సె..క్స్ ఎడ్యుకేషన్ అనేది సె..క్స్ గురించి కాదు : ప్రముఖ లైంగికవిద్యావేత్త అంజు కిష్

Telugu Super News, Hyderabad, February 20, 2023: లైంగిక సంబంధమైన విషయాలపై పిల్లలు వేసే ప్రశ్నలకు మీ సమాధానాలేంటి? మీరు సంతృప్తికరంగా సమాధానాలు చెబుతున్నారా? లేదా దాటవేస్తున్నారా? మీరు దాట వేసినంత మాత్రాన వారు ఊరు కుంటున్నారా లేదా మరింత ఆసక్తి పెరిగి ఆ సమాచారం కోసం అంతర్జాలాన్ని సందర్శిస్తున్నారా?

ఇలాంటి విషయాలు మిమ్మల్ని బాధిస్తున్నాయా? అయితే మీరు అంజు కిష్ గురించి మరియు యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ మరియువారు చేపట్టిన చొరవ గురించి తెలుసు కోవాలసిందే.

ఇటీవల హైదరాబాద్లో యువ తల్లిదండ్రులు మరియు నగరంలోని కొన్ని ప్రముఖ పాఠశాలల అధిపతులు, ప్రతినిధులతో ఒక సెమినార్ నునిర్వహించారు. 250 మంది సభ్యులు మరియు ఆహ్వానిత అతిథులు సెషన్‌కు హాజరయ్యారు. వారిసభ్యులతో పాటు, HPS, ఓక్రిడ్జ్, కంగారూ కిడ్స్, న్యూయార్క్ అకాడమీ, మెరిడియన్ స్కూల్, ది ప్రీమియా అకాడమీ, శ్రీ రామ్ అకాడమీ వంటి నగరంలోని కొన్ని ప్రసిద్ధ పాఠశాలలప్రతినిధులు కూడా రెండున్నర గంటల పాటు సాగిన విజ్ఞాన ప్యాక్ సెషన్‌కు హాజరయ్యారు. ఈ సెమినార్లో ఎన్నో ఆసక్తికర అంశాలపై సమగ్రసమాచారాన్ని అందించడం జరిగింది.

సెక్స్ ఎడ్యుకేషన్ అనేది సెక్స్ గురించి కాదు, చాలా సానుకూల మరియుబాధ్యతాయుతమైన దృక్పథంతో పిల్లలు చిన్నతనం నుండి యుక్తవయస్సు వరకు సాఫీగామారడానికి సహాయం చేయడం అని అంజు కిష్, భారతదేశంలో ప్రముఖ లైంగికవిద్యావేత్త తెలిపారు. ఆమె సెక్స్ విద్య కోసం అంటాబూ అనే సంస్థను స్థాపించి లైంగికవిద్యపై ప్రజల్లోనున్న అపోహలను తొలగించి ఎంతో ఉపయోగకరమైన విషయాలను పంచుకున్నారు

అలాగే మనలో కొంతమంది సెక్స్ ఎడ్యుకేషన్ పిల్లలను భ్రష్టు పట్టిస్తుందని అనుకుంటారు. , అయితే వాస్తవాలు మరో రకంగా ఉన్నాయి. సెక్స్ ఎడ్యుకేషన్ ఉన్న మన దేశాలలోని గణాంకాలు ఆ విషయాన్ని తప్పు అని రుజువు చేస్తున్నాయి. లైంగిక విద్య అపరాధి కాదు, పిల్లలను సురక్షితంగా ఉంచడానికి ఇది పరిష్కారం అని తెలియవచ్చింది

అలాగే మనలో చాలామంది లైంగిక విద్య అవసరం లేదని, పిల్లలు అమాయకులని వారికీ ఈ విషయం తెలియదని, అందువలన లైంగిక విద్య అవసరం లేదని చాలా మంది తల్లిదండ్రులు కొట్టిపారేస్తారు. అలాంటి వారికొక ప్రశ్న. ఫ… అనే ఆంగ్లంలోని నాలుబు అక్షరాలా పదం చిన్నారులు వాడడం మంలో ఎంతమంది వినలేదు చెప్పండి.

ఒక చిన్నారి టీచర్ వద్దకు వెళ్లి జీ స్పాట్ అంటే ఏంటి అని అడగడం జరిగిందట. పిల్లలలు ఈ విషయాలు ఎలా తెలుసు అని మీరు అడగవచ్చు. పిల్లలు టీవీల్లో, పేపర్లలలో కండోమ్ ప్రకటనలు చూస్తున్నారు. ప్రసార మాధ్యమాల్లో, సినిమాల్లో రేపు సీన్లు చూస్తున్నారు. ఆన్లైన్ క్లాసులద్వారా పోర్నోగ్రఫీ(అశ్లీల వెబ్సైట్ల ) బారినపడుతున్నారు. చాకోలెట్ ఫ్లేవర్ కండోమ్ చాకోలెట్ కావాలని హోర్డింగ్ను చూపించి పిల్లలలు మారం చేస్తున్నారు.

తల్లి దండ్రులు ఇప్పటికైనా కళ్లుతెరవాలి.

కండోమ్, శానిటరీ ప్యాడ్, గే, ఎఫ్ , శిశువు కడుపులోకి ఎలా వస్తుంది? మధ్య వేలుచూపించడం అంటే ఏమిటి? అని పిల్లలు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఎలా వివరిస్తారు? చాలాకష్టం. వీటికి సులభమైన సమాధానాలు లేవు. కానీ అంజు కిష్ సమావేశం లో పాల్గొన్న వారందరితో పిల్లలు అడిగినప్పుడల్లా ఈ పదాలను వివరించే అద్భుతమైన మార్గాన్ని పంచుకున్నారుమరియు ప్రతి తల్లితండ్రులు ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న తల్లు వీటి గురించితెలుసుకోవాలి అని చెప్పారు.

“తల్లి గర్భాన్ని చూసి చిన్న పాప మీ పొట్టలోకి ఎలావచ్చింది మమ్మీ అని చాలామంది చిన్నారులు అడగడం చాలామంది తల్లులకు ఎదురైనా విషయమే. మరి అలంటి ప్రశ్నకు మీ సమాధానమేంటి?

ఇలాంటి విషయంలో చాల సరళమైన మరియు వయస్సుకి తగిన వివరణ బాగా అవసరం. మీరు చెప్పే సమాధానం చాల సింపుల్ గా ఉండాలి మరియు చిన్నారులకు అర్థమయ్యే విధంగా ఉండాలి. అంజు కిష్ ఎలా వివరించాలని సూచించిందో మీరే చదవండి

పొట్టలో ఒక చిన్న విత్తనం ఉంటుంది, సమయం వచ్చినప్పుడు, తల్లి విత్తనం శాస్త్రీయ ప్రక్రియ ద్వారా తండ్రి విత్తనం తో కలిసిపోతుంది ఒక విత్తనం ఒక మొక్కగా పెరుగుతుందో అదేపద్ధతిలో పిల్లలు తల్లి గర్భం లో పెరుగుతారు.

ఇలా వారి వయస్సు పెరిగేకొద్దీ వయస్సుకి తగిన సమాచారం దశల వారిగా వారికీ తెలియజేయాలని ఆమె తెలియజేసింది.

ఆరు/ఏడేళ్ల పిల్లలకు శానిటరీ ప్యాడ్‌ను ఎలా వివరించాలో వివరిస్తూ, అంజు కిష్ ఈ విధంగా తెలిపారు. పిల్లలు చాల సార్లు ఎన్నో విషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాసను కలిగి ఉంటారు. మనం వారి వయసు ప్రకారం వివరం ఇస్తే బాగుంటుంది. లేకపోతే వారు వారి మిత్రులను, లేదా ఇంటర్నెట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.

అంజు కిష్ శానిటరీ ప్యాడ్ పై ఇచ్చిన ఈ క్రింది వివరణ చాల అద్భుతంగా ఉంది. ప్రతి నెలా పొట్టలోని బేబీ బ్యాగ్‌ని శుభ్రం చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు కొచం రక్తం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది బట్టలు పాడు చేస్తుంది. అందుకే శానిటరీ ప్యాడ్ వినియోగించాల్సి వస్తుందనే వివరణ ఇవ్వాలి అని ఆమె తెలియజేసింది.

