ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి విజయవాడకు లీప్ ఎహెడ్ స్టార్టప్ సమ్మిట్‌ను తెస్తున్న ఎస్టీపీఐ, టై ఢీల్లీ-ఎన్సీఆర్..

తెలుగు సూపర్ న్యూస్,విజయవాడ, డిసెంబర్ 7, 2023: నిరంతర భాగస్వామ్యంలో భాగంగా సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇం డియా (ఎస్టీపీఐ), ది ఇండస్ ఆంత్రప్రెన్యూర్స్ (టై దిల్లీ-ఎన్సీఆర్) కలసి లీప్ ఎహెడ్ ఇనిషియేటివ్‌ ను విజ యవాడకు విస్తరించాయి. విజయవాడ చాప్టర్ కోసం వర్చువల్ ఈవెంట్ అయిన లీప్ ఎహెడ్ స్టార్టప్ స మ్మిట్‌ని నిర్వహించడానికి టై దిల్లీ-ఎన్సీఆర్, టై విజయవాడతో మరింతగా సహకరించింది.

ఢీల్లీ, భువనే శ్వర్‌లలో జరిగిన సదస్సు సమావేశాల అసాధారణ విజయాన్ని అనుసరించి, విజయవాడలో జరిగిన సదస్సు భారతదేశం అంతటా, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంతటా అభివృద్ధి చెందుతున్న కేంద్రాలలో టెక్ స్టార్టప్‌ లకు గణనీయమైన మద్దతు, త్వరణాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.


టెక్ స్టార్టప్‌లను ఎంచుకోవడానికి దేశవ్యాప్త కార్యక్రమం అయిన లీప్ అహెడ్ (లాంచ్ ప్యాడ్ ఫర్ టెక్ ఆంత్ర ప్రెన్యూర్స్ టువర్డ్స్ యాక్సిలరేటెడ్ గ్రోత్ అండ్ పయనీరింగ్ అహెడ్) ఇటీవల ఎస్టీపీఐ ద్వారా టై దిల్లీ-ఎన్సీఆర్ సహకారంతో, ప్రతిష్టాత్మకమైన ఇన్వెస్టర్ల సమూహంచే ప్రారంభించబడింది.

ఈ ప్రాంతంలో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలను ఉత్తేజపరిచేందుకు & ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి నగరాల్లో లీప్ ఎహెడ్ స్టార్టప్ సమ్మిట్‌లు నిర్వహించబడుతున్నాయి. లీప్ ఎహెడ్ లక్ష్యం 75 స్టార్టప్‌లను ఎంపిక చేయడం, వాటికి మెంటర్‌షిప్, వ్యాపార మార్గదర్శకత్వం అందించడం.

ఇది రూ.1 కోటి నిధులను సమర్ధవంతంగా సమీకరిం చడంతో ముగుస్తుంది. ఈ ఇనిషియేటివ్ మూడు నెలల ముమ్మర మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌ను అందిస్తుంది. ఈ ప్రత్యేకమైన చొరవ స్టార్టప్‌లకు సంపూర్ణ అభ్యాస అనుభవాన్ని అందించడానికి వర్చువల్, వ్యక్తిగత సెషన్‌లను మిళితం చేస్తుంది. ఇది స్టార్టప్‌లకు విస్తృతమైన నెట్‌వర్క్, అనుభవజ్ఞులైన ఇన్వెస్టర్లు, పరిశ్రమ నిపుణులతో ఒకరితోఒకరు మెంటార్‌షిప్ సెషన్‌లకు యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.


లీప్ ఎహెడ్ స్టార్టప్ సమ్మిట్‌లో ప్రారంభ సెషన్ స్ఫూర్తికి బాట వేసేలా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, ఐఏఎస్ అధికారి భువనేష్ కుమార్ హాజరై ప్రసంగించారు.

ఎస్టీపీఐ హైదరాబాద్ డైరెక్టర్ సీవీడీ రాంప్రసాద్, ā హబ్ సీఈఓ & టై వైజాగ్ ప్రెసిడెంట్ రవి ఈశ్వరపు, ఎస్టీపీఐ డైరెక్టర్ సుబోధ్ సచన్ & ఎఫ్‌ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, NGIS విజయవాడ చీఫ్ మెంటార్ దాసరి రామకృష్ణ ప్రసంగించారు. డే ఆఫ్ ఇన్నోవేషన్ కు వేదికను ఏర్పాటు చేసేలా, రాష్ట్రంలో స్టార్టప్‌ల పెంపకం కోసం ఎస్టీపీఐ & టై ఎలా పని చేస్తు న్నాయి అనే దాని గురించి వారు తమ దృక్పథాలను పంచుకున్నారు .


భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, ఐఏఎస్ అధికారి భువనేష్ కుమార్ మాట్లాడుతూ, “‘‘‘‘మన పురోగతి యొక్క కేంద్రబిందువు మనకు సుపరిచితమైన వాటిని దాటి ఉంటాయని గుర్తిస్తూ మన దృష్టి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని, వెలుగులోకి రాని ఘనచరిత్ర గ ల స్టార్టప్‌లకు విస్తరించింది. ఈ వర్ధమాన ప్రతిభావంత సంస్థలు ప్రత్యేకమైన అడ్డంకులను ఎదుర్కొంటాయి, అయితే అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

వాటి పట్ల మా నిబద్ధత, TIDE 2.0, NGIS, SAMRIDH, GENESIS వంటి స్కీమ్‌లను చేపట్టేందుకు దారి తీసింది. అవి వాటి కలలను నిజం చేస్తాయి. ఎస్టీపీఐ ఉన్నతంగా నిలుస్తుంది, దేశవ్యాప్తంగా తన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కేంద్రాల ద్వారా వ్యవస్థాపకతకు నాంది ప లుకుతోంది, అదే సమయంలో OCTANE CoEs అనేది ఈశాన్య దిశలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహి స్తుంది.

పరివర్తన మార్గమైన లీప్ ఎహెడ్ ప్రోగ్రామ్‌తో ప్రతి ఆలోచనకు రెక్కలు వచ్చేలా ఆంత్రప్రెన్యూర్ ల్యాం డ్‌స్కేప్‌ను రూపొందించడంలో చేతులు కలపాలని మేం అందరినీ ఆహ్వానిస్తున్నాం”’’ అని అన్నారు.
ఎస్టీపీఐ హైదరాబాద్ డైరెక్టర్ సీవీడీ రాంప్రసాద్ మాట్లాడుతూ, “సదస్సుకు ఇన్వెస్టర్లు, స్టార్టప్‌లన్నిటినీ స్వాగతిస్తున్నందుకు సంతోషంగా ఉంది.

లీప్ అహెడ్ స్టార్టప్ సమ్మిట్ అనేది టెక్ స్టార్టప్‌లను విప్లవాత్మకం గా మార్చడానికి, స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో వృద్ధిని, వైవిధ్యతను పెంచడానికి, విస్తరణకు రూపుదిద్దుకున్న ఒక కార్యక్రమం. ఎస్టీపీఐ దూరదృష్టి ఎత్తుగడలు 6 సంవత్సరాలలో 7.64 లక్షల ఉద్యోగా లను సృష్టించాయి, వ్యూహాత్మక పథకాల ద్వారా ఐటీ రంగాన్ని ఉన్నతీకరించాయి. టై దిల్లీతో ‘లీప్ ఎహెడ్ పాన్ ఇండియా’ సహకారంతో 75 స్టార్టప్‌లకు ఇంటెన్సివ్ ట్రైనింగ్, మెంటరింగ్ మరియు 15 స్టాండ్‌అవుట్ వెంచర్‌ల కోసం రూ.1 కోటి వరకు నిధులను అందించారు. ఈ క్షణాన్ని సద్వినియోగం చేసుకోండి, కలిసి భారతదేశ ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకత భవిష్యత్తును రూపొందిద్దాం”’’ అని అన్నారు.


“114,000 రిజిస్టర్డ్ వెంచర్‌లను కలిగి ఉన్న భారతదేశపు డైనమిక్ స్టార్టప్ ల్యాండ్‌స్కేప్ తో, విస్తృతమైన ప్రపంచ పరివర్తన భారతీయ స్టార్టప్‌లకు స్పష్టంగా అనుకూలంగా ఉంది. దేశవ్యాప్తంగా 60+ కేంద్రాలతో, 23 ఆంత్రప్రెన్యూర్‌షిప్ కేంద్రాలు, 12 నగరాల నుండి అమలు చేయబడిన నెక్స్ట్ జనరేషన్ ఇంక్యుబేషన్ స్కీమ్ (NGIS) 800+ స్టార్టప్‌లను దేశవ్యాప్తంగా పెంపొందించడంలో కీలకంగా ఉంది. ‘లీప్ ఎహెడ్’ ద్వారా, ఎస్టీపీఐ మొదటి లీప్ అహెడ్ సమూహాన్ని గుర్తించడానికి, నిజమైన సమస్యలను పరిష్కరించడానికి, ఉన్నతిని చూసేందుకు సిద్ధంగా ఉంది.

టై దిల్లీ-ఎన్సీఆర్ తో ఈ ప్రోగ్రామ్ విశిష్ట రీతిలో కలసి పని చేయడం అనేది 3-నెలల మెంటరింగ్ కార్యక్రమాన్ని అందిస్తోంది, సపోర్ట్ ఎకోసిస్టమ్‌ను పటిష్టపరుస్తుంది, కేంద్రీకృత వృద్ధిని అనుసరించే వారికి గో-టు ప్రోగ్రామ్‌గా ‘లీప్ ఎహెడ్’ని ఉంచుతుంది. టై సిలికాన్ వ్యాలీ చాప్టర్‌తో అంతర్జాతీ య అనుసంధానం ప్రస్తుత వైబ్రేషన్‌ని పెంచే లక్ష్యంతో ఉంది’’” అని ఎస్టీపీఐ హెచ్‌క్యూ డైరెక్టర్‌ సుబోధ్‌ సచన్‌ అన్నారు.
ఇండియన్ ఏంజెల్ నెట్‌వర్క్‌ కు చెందిన హర్ష్ చౌదరి & హైదరాబాద్ ఏంజెల్స్ సిఇఒ రత్నాకర్ సామవేదం తో సహా ఎంపిక చేసిన ఇన్వెస్టర్ పార్టనర్‌లు ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించారు, రాబోయే అవకాశాలపై వెలుగులు నింపారు. ఈ సమ్మిట్‌లో ఎఫ్‌ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఎన్జీఐఎస్ విజయవాడ చీఫ్ మెంటార్, దాసరి రామ కృష్ణ కూడా ప్రసంగించారు.

ఆల్కోవ్ బిజినెస్ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ (అల్కోవ్ పార్ట్‌ నర్స్) డైరెక్టర్ శ్రీనివాస్ సవరం, అనికట్ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్ అసోసియేట్ ప్రణ వ్ విశ్వేష్ వంటి ఎంపిక చేసిన ఇన్వెస్టర్ భాగస్వాములతో ప్రతీకాత్మక అవగాహన ఒప్పందాలు కూడా జరి గాయి.

విజయవాడలో జరిగిన లీప్ ఎహెడ్ సమ్మిట్ కేవలం చర్చలకు మాత్రమే పరిమితం కాకుండా, విభి న్న ఆలోచనలకు సమ్మేళనంగా నిలిచింది. ఎజెండాలో క్లిష్టమైన ఇతివృత్తాలను పరిశోధించే రెండు లోతైన ప్యానెల్ చర్చలు ఉన్నాయి: “స్టార్టప్‌లకు సాధికారత: నిధులు, వనరులకు ప్రాప్యత” మరియు “సుస్థిర ప ర్యావరణ వ్యవస్థను నిర్మించడం: ప్రభుత్వం, పరిశ్రమ, అకాడెమియా సహకారం.

” గౌరవనీయ ప్యానలిస్టు లు కుమార్ సౌరభ్ – ఎకోసిస్టమ్ మేనేజర్, వెంచర్ క్యాటలిస్ట్స్; దీనానాథ్ హరపన హల్లి – వ్యవస్థాపకుడు & సీఈఓ, ఒంట్రోపి & ఐఎస్ఎఫ్ ఏంజెల్స్; వంశీ కృష్ణ, వ్యవస్థాపకుడు – జూలియన్ ఇన్నోవేషన్స్ ఇండి యా ప్రైవేట్ లిమిటెడ్; రాధవ్ టాండన్ – సీనియర్ అసోసియేట్, పొంటాక్ వెంచర్స్ ఇండియా ఎల్ఎల్ పి; రత్నాకర్ సామవేదం – సీఈఓ, హైదరాబాద్ ఏంజిల్స్; డాక్టర్ అమీత్ చవాన్ – సీఈఓ, విఐటి ఏపీ; టి అనిల్ కుమార్ – సీఈఓ, ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ & ఇంకా చాలా మంది ఈ చర్చలకు తమ నైపుణ్యాలను అందించారు.


15 స్టార్టప్‌లు తమ వినూత్న ఆలోచనలను ఇన్వెస్టర్లకు అందించడాన్ని కూడా ఈ సదస్సు చూసింది. ది ల్లీ, భువనేశ్వర్, విజయవాడ తర్వాత లీప్ ఎహెడ్ స్టార్టప్ సమ్మిట్ డిసెంబర్ 13న చండీగఢ్‌లో జరుగుతుం ది.


Leave a Reply