పాన్ ఇండియా సినిమాను లైన్ లో పెట్టిన మాస్ మహారాజ్ రవితేజ…

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఎనౌన్స్ చేస్తున్న మాస్ మహారాజ్  

మాస్ మహారాజ్ రవితేజ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ” క్రాక్” .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది .. క్రాక్ సినిమా కంటే ముందు వచ్చిన సినిమాలు డిసాస్టర్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా రవితేజ కెరీర్ అయిపోయింది అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపించాయి .. ఇండస్ట్రీ లో మినిమమ్ గ్యారెంటీ ఉన్న హీరో రవితేజ , గత కొంత కాలంగా రవితేజ కు సరి అయినా హిట్స్ లేవు , రవితేజ – డైరెక్టర్ అనిల్ రావిపూడి – కాంబినేషన్ లో వచ్చిన రాజా ది గ్రేట్‌ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .. రాజా ది గ్రేట్ సినిమా తరువాత చేసిన నేల టిక్కెట్టు , అమర్ అక్బర్ ఆంటోని ,డిస్కో రాజా , సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద డిసాస్టర్ గా నిలిచాయి .. మాస్ మహారాజ్ రవితేజ కు ఒక సాలిడ్ కంటెంట్ ఉన్న స్టోరీ పడితే చాలు మల్లి ఫామ్ లో వస్తాడు అని ప్రేక్షకులు నమ్మకంగా చెబుతుంటారు .. రాజా ది గ్రేట్‌ సినిమా తరువాత వచ్చిన సినిమాలు బాగా డిస్సపాయింట్మెంట్ అయ్యాయి , అంతే కాకుండా రవితేజ సినీ కెరీర్ గ్రాఫ్ కూడా బాగా పడిపోయింది .. రవితేజ సినిమా నుండి ఏ అంశాలు కోరుకుంటున్నారో , అవి ఒక సాలిడ్ స్క్రిప్ట్ లో ఉంటే