యాక్షన్ థ్రిల్లర్ కు శ్రీకారం చుట్టిన ఆది సాయికుమార్

కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా లకు డిమాండ్ పెరుగుతున్న ట్రెండ్ లో ఒక క్రైమ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ తో ఆది సాయికుమార్ హీరో గా కొత్త సినిమా కు ముహూర్తం కుదిరింది. చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్ లో తొలి ప్రొడక్షన్ గా రూపొందనున్న ఈ సినిమా అక్టోబర్ 15న రామానాయుడు స్డూడియోస్ లో ఉదయం 9 : 45 కి ప్రారంభం కానుంది. ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ పోస్టర్స్ ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. దర్శకుడు శివశంకర్ దేవ్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. శ్రీమతి సునీత సమర్పణలో, అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.

ఈ లుక్ బాగా ఆకట్టుకుంటోంది. పోస్టర్ ను బట్టి ఇదొక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అనిపిస్తోంది. సూట్ వేసుకున్న హీరో చేతిలో పిస్టల్ తో టార్గెట్ ఎయిమ్ చేశారు. మరి ఆ టార్గెట్ ఏంటో, ఎందుకో తెలియాలంటే సినిమాలో చూడాలి. ఈ సినిమా ఆది సాయి కుమార్ కు కొత్త ఇమేజ్ ని తెస్తుందనే భరోసా కలిగించింది. ఆది సాయికుమార్ ఇటీవల కొత్త తరహా చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలా ఆయన చేస్తున్న మరో డిఫరెంట్ అటెంప్ట్ గా ఈ సినిమాను చెప్పుకోవచ్చు.

నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్న ఈ చిత్రానికి సంగీతం – అనీష్ సొలమన్, సినిమాటోగ్రఫీ – గంగనమోని శేఖర్, పీఆర్వో – జీఎస్కే మీడియా, సమర్పణ – శ్రీమతి సునీత, నిర్మాత – అజయ్ శ్రీనివాస్, దర్శకత్వం – శివశంకర్ దేవ్.