సూచిరిండియా ఫౌండేషన్ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డుల ప్రదానం…

సూచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 4న శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమం లో సర్ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డుల ప్రధానం ….

ప్రముఖ సామాజిక సేవాసంస్థ సుచిరిండియా ఫౌండేషన్ 31వ సర్ సివి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించింది. 1500 పాఠశాలల నుండి 1,00,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన 31వ జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షల్లో 16 మందికి గోల్డ్ మెడల్స్, 16 మంది ర్యాంకేర్స్ కి మరియు 396 డిస్ట్రిక్ ర్యాంకేర్స్ కి, 8 మంది కి ఛత్రలయా పురస్కార్ అవార్డ్స్, 8 మందికి గురు బ్రహ్మ అవార్డ్స్, రాష్ట్రా స్థాయి మెడల్స్ మరియు జిల్లా స్థాయి ర్యాంక్స్ వచ్చిన యువ టాలెంట్ విద్యార్థులకు శ్రీ సత్యసాయి నిగమాగమం లో అవార్డులు ప్రదానం చేయనున్నారు అని సూచిరిండియా ఫౌండేషన్ నిర్వహకులు లయన్ కిరణ్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా డా. జి. సతీష్ రెడ్డి గారు,రక్షా మంత్రికి మాజీ సైంటిఫిక్ అడ్వైజర్, సెక్రటరీ DD (R&D) , & చైర్మన్ DRDO. H.E. నికోలాయ్ హ్రిస్టోవ్ యాంకోవ్, భారతదేశానికి రిపబ్లిక్ ఆఫ్ బల్గేరియా యొక్క గౌరవనీయమైన అంబాసిడర్ అసాధారణ & ప్లీనిపోటెన్షియరీ మరియు శ్రీ. చంద్రబోస్ ఆస్కార్ అవార్డు గ్రహీత, టాలీవుడ్ గీత రచయిత మరియు గాయకుడు పాల్గొనున్నారు.