కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ లుక్ అదరహో…

కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ హై వోల్టేజ్ లుక్ 


     
రామ్ చరణ్ – ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా ఆర్ ఆర్ ఆర్ . ఈ సినిమా తో రామ్ చరణ్ , మరియు ఎన్టీఆర్ ఇద్దరు పాన్ ఇండియా హీరోలుగా మరో మెట్టు ఎక్కబోతున్నారు .. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ , మరియు ప్రేక్షకుల అందరూ ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు . ఆర్ ఆర్ ఆర్ విషయంలో ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి , ఇప్పటికే రిలీజ్ అయిన మోషన్ పోస్టర్స్ , మరియు లిరికల్ సాంగ్స్ కు ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది . ఈ సినిమా లో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ లో కనిపిస్తున్నారు .ఈ క్యారెక్టర్ కు సంబంధించి రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ చేయగా నందమూరి అభిమానుల్లో ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది . ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ మరియు ప్రేక్షకులందరూ , ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుందో అని ఆశగా ఎదురుచూస్తున్నారు , అలానే ఈ సినిమాకు సంబంధించి , ఇటీవలే రిలీజ్ అయినా నాటు నాటు సాంగ్ కు ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ..తాజాగా ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించి ఒక అప్ డేట్ బయటకు వచ్చింది .. ఈ సినిమా ట్రైలర్‌ని చిత్ర యూనిట్ మొదటగా డిసెంబర్‌ 3న విడుదల చేయాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల డిసెంబర్‌ 9కి వాయిదా పడింది. దీంతో ప్రేక్షకులు కాస్త డిస్సపాయింట్ అయ్యారు ..రాజమౌళి ట్రైలర్ రిలీజ్ డేట్ ఒకసారి ఫిక్స్ అయితే మల్లి డేట్ అనేది మారదు , కానీ ఎందుకో ఇలా ట్రైలర్ డేట్ మారిపోయే సరికి అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు , మరి ప్రేక్షకులని డిస్సపాయింట్ చేయకుండా డైరెక్టర్ రాజమౌళి ఒక పెద్ద సర్‌ప్రైజ్‌ ప్లాన్ చేశారు .

సినిమాను సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాత దానయ్య నిర్మిస్తున్నారు ..అలానే తారక్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని ఎన్టీఆర్ కు సంబంధించి పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు .ప్రస్తుతం ఈ పోస్టర్ మరో హాట్ టాపిక్ గా మారింది .. ఆర్ ఆర్ ఆర్ సినిమా లో తారక్ కొమరం భీమ్ రోల్ లో కనిపిస్తున్నారు , ఇప్పటికే ఈ క్యారెక్టర్ కు సంబంధించి టీజర్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది . ప్రస్తుతం ఎన్టీఆర్ కొమరం భీమ్ పోస్టర్ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటున్నారు , ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు , అలానే కొమరం భీమ్ రోల్ లోని డైరెక్టర్ రాజమౌళి హై వోల్టేజ్ తో డిజైన్ చేసినట్లు పోస్టర్ చూస్తే అర్ధం అవుతుంది .. ఈ పోస్టర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ లుక్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మంచి రెస్పాన్స్ లభించింది ..ఎన్టీఆర్ పోస్టర్ చూస్తుంటేనే అభిమానుల్లో ఇంత భారీ లెవెల్ రెస్పాన్స్ వస్తుంది అంటే , మరి అదే ఆర్ ఆర్ ఆర్ సినిమా ట్రైలర్ చూస్తే అభిమానులకు నిజంగానే పూనకాలు వస్తాయి ..