శర్వానంద్ ఆశలు ఆ రెండు సినిమాల మీదనే…

ఈ సారి   సాలిడ్   హిట్   పక్కా  అంటున్న శర్వానంద్...

యంగ్ హీరో శర్వానంద్ నాలుగేళ్ళ క్రితం ‘మహానుభావుడు’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు ..ఈ సినిమా ట్రైలర్స్ ,అండ్ టీజర్స్ , సాంగ్స్ , మరియు శర్వానంద్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .. శర్వానంద్ కెరీర్ లో నే మహానుభావుడు సినిమా బిగ్గెస్ట్ హిట్ అవ్వడమే కాకుండా , శర్వానంద్ యాక్టింగ్ ,కు మంచి పేరు వచ్చింది .. మహానుభావుడు సినిమా తరువాత శర్వానంద్ యంగ్ డైరెక్టర్ హను రాగావపుడి డైరెక్షన్ లో పడి పడి లేచే మనసు లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమాలో నటించారు . ఈ సినిమా ట్రైలర్స్ , అండ్ టీజర్స్ , సాంగ్స్ మరియు డైరెక్టర్ హను రాగావపుడి మేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఆశించినంత స్థాయి లో విజయం సాధించలేకపోయింది …. ఈ సినిమా తరువాత మరో హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్ లో రణరంగం అనే మాస్ ఎంటర్ టైనర్ సినిమా లో నటించారు . ఈ సినిమా లో శర్వానంద్ యాక్టింగ్ కు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు . ఈ సీనిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , సాంగ్స్ ,మరియు సుధీర్ వర్మ టేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర యావేరేజ్ టాక్ తెచ్చుకుంది .. .. రణరంగం సినిమా తర్వాత చేసిన జాను సినిమా కూడా ఆశించినంత స్థాయి లో విజయం సాధించలేకపోయింది ..2021 లో వచ్చిన శ్రీకారం సినిమా కూడా శర్వానంద్ కు చేదు అనుభవం మిగిలిచింది …

శర్వానంద్ – సిద్దార్ద్ , మల్టీ స్టారర్ గా డైరెక్టర్ అజయ్ భూపతి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా మహా సముద్రం . లాంగ్ గ్యాప్ తరువాత హీరో సిద్దార్ద్ టాలీవుడ్ లో రీ ఎంట్రీ , మరియు మల్టీ స్టారర్ గా తెరకెక్కడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి . ఈ సినిమా మీద ఓవర్ కాన్ఫిడెంట్ తో ఉన్న డైరెక్టర్ అజయ్ భూపతి ఆశలు అన్ని నిరాశ అయినాయి . ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ అండ్ సాంగ్స్ ,మరియు మేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం డిసాస్టర్ టాక్ తెచ్చుకుంది .. దీంతో ఇప్పుడు శర్వా కు అర్జెంట్ గా ఓ హిట్ అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో యువ హీరో ఆశలన్నీ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే సినిమాపైనే ఉన్నాయి. నేను శైలజ’ ‘చిత్రలహరి’ వంటి సూపర్ హిట్స్ అందుకున్న కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో శర్వా సరసన లక్కీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. .ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతుంది ..ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలతో పాటుగా హిందీ సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది రష్మిక. ఆమె క్రేజ్ మరియు లక్ ఇప్పుడు శర్వా కు హెల్ప్ అయ్యే అవకాశం ఉంది అని తెలుస్తుంది .. శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు ‘ సినిమా తో పాటుగా ‘ఒకే ఒక జీవితం’ అనే తెలుగు తమిళ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడు . ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది .. శర్వానంద్ కెరీర్ ఇప్పుడు చాలా లో ఫెస్ లో ఉంది , అలానే తాను స్టోరీ సెలెక్షన్ లో కాస్త శ్రద్ద చూపిస్తే మరింత సక్సెస్ అవుతాడు , మరి ఈ రెండు సినిమాలతో అయిన హిట్ అందుకొని బౌన్స్ బ్యాక్ అవుతాడో అనేది చూడాలి .. శర్వా కెరీర్ మళ్ళీ గాడిలో పడాలంటే ఈ రెండు సినిమాలు సక్సెస్ అవ్వాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి…