పెట్టుబడిదారులకు సులభంగా వ్యాపారం చేయడం కోసం CDSL  బహు-భాషా కార్యక్రమాలను ప్రారంభించిన సెబీ ( SEBI)  చైర్‌పర్సన్

తెలుగు సూపర్ న్యూస్,జనవరి 19 , 2024: తమ  రజతోత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకుని,  ఆసియాలో మొట్టమొదటి లిస్టెడ్ డిపాజిటరీ అయిన సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్ (CDSL), క్యాపిటల్ మార్కెట్ ల్యాండ్‌స్కేప్‌లో  ఇంక్లూజివిటీ ,యాక్సెసిబిలిటీకి తన నిబద్ధతను వెల్లడించడానికి రెండు ప్రత్యేకమైన బహుభాషా కార్యక్రమాలను ప్రారంభించినట్లు వెల్లడించింది . 

 ఇటీవల  జరిగిన రజతోత్సవ కార్యక్రమంలో ఈ కార్యక్రమాలను సెబీ చైర్‌పర్సన్ శ్రీమతి  మాధబి పూరి బుచ్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమం లో ఎండి & సీఈఓ  శ్రీ నెహాల్ వోరా మాట్లాడుతూ, “మేము మా అద్భుతమైన ప్రయాణం  25 సంవత్సరాలను వేడుక చేసుకుంటున్న వేళ  సెబీ  చైర్‌పర్సన్ CDSL కీలకమైన కార్యక్రమాలను ప్రారంభించడం  గౌరవం గా భావిస్తున్నాము. 

ఇంక్లూజివిటీ మా ప్రధాన విలువ ద్వారా మార్గనిర్దేశం చేయబడిన ఈ కొత్త ఆవిష్కరణలు మాకు కీలక మైలురాయిగా నిలుస్తాయి . ఇన్‌క్లూజివ్ ట్రస్ట్‌ని నిర్మించడానికి పెంచడానికి అవసరమైన ప్రతి రంగంలోకి ప్రవేశించాలనేది మా ఆకాంక్ష” అని అన్నారు 

Leave a Reply