సమంత భరణంపై సోషల్ మీడియా లో వస్తున్న రూమర్స్

సమంత భరణంపై సోషల్ మీడియా లో వస్తున్న రూమర్స్ …

నాగ చైతన్య సమంతల విడాకుల పై తరుచు రోజు ఏదో ఒక న్యూస్ చూస్తున్నాం .. సోషల్ మీడియా లో నాగ చైతన్య సమంత విడిపోతున్నారు అని రోజు ఎదో ఒక న్యూస్ వింటూనే ఉన్నాం , అయితే ఎట్టకేలకు ఈ రోజున ఈ న్యూస్ కి ఈ రోజున క్లారిటీ వచ్చింది .. అందరూ అనుకున్నదే నిజమైంది. గత కొంత కాలంగా నాగ చైతన్య సమంత ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తూనే ఉన్నాయి , అయితే వీరిద్దరి మధ్య వచ్చే మనస్పర్థలకుచాలా పెద్దవి గా ఉండే సరికి చివరికి కౌన్సిలింగ్ దాకా వెళ్లాయి ..మజిలీ సినిమా తరువాత నాగ చైతన్యు కొంత గ్యాప్ తీసుకొని శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో లవ్ స్టోరీ సినిమా చేసాడు , అయితే చై సినిమాకు ఎప్పుడు సపోర్ట్ చేసే సమంత లవ్ స్టోరీ సినిమాకు , ట్విట్టర్ వేదికగా సాయి పల్లవికి , మరియు చిత్ర యూనిట్ కి అల్ ది బెస్ట్ అని చెప్పడం అభిమానులకు నిరాశ కలిగించింది , అదే విధంగా సమంత పిక్స్ కొన్ని సోషల్ మీడియా లో వైరల్ అవ్వడం అక్కినేని అభిమానులకు ఆవేదన గురి చేయడం జరిగింది .. సమంత నటించిన ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో కొన్ని సన్నివేశాలు అక్కినేని కుటుంబానికి నచ్చలేదు . అలాగే సూపర్ డీలక్స్ సినిమాలో కూడా కొన్ని సన్నివేశాలు కూడా సమంత చేయడం నాగా చైతన్య కు ఇష్టం లేదు , అలానే సూపర్ డీలక్స్ సినిమాలో సమంత కు కొన్ని సీన్స్ చేయద్దు అని నాగ చైతన్య చెప్పడం జరిగింది .. ఏది ఏమి అయినా సమంత నాగ చైతన్య విడిపోవడం ఇటు అక్కినేని అభిమానులకు , ఇటు ఇండస్ట్రీకి మింగుడు పడని విషయం ..ప్రధానంగా నాగ చైతన్య -సమంత ల మధ్య ఇగో క్లాష్ రావడం జరిగింది , అలానే సమంత బోల్డ్ గా నటించడం అక్కినేని కుటుంబానికి ఇష్టం లేదు , ఈ విషయం ఫై అక్కినేని కుటుంబం చాలా సీరియస్ గా ఉంది సమంత నటించడం పై అక్కినేని కుటుంబం ఆక్షేపణ కూడా తెలిపారు .. 2017, అక్టోబర్‌ 7న సమంత- నాగ చైతన్య పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గోవాలో క్రిస్టియన్‌, హిందూ సాంప్రదాయాల ప్రకారం వీరు పెళ్లి చేసుకున్నారు. సమంత నాగ చైతన్యల విడాకులపై గత నెల నుంచి వస్తోన్న రూమర్లను నిజం చేస్తూ ఈ ఇద్దరూ అధికారికంగా ప్రకటన చేశారు, అయితే ఈ వార్త విన్నప్పటి నుంచి అక్కినేని అభిమానులు కొంత అందోళంగా ఉన్నారు .. నాగ చైతన్య తన ట్విట్టర్‌ ద్వారా అధికారికంగా విడాకుల గురించి ప్రకటించి , బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని, ఎవరి దారి వారు చూసుకోవాలనుకున్నామని పేర్కొన్నారు.తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దంటూ కోరాడు. మరోవైపు సమంత సైతం నాగచైతన్యతో విడిపోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రకటించింది. పదేళ్ల స్నేహానికి ముగింపు పలుకుతున్నామని, అయితే విడిపోయినా స్నేహితులుగా కలిసి ఉంటామని సమంత పేర్కొంది. మా శ్రేయోభిలాషులందరికీ.. ఇక నుంచి మేం భార్య-భర్తలుగా దూరంగా ఉండాలనుకుంటున్నాం. చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తతం నాగ చైతన్య – సమంతల విడాకుల విషయం హాట్ టాపిక్ గా మారింది , విడాకుల విషయం పై సోషల్ మీడియా లో రోజు ఎదో ఒక న్యూస్ వింటూనే ఉన్నాం .. ఏది ఏమైన ఇద్దరు న్యాయ పరంగా విడాకులు తీసుకున్నారు , అలానే విడాకులు తీసుకోగానే ఇటు సమంత , మరియు అక్కినేని నాగార్జున ట్విట్టర్ వేదిక గా పలు కామెంట్స్ చేయడం జరిగింది , ఈ విషయం పై ఇటు అక్కినేని అభిమానులు , సినీ ఇండస్ట్రీ మొత్తం ఈ వార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు .. ఈ క్రమంలో విడాకుల అనంతరం నాగ చైతన్య ఇచ్చే భరణం ఎంత ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది .. ఈ విడాకుల ప్రాసెస్‌లో భాగంగా అక్కినేని స్థిర, చర ఆస్తులను చూస్తుంటే సమంతకు భరణం కింద రూ. 250 కోట్ల రూపాయల నుంచి రూ. 300 కోట్ల వరకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి.. మరికొంత మంది అయితే రూ. 50 కోట్ల ఇచ్చే అవకాశం ఉందని అంటుండగా..మరికొందరెమో సమంత ఒక స్టార్‌ హీరోయిన్‌, ఇప్పటికే ఆమె ఎన్నో స్థిర, చర ఆస్తులను సంపాదించుకుంది. ఇప్పటికీ సమంతకు అవకాశాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. అలాంటి సామ్‌కు భరణం తీసుకునే అవసరం లేదంటూ పలు రకాల వార్తలు వస్తున్నాయి . అసలు మరి ఇంతకీ నాగ చైతన్య నుంచి సమంత భరణం తీసుకుంటుందా లేదా? అనే వార్త పై అక్కినేని ఫ్యామిలీ స్పందిస్తే నే గాని క్లారిటీ రాదు ..

Leave a Reply