ఆలా కాకుండా కొతమంది ఏవేవో చెప్పి పిల్లలని గందరకొలానికి గురిచేస్తారు. ఈ విషయంలో తన వర్క్‌షాప్‌లో పాల్గొన్న వారిలో ఒకరికి జరిగిన ఫన్నీ సంఘటనను ఆమె ఒక ఉదాహరణగా పంచుకున్నారు. ఒక తల్లి ఒకసారి ఆన్‌లైన్‌లో శానిటరీ ప్యాడ్ కోసం ఆర్డర్ చేసింది మరియు ఇ-కామ్ పోర్టల్ దానిని డెలివరీ చేసింది. పార్శిల్ డెలివరీ తీసుకున్న పిల్లవాడు కుతూహలంతో తెరిచి అది ఏమిటని, ఎందుకు కొన్నావని తల్లిని అడిగాడు. అవి ఓ ప్రత్యేక సందర్భానికి నాప్‌కిన్‌లని చెప్పి, బాత్‌రూమ్‌లో ఆ ప్యాక్‌ను ఉంచినట్లు తెలిపింది. ఆ వివరణ ఆవిడా కొంప ముంచింది. ఒక రోజు ఆ ఇంటికి అతిథులు వచ్చినప్పుడు, శానిటరీ ప్యాడ్స్ ను అతిథులకు పంచుతున్న శిశువును చూసి తల్లి ఆశ్చర్యపోయింది. పదాలు మరియు వివరణలను ఎంచుకోవడంలో మనం జాగ్రత్తగా ఉండాలని ఈ సంఘటన మనకు నేర్పింది అని ఆమె అన్నారు .

యఫ్ అనే నాలుగు అక్షరాలా ఆంగ్ల పదం గురించి అంజు కిష్ ఇచ్చిన వివరణ చాల బాగుంది. ఈ పదాన్ని చాలామంది– పెద్దలు, పిల్లలు విరివిగా వాడుతున్నారు. అందువలన దీని పై ఎలాస్పందించాలో మనం తెలుసుకోవడం చాల అవసరం. ఇది ఒక అగౌరవపూర్వకమైన పదం. ఇది ఒక మంచి పదం కాదు. మనం ఉపయోగించకూడదు. ఎందుకంటే దాని అర్థం మీరు తెలుసుకోవాలి. దాని అర్థం ఏమిటంటే, మీరు ఇతర వ్యక్తులను వారి ప్రైవేట్ అవయవలనను మీకు చూపించమని అడుగుతున్నారు. అది తప్పు కదా అని ఆ చిన్నారులకు తెలియజేయండి అని అంజు కిష్ తెలిపారు.

గే అనేది మరొక పదం పిల్లలు తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటారు మరియు దాని గురించి అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మన దైనందిన జీవితం లో ఈ పదం మనమిప్పుడు తరచుగా విటున్నాం కాబట్టి. గే అంటే అందరి పెద్దలకు తెలిసినట్టుగా
స్వలింగ సంపర్కుడు. మీ పిల్లవాడి ప్రశ్న మీకు ఎదురైనప్పుడు మీరు ఈ వివరణ ఇవ్వండి

మగవారికి నీలం, స్త్రీలకు పింక్ కలర్ అంటే చాలా ఇష్టం అని వివరించండి. పురుషులకు కార్లంటే ఇష్టం, ఆడవారికి బొమ్మలంటే ఇష్టం. అంమాత్రాన అబ్బాయిలు పింక్ కలర్ నచ్చితే తప్పేంటి. అమ్మాయిలు కార్లంటే ఇష్టపడితే తప్పేంటి. అబ్బాయిలు అమ్మాయిలను ప్రేమిస్తారు మరియు అమ్మాయిలు అబ్బాయిలను ప్రేమిస్తారు. ఇది సహజం, సృష్టి విధానం. అలాగే ఒక అమ్మాయిని ప్రేమించే అమ్మాయి మరియు అబ్బాయిని ప్రేమించే అబ్బాయి ఉండవచ్చు కదా. దానికి తప్పేంటి? అది చెడ్డదని అర్థం కాదు. అలాని వారిని నిందించడం చిన్న చూపు చూడడం సరికాదు కదా. అలంటి వారిని కూడా మనం గౌరవించాలి అని అంజు కిష్ వివరణ ఇచ్చింది

USA అంటే ఏమిటి అని అడిగిన కొడుకు నుండి అంజు స్వయంగా చాలా గమ్మత్తైన పరిస్థితిని ఎదుర్కొంది. మరియు మీరు ఎప్పుడైనా దానిని సందర్శించారా అని ఆ చిన్నారి ఆమెను వాకబు చేశాడు. USA అంటే “ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా” అనే సాధారణ వివరణ మనందరికీ తెలిసు. ఆమె ఆ సమాధానమే ఇచ్చింది. మరియు ఆమె దానిని సందర్శించినట్లు ధృవీకరించింది. కానీ ఆమె షాక్‌కు గురిచేసే విధంగా, ఆ కుర్రాడు దాని అర్థం ‘అండర్ ద స్కర్ట్ ఏరియా’ (లంగా లేదా గౌను లోపలి భాగం ) అని చెప్పాడు. దానికి ఆమె నిర్ఘాంతపోయింది.

