిమాలు తెలుగు లో కూడా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి , ఇటీవలే ఈటీ (ఎవరికీ తలవంచడు) మూవీ తో హిట్ అందుకున్న సూర్య , బ్యాక్ బ్యాక్ టు సినిమాలను లైన్ లో పెడుతున్నాడు ..

హీరో సూర్య, దర్శకుడు బాల కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. అయితే దర్శకుడు వెట్రి మారన్‌తో సూర్య ఇప్పటికే ‘వాడివాసల్‌’ అనే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు .. అయితే బాల సినిమా మేజర్‌ షూటింగ్‌ పూర్తయిన తర్వాతే ‘వాడివాసల్‌’ రెగ్యులర్‌ షూట్‌లో సూర్య పాల్గొంటారని వార్తలు వస్తున్నాయి , మరి ఇంతలో సూర్య ప్లానింగ్ లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి , ఈ రెండు సినిమాల షూటింగ్స్‌ను ఒకే టైమ్‌లో పూర్తి చేసేట్లుగా సూర్య రెడీ అవుతున్నారట. ఇందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని కోలీవుడ్‌ లో వార్తలు వస్తున్నాయి . జల్లికట్టు నేపథ్యంలో ‘వాడివాసల్‌’ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం చెన్నైలో ఈ సినిమా టెస్ట్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారు సూర్య. ఈ సినిమా లొకేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. మొత్తానికి సూర్య బ్యాక్ టు బ్యాక్ గ్యాప్ లేకుండా రెండు సినిమాల షూటింగ్ త్వరగా ఫినిష్ చేసేలా చూస్తున్నాడు ..