ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఆ డైరెక్టర్ పరిస్థితి ఏంటి ???

వకీల్‌ సాబ్‌’ మూవీ తర్వాత పవన్‌ కల్యాణ్‌ నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్‌’ ..ఇక ఈ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ భీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను అలరించారు . ఇక ఈ మూవీ లో మరో నెగిటివ్ షేడ్స్ ఉన్న డానియెల్ శేఖర్ క్యారెక్టర్ లో రానా అద్భుతంగా నటించారు .. ఇక అసలు విషయానికి వెళ్ళితే ఈ మూవీని యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించడం మరో విశేషం .. మలయాళంలో ఘన విజయం సాధించిన అయ్యప్పనుమ్‌ కొషియుమ్‌ మూవీ రీమేక్ గా భీమ్లా నాయక్ మూవీ తెరకెక్కింది .. ఈ మూవీ ప్రధాన బలం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ స్క్రీన్ ప్లే ..ఈ మూవీ ట్రైలర్స్ టీజర్స్ , సాంగ్స్ పవన ఇంటెన్స్ యాక్టింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అందుకుంది .. ఈ మూవీ హిట్ అవ్వడానికి ప్రధాన కారణం త్రివిక్రమ్ సంభాషణలు , స్క్రీన్ ప్లే అని తెలుస్తుంది .. ఇక ఈ మూవీ ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో డైరెక్టర్ సాగర్ కె చంద్ర గురించి ఇండస్ట్రీ అంతా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు ..ఈ యంగ్ డైరెక్టర్ కు వరుసగా అవకాశాలు వస్తున్నాయి . ఇప్పడికే ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌లో సాగర్ కె చంద్ర డైరెక్షన్‌లో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోందని సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి …

మొదటి మూవీ “అయ్యారే” తో ఆహా అని పించింన డైరెక్టర్ సాగర్ కె చంద్ర..ఆ తరువాత ‘అప్పట్లో ఒకడుండేవాడు’అనే చిత్రంతో మంచి దర్శకుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు .. ఇక భీమ్లా నాయక్‌తో మాత్రం స్టార్‌ డైరెక్టర్ గా ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు .. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో కాస్త లేటుగానైనా సాగర్ కె చంద్రకి టాలీవుడ్ బడా నిర్మాతల నుంచి వరుస ఆఫర్స్ దక్కడం మరో విశేషం … ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌లో సాగర్ కె చంద్ర డైరెక్షన్‌లో ఒక సినిమా , భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై మరో పెద్ద సినిమాలు రెండు లైన్ లో ఉన్నాయి .. . పదేళ్ళుగా సరైన బ్లాక్‌ బస్టర్‌ కోసం ఎదురు చూస్తున్న డైరెక్టర్‌ సాగర్ కె చంద్ర, కెరీర్‌ను పవర్ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ‘భీమ్లానాయక్’ చిత్రం సరికొత్త మలుపు తిప్పింది .. సైలెంట్ గా బ్యాక్ టు మూవీస్ లైన్ లో పెడుతున్న ఈ యంగ్ డైరెక్టర్ డైరెక్ట్ చేయబోతున్న హీరోస్ ఎవరు ?? అనేది ఇప్పటి దాకా ఒక క్లారిటీ లేదు .. మరి మొత్తానికి డైరెక్టర్ సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో నటిస్తున్న ఆ హీరోలు ఎవరు , ఇంకా కాస్టింగ్ ఎవరు ?? అనే విషయాలు తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్సుమెంట్ వచ్చేంతవరకు ఎదురుచుడాలిసిందే …