గోల్డెన్ ఛాన్స్ దకించుకున్న శృతి హాసన్ …

బాలయ్య సరసన నటిస్తున్న శృతి హాసన్....

    

2021 లో డైరెక్టర్ గోపీచంద్ మలినేని – మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా “క్రాక్” . క్రాక్ సినిమా కంటే ముందు వచ్చిన సినిమాలు ఏవి అనుకున్నంతగా సక్సెస్ కాలేదు , సాలిడ్ కంటెంట్ , రవితేజ పవర్ ఫుల్ యాక్షన్ , గోపీచంద్ మలినేని టేకింగ్ , తో , ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది . రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .. డైరెక్టర్ గోపీచంద్ మలినేని అప్పటివరకు తానూ చేసిన సినిమాలు సో సో గా ఉన్న క్రాక్ సినిమాతో ఒక్కసారిగా బిగ్గెస్ట్ హిట్ అందుకొని , ఇండస్ట్రీ లోని అందరి ప్రశంసలు అందుకున్నారు .. క్రాక్ సినిమా తరువాత , డైరెక్టర్ గోపీచంద్ మలినేని కొంత గ్యాప్ తీసుకొని నందమూరి బాలకృష్ణ సినిమా ఎనౌన్స్ చేయడం జరిగింది..

బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న అఖండ సినిమా పూర్తి అయింది .. ఈ సినిమా తరువాత బాలయ్య డైరెక్టర్ గోపీచంద్ మలినేని సినిమా పట్టాలెక్కనుంది , ఈ సినిమా ఎనౌన్స్ చేయాగానే బాలయ్య అభిమానుల్లో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి , ఈ అంచనాలను ఎక్కడ తగ్గకుండా గోపీచంద్ మలినేని సినిమా టేకింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు .. గోపీచంద్ మలినేని నందమూరి బలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది . బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం బాలయ్య బాబు సరసన హీరోయిన్ కోసం మొదట చాలా పేర్లు వినిపించాయి , కానీ ఫైనల్ గా బాలయ్య సరసన హీరోయిన్ గా శృతిహాసన్ ను ఫైనలైజ్ చేస్తూ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ .. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు .. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారం చేసుకొని డైరెక్టర్ గోపీచంద్ తెరకెక్కిస్తున్నారు ..ఈ సినిమాకు సంబంధించి మొదటి షెడ్యూల్ త్వరలనే మొదలుపెట్టనున్నారు .. . గోపీచంద్‌ మలినేని డైరెక్షన్ లో వచ్చిన ‘బలుపు’, ‘క్రాక్‌’ సినిమాల్లోనూ శ్రుతి హాసన్‌ నటించింది. ఇప్పుడు మల్లి గోపీచంద్ మలినేని తో హ్యాట్రిక్ సినిమా గా రాబోతున్న బాలకృష్ణ సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ దక్కించుకుంది .. మొత్తానికి డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలయ్య నటిస్తున్న సినిమా లో శృతి హాసన్ ఒకే చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసి నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు …