” రిచిగాడి పెళ్లి” లోని “ఏమిటిది మతి లేదా.. ప్రాణమా..” సాంగ్ 

” రిచిగాడి పెళ్లి” లోని “ఏమిటిది మతి లేదా.. ప్రాణమా..” సాంగ్  వింటుంటే..మళ్లీ మళ్లీ వినాలనేలా ఉంది..ప్రముఖ సంగీత దర్శకుడు థమన్

కె ఎస్ ఫిలిం వర్క్స్ సంస్థ నుండి రాబోయే చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని “రిచి గాడి పెళ్లి” 9అనే టైటిల్ తో విడుదలకు సిద్ధంగా ఉంది. అనంత్ శ్రీరామ్ రాసిన “ఏమిటిది మతి లేదా.. ప్రాణమా”  పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. కైలాష్ గారు ఇదివరకే బాహుబలి, భరత్ అనే నేను,, మున్నా,మిర్చి, పరుగు అరుంధతి,గోపాల గోపాల, రాజన్న వంటి అనేక సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు పాడారు. అలాగే ఈ చిత్రంలో  పాడిన “ఏమిటిది మతి లేదా.. ప్రాణమా” అను పాటను ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ గారు మెచ్చుకున్నారు, ఈ పాట గురించి

ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ .. “రిచిగాడి పెళ్లి” లోని “ఏమిటిది మతి లేదా.. ప్రాణమా..” సాంగ్ చూశాను. కైలాష్ గారు ఏక్స్ట్రార్డినరీగా పాడారు,  తన వాయిస్ ఈ పాటకి  చాలా బాగుంది. నాకు హేమ రాజ్  వైశాలి సినిమా నుంచి తెలుసు ఈ సినిమాకు ఆయన పని చేయడం చాలా ఆనందంగా ఉంది, అందరూ మంచి ప్రయత్నం తో ఈ సినిమా చేస్తున్నారు, అందరూ సపోర్ట్ చేయాలి ఈ సాంగ్  వింటుంటే నన్ను లొకేషన్ కు తీసుకెల్లింది. అనంత శ్రీరామ్ గారి లిరిక్స్ లో కైలాస్ గారు బ్యూటిఫుల్ గా పాడారు, సత్యన్‌ చాలా బాగా  కంపోజ్ చేశారు, ఈ సినిమా అందరికీ మంచి హిట్ కావాలని  మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు

లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ మాట్లాడుతూ …రిచి గాడి పెళ్లి వంటి విచిత్రమైన చిత్రంలో  ఏమిటిది మతి లేదా.. ప్రాణమా అనే వేదాంతాన్ని బోధించే పాట.ఇది అంత పెద్ద  వేదాంతాన్ని బోధించినా కూడా అలతి అలతి పదాలతో అందరికీ అర్థమయ్యే రీతిలో మధురమైన బాణీలో ఈ పాట ఉంటుంది. కె యెస్ . హేమ రాజ్ గారి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఒక సృజనాత్మక కి బడ్జెట్ అనేది పరిధి కాదు, ఎంత తక్కువ బడ్జెట్లో అయినా ఏంతో అద్భుతమైన  కథనాన్ని చెప్పవచ్చు అని నిరూపించిన  చిత్రం ఇది. మనం చిన్నప్పుడు బల్లల మీద ఆడుకున్న చిన్న చిన్న ఆటలను (ఇప్పట్లో ఇండోర్ గేమ్స్) ఆధారం చేసుకుని తీసిన సినిమా ఇది. ఆ చిన్న ఆట వల్ల ఎన్ని జీవితాల్లో, ఎన్ని ప్రేమల్లో, ఎన్ని స్నేహాల్లో ఎన్ని మార్పులు వస్తాయి, ఎన్ని మలుపులు తిరిగాయి అనేదే ఈ కథాంశం మీ అందరినీ కచ్చితంగా నచ్చుతుంది. అలాగే నేను రాసిన పాట కూడా మిమ్మల్నందరినీ కచ్చితంగా అలరిస్తుంది అని అన్నారు. 

దర్శకుడు కె యెస్ .హేమరాజ్ మాట్లాడుతూ… “రిచి గాడి పెళ్లి” అనేది మానవ సంబంధాలకు అద్దంపట్టే కథ. ప్రతి పాత్రలో వేరియేషన్ ఉండేలా డిజైన్ చేశాం. ముఖ్యంగా లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ రాసిన పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది.ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ గారు పాట చాలా బాగుందని మెచ్చుకున్నారు, వారికి మా కృతజ్ఞతలు .ఇంత మంచి పాట అందించిన అనంత శ్రీరామ్ కు ,సింగర్స్ కు ధన్యవాదాలు.మా డిఓపి విజయ్ ఉలగనాథ్ గారు చేసిన వర్క్ చిత్రానికి  హైలైట్ గా నిలుస్తుంది ఆయనకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. అలానే చిత్రానికి పనిచేసిన బృందం మొదలు తారాగణం వరకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

నటీనటులు
నవీన్ నేని, ప్రణీత పట్నాయక్, సత్య sk, కిషోర్ మర్రి శెట్టి, ప్రవీణ్ రెడ్డి, సతీష్ శెట్టి, బన్నీ వోక్స్, చందనరాజ్, కియారా నాయుడు, మాస్టర్ రాకేశ్ తమోఘ్నా తదితరులు

సాంకేతిక నిపుణులు
కె.యస్. ఫిల్మ్ వర్క్స్
సినిమా – “రిచి గాడి పెళ్లి”
నిర్మాత – కె.యస్. ఫిల్మ్ వర్క్స్
స్క్రీన్ ప్లే & దర్శకత్వం – కె.యస్. హేమరాజ్
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు – రామ్ మహంద్ర & శ్రీ
సహ నిర్మాత- సూర్య మెహర్
సినిమాటోగ్రఫీ – విజయ్ ఉలగనాథ్ సంగీతం – సత్యన్
ఎడిటర్ – అరుణ్ ఇ.యమ్
కథ – రాజేంద్ర వైట్ల & నాగరాజు సాహిత్యం – అనంత శ్రీరామ్ & శ్రీ మణి
డైలాగ్స్ – రాజేంద్ర వైట్ల
ఆర్ట్స్ – హరి వర్మ
కొరియోగ్రాఫర్ – సతీష్ శెట్టి
డిజైన్స్ – రెడ్డోట్ పవన్
కాస్ట్యూమ్ డిజైనర్ – సంధ్య సబ్బవరపు
మేకప్ – అంజలి సంఘ్వి
స్టిల్స్ – యమ్. యస్ ఆనంద్
డిజిటల్ – మనోజ్
పి.ఆర్.ఓ – మధు వి.ఆర్