సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` ఫస్ట్ లుక్ విడుదల…

సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో రాబోతోన్న మూడవ‌ చిత్రం `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`. ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.`ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని ఓ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ…కొత్త ఏడాదిలో ఫస్ట్ డే మనమంతా కలవడం సంతోషంగా ఉంది. ఆ అమ్మాయి గురించి ఉప్పెన సినిమా ద్వారా చెప్పాం. ఆ అమ్మాయి మంచి నటి అని మాకు తెలుసు. ఇంకా ఈ సినిమా ద్వారా దర్శకుడు, హీరో ఏం చెబుతారో చూడాలి. ఇంద్రగంటి గారు విభిన్నమైన చిత్రాలు చేయగల దర్శకులు. ఆయన యాక్షన్, లవ్, మ్యూజికల్ ఫిల్మ్, ఎంటర్ టైనర్స్ ఇలా అన్ని జానర్స్ సినిమాలు చేయగలరు. ఇంద్రగంటి గారితో సినిమా చేయాలని అనుకునేవాళ్లం. అలాగే హీరో సుధీర్ బాబు వెరీ టాలెంటెడ్. ఆయనతో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా చేయాలని వెయిట్ చేశాం. ఇలా ఇంద్రగంటి, సుధీర్ బాబు సినిమాకు ప్రెజెంటర్ గా అసోసియేట్ అవడం సంతోషంగా ఉంది. ఆ అమ్మాయి గురించిచెప్పాలి టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. అన్నారు.మైత్రీ మూవీ మేకర్స్ సీయీవో చెర్రి మాట్లాడుతూ…ఆ అమ్మాయి గురించి చెప్పాలి కథను ఇంద్రగంటి మోహనకృష్ణ గారు మాకు చెప్పగానే చాలా బాగుందని అనిపించింది. ఈ సినిమాలో అనేక ఎలిమెంట్స్ కలిసి ఉంటాయి. ఇదొక బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందని చెప్పగలను. సుధీర్ బాబు వర్సటైల్ యాక్టర్ ఆయన సినిమాలో అసోసియేట్ అవడం ఆనందంగా ఉంది. అలాగే కృతి మాతో సెకండ్ మూవీ చేస్తోంది. ఆ అమ్మాయి గురించి ఇంద్రగంటి మోహనకృష్ణ గారు సినిమాలో ఏం చెబుతారో వినాలని ఉంది. అన్నారు.సినిమాటోగ్రాఫర్ పీజీ విందా మాట్లాడుతూ..ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాకు కర్త, కర్మ, క్రియ అన్నీ ఇంద్రగంటి మోహనకృష్ణ గారే. అమ్మాయి గురించి చెప్పడమే కాదు చాలా అందంగా చూపించాం. సమ్మోహనం తర్వాత మేము కలిసి చేస్తున్న మరో బ్రీజీ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఈ సినిమా. అన్నారు.

దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ…ఆ అమ్మాయి గురించి చెప్పాలి సినిమా నాకు పర్సనల్ గా చాలా ఇష్టమైన మూవీ. ప్రతి సినిమాకు కొత్తగా కథ చెప్పాలని ప్రయత్నిస్తుంటాను. ఆ క్రమంలో వచ్చిన రొమాంటిక్ డ్రామా ఇది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. కథలోనే పుట్టే సహజమైన కామెడీ ఉంటుంది. సుధీర్ బాబుతో నాకిది మూడో సినిమా. మా మధ్య అలా వేవ్ లెంగ్త్ కుదిరింది. సుధీర్ బాబు ప్రతిభ గల హీరో. అతనిలోని నటుడిని ఇండస్ట్రీ ఇంకా ఉపయోగించుకోవచ్చు. కృతిశెట్టిని ఉప్పెనలో చూసినప్పుడు ఇంప్రెసివ్ గా అనిపించింది. శ్యామ్ సింగరాయ్ లోనూ ఆకట్టుకుంది. ఇది కృతి శెట్టి బయోపిక్ కాదు. ఆమెను కొత్తగా చూస్తారు. సుధీర్ బాబు, కృతి వాళ్ల నటనతో సినిమాలో జీవించారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి లైఫ్ ను ఎలా ప్రభావితం చేస్తుంది, అనూహ్యంగా వీళ్లు ఎలా ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమకు ఫ్యామిలీ, సొసైటీ నుంచి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి వాటిని అధిగమించి ఎలా ప్రేమతో పాటువాళ్లు అనుకున్నది సాధించారు అనేది స్థూలంగా ఈ చిత్ర కథ. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ మా సినిమాకు ప్రెజెంటర్ గా ఉండటం అనేది సినిమా బాగుందనే స్టాంప్ వేసినట్లే. మైత్రీ వాళ్లకు థాంక్స్. అలాగే బెంచ్ మార్క్ సంస్థకు శుభారంభం ఇచ్చామనే అనుకుంటున్నాను. అన్నారు.హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ…ఇంద్రగంటి గారితో నాకిది మూడో సినిమా. నేను హీరోయిన్ తో కూడా మూడు చిత్రాలు చేయలేదు. ఆయనతో అంత ఫ్రెండ్ షిప్ ఉంది. ఆ అమ్మాయి గురించి చెప్పాలి చిత్రానికి మీరు ఎక్కడా వంక పెట్టలేరు. అంత పర్ ఫెక్ట్ గా ఉంటుంది. సమ్మోహనం లో సినిమాలంటే ఇష్టం లేని క్యారెక్టర్ చేశాను. ఆ అమ్మాయి గురించి చెప్పాలి చిత్రంలో సినిమా డైరెక్టర్ క్యారెక్టర్ లో నటిస్తున్నాను. ఈ సినిమా కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. హీరో ఇంట్రడక్షన్ సాంగ్, ఐటెం సాంగ్ ఉంటుంది. కృతి గురించి చెప్పాలంటే కోరినట్లు నటించగల ప్రతిభ ఉన్న హీరోయిన్. కావాలంటే గ్లిజరిన్ లేకుండా ఏడ్చేయగలదు. బెంచ్ మార్క్ స్టూడియోస్ కు మొదటి సినిమా అయినా కంగారు లేకుండా జాగ్రత్తగా నిర్మించారు. ఈ చిత్రానికి మైత్రీ మూవీస్ అసోసియేట్ అవడం ఇంధనం లాంటిది. వాళ్లకు థాంక్స్ చెబుతున్నా. అన్నారు.హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ…ఆ అమ్మాయి గురించి చెప్పాలి సినిమా మొదలైన కొద్ది రోజులకే ఇది నాకు గొప్ప అనుభవం ఇచ్చే సినిమా అవుతుందని అర్థమైంది. కథలోనే మా పాత్రలన్నీ అంత వివరంగా ఉన్నాయి. కొందరికి రొమాంటిక్ పార్ట్, మరికొందరికి ఫ్యామిలీ పార్ట్ నచ్చుతాయి. సినిమా అంతా మన ఇరుగు పొరుగు ఇంట్లో జరిగినంత సహజంగా ఉంటుంది. సుధీర్ బాబు అంత కోపరేట్ చేసే హీరోను చూడలేదన్నారు.