అంజు కిష్ సర్టిఫైడ్ సెక్స్ ఎడ్యుకేటర్, డబుల్ గ్రాడ్యుయేట్, మాజీ జర్నలిస్ట్, ఆసక్తిగల రచయిత, ఉద్వేగభరితమైన వక్త మరియు ఆలోచనాపరురాలు. లైంగిక విద్యపై అంజు కిష్ సెషన్‌ను చాల సరదాగా మరియు విద్యావంతం చేసే విధంగా సాగింది. ఆమె ఇద్దరు యుక్త వయస్సు గల పిల్లల తల్లి. ఆమె సేఫ్టీ అండ్ సెక్స్ ఎడ్యుకేషన్‌కు అంకితమైన అన్‌టాబూ అనే సంస్థ వ్యవస్థాపకురాలు. సురక్షితమైన సమాజాన్ని పెంపొందించడానికి వాయింగిక విద్య అనే విషయం చుట్టూ ఉన్న నిషేధాలను విచ్ఛిన్నం చేయడానికి పని చేస్తోంది.

అంజు కిష్ ఇంకా మాట్లాడుతూ, ‘మనం సెక్స్ ఎడ్యుకేషన్ అనే పదానికి మరొక పర్యాయపడాన్ని కనుక్కోవాలి. సెక్స్ ఎడ్యుకేషన్ అనగానే ప్రజల్లో ఎన్నో వికృత, వింత ఆలోచనలు వస్తాయని, ఇది మారాలని అన్నారు. ‘బాడీ లిటరసీ’, ‘అడోలసెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం’ వంటి కొన్ని పదాలు వాడుతున్నప్పటికీ, ఇంకా మంచి పదాలు కావాలి, ప్రజలను భయపెట్టకుండా ధీమాగా ఉంచగలిగే పాదాలను మనం ప్రవేశపెట్టాలి. సంభాషణా చాతుర్యం తో, ఒక స్నేహితుడిగా పిల్లల విత్త ప్రశ్నలకు ఓపికతో సమాధానం చెప్పాలన్నారు.

లైంగిక విషయాల్లో పట్టణ ప్రజలు ఎక్కువగా ప్రయోగాలు చేస్తారని సాధారణంగా నమ్ముతారు, అయితే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పట్టణ ప్రత్యర్ధుల కంటే ఎక్కువ ప్రయోగాలు చేస్తున్నారు అని అంజు కిష్ తెలిపారు.

సెక్స్, యుక్తవయస్సు, లైంగిక గుర్తింపు మరియు పిల్లలు అడిగే వివిధ ప్రశ్నల విషయానికి వస్తే వివిధ వయసుల పిల్లలతో ఎలా కమ్యూనికేట్ చేయాలో యువకులు మరియు తల్లులు, బామ్మలు మరియు ప్రేక్షకులలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం మరియు జ్ఞానోదయం చేయడం ఆ సెషన్ యొక్క లక్ష్యం. నిషేధాన్ని బద్దలు కొట్టడం మరియు ఈ అంశాలపై సరైన జ్ఞానంతో చదువుకున్న పిల్లలను పెంచడానికి సరైన సమాధానాలు ఇవ్వడంపై దృష్టి పెట్టాలని ఆమె సూచించింది

ఈ తరానికి వారి వయస్సు కంటే ముందుగానే సమాధానాలు కావాలి అని కోరుకుంటున్నారని . 2 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల పిల్లలకు సంబంధించిన అంశాలు మరియు ప్రశ్నలను కవర్ చేస్తూ, సెషన్ సామాజిక కళంకాన్ని విచ్ఛిన్నం చేసే మరియు బహిరంగ సంభాషణను ప్రోత్సహించే తల్లిదండ్రులపై కొత్త దృక్పథాన్ని తీసుకువచ్చింది. ప్రతి చిన్నారికి తప్పుడు సమాచారం ఇవ్వకుండా మంచి అవగాహన ఉన్న సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ఈ ప్రయత్నం జరిగింది. అంతిమంగా ఈ సెషన్ బాధ్యతాయుతమైన మరియు సాధికారత కలిగిన తరువాతి తరాన్ని నిర్మించడంలో సహాయపడుతుందని , ఇది ప్రతి అంశంపై వారి తల్లిదండ్రులతో బహిరంగ సంభాషణను విశ్వసిస్తుంది, అని ఈ సెషన్ నిర్వాహకులు YFLO ఛైర్‌పర్సన్ శ్రీమతి శ్రీమతి సోనాలి మోడీ సరాఫ్ పంచుకున్నారు.

