బాచుపల్లి పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో ‘స్పర్ధ’ కల్చరల్ సెలెబ్రేషన్స్..

తెలుగు సూపర్ న్యూస్, నవంబర్ 10,2023: బాచుపల్లి పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో ఘనంగా‘ స్పర్ధ’ సాంస్కృతిక వేడుక..బాచుపల్లిలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ వారు స్పర్ధ పేరిట పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఆహ్లాదకరమైన వాతావరణంలో వినూత్న రీతిలో 2023, నవంబర్ 8వ తేదీన నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనటం జరిగింది. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, బటన్ ఆర్ట్, బోట్ ఆర్ట్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కార్వింగ్, మోనోలాగ్, స్టోరీ టెల్లింగ్ వంటి వాటిలో పోటీలు నిర్వహించారు.

విద్యార్థులు ప్రతి ఒకరు తమ ప్రతిభాపాటవాలను అబ్బురపడే విధంగా ప్రదర్శించటం జరిగింది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ గౌరవనీయులైన శ్రీ సుశీల్ కుమార్ గారూ, అకాడమిక్ డైరెక్టర్ శ్రీమతి సుధా గారూ, శ్రీమతి రాధా గారూ ,ప్రముఖ నటీమణి గీతాభాస్కర్ గారూ, డ్యాన్స్ మాస్టర్ నటరాజ్ గారూ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

విద్యార్థులలో నిక్షిప్తమై ఉన్న కళలను ఇటువంటి కార్యక్రమాలను నిర్వర్తించటం వల్ల వారిలోని కళలు బహిర్గతమవుతాయని సంస్థ డైరెక్టర్ శ్రీ సుశీల్ కుమార్ అన్నారు. ప్రతి ఒక్కరు పోటీతత్వంతో ఎంతో చురుగ్గా ఉల్లాసంగా వారివారి పోటీలలో పాల్గొనడం జరిగింది. పోటీలలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కేటాయించడం జరిగింది.

చిన్నతనం నుంచి కళలపై వారికి ఉన్న ఆసక్తిని గమనించి వారిని ప్రోత్సహించాలని ప్రిన్సిపల్ శ్రీమతి అనురాధ గారూ తెలిపారు. విద్యార్థులకు బహుమతుల ప్రదానంతో ఈ వేడుక . ఈ కార్యక్రమంలో కో-ఆర్డినేటర్స్, ఉపాధ్యాయ బృందాలు పాల్గొనటం జరిగింది.

Leave a Reply