సెషన్‌కు ముందు అంజు కిష్ మీడియాతో మాట్లాడుతూ, సెక్స్ ఎడ్యుకేషన్ అంటే సెక్స్ గురించి కాదని, పిల్లలను చాలా సానుకూలంగా మరియు బాధ్యతాయుతమైన దృక్పథంతో బాల్యం నుండి యుక్తవయస్సుకు సాఫీగా మార్చడంలో సహాయపడే ఆలోచనలను మార్చడానికి మరియు ప్రజలను గుర్తించడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.

భారతదేశంలో యుక్తవయస్సులో గర్భం దాల్చేవారి సంఖ్య ఎక్కువగా ఉందని చెబుతారు. భారతదేశంలో 5 నుండి 12 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలలో 53% మంది లైంగిక వేధింపులకు గురవుతున్నారు. భారతదేశంలో సగటున 11 సంవత్సరాలు వయస్సుగల పిల్లలు అశ్లీల వెబ్సైట్లు చూస్తున్నారని మరియు 14 సంవత్సరాల వయస్సులోనే లైంగిక ప్రయోగాలు చేస్తున్నారన్నారు.

సెక్స్ ఎడ్యుకేషన్ పిల్లలను భ్రష్టు పట్టిస్తుందని చాలా మంది నమ్ముతారు, అయితే అందులో ఏమాత్రం నిజం లేదని వాస్తవిషయాలు వెల్లడిస్తున్నాయన్నారు

వయస్సుకు తగిన సమాధానాలు ఇవ్వగల తల్లితండ్రులుగా మారడానికి Untaboo మీకు సహాయం చేయనివ్వండి. WhatsApp 09819457204

మరింత సమాచారం కోసం www.untaboo.in వైబ్సైట్ ను సందర్శించగలరు

According to Anju Kish, the following are some of the questions Children have asked their teachers

How are babies born?
What is rape?
What is Gay?
What is Condom?
What is a sanitary napkin?
What is a hand job?
Is it true that girls have to be tied and hit during sex?
Why cant boys give birth to a child?
Why can only married people have babies?
What is G-Spot?
How does a baby get into tummy?
What is sex?
Why do girls have boobies?
Why do adults kiss on the lips?
Why don’t adults drink their mothers milk?
What is smooching?
What is Fuck?
What is Virginity?

అంజు కిష్ ప్రకారం, పిల్లలు వారి ఉపాధ్యాయులను అడిగిన కొన్ని ప్రశ్నలు ఈ క్రింది విధంగా ఉన్నాయి

పిల్లలు ఎలా పుడతారు?
అత్యాచారం అంటే ఏమిటి?
గే అంటే ఏమిటి?
కండోమ్ అంటే ఏమిటి?
శానిటరీ నాప్‌కిన్ అంటే ఏమిటి?
హ్యాండ్ జాబ్ అంటే ఏమిటి?
శృంగారంలో ఆడపిల్లలను కట్టేసి కొట్టాలి అన్నది నిజమేనా?
అబ్బాయిలు ఎందుకు బిడ్డకు జన్మనివ్వలేరు?
వివాహితులు మాత్రమే పిల్లలను ఎందుకు కలిగి ఉంటారు?
జి-స్పాట్ అంటే ఏమిటి?
శిశువు కడుపులోకి ఎలా వస్తుంది?
సెక్స్ అంటే ఏమిటి?
అమ్మాయిలకు బూబీలు ఎందుకు ఉన్నాయి?
పెద్దలు పెదవులపై ఎందుకు ముద్దు పెట్టుకుంటారు?
పెద్దలు తమ తల్లి పాలు ఎందుకు తాగరు?
స్మూచింగ్ అంటే ఏమిటి?
ఫక్ అంటే ఏమిటి?
వర్జినిటీ అంటే ఏమిటి?

Leave a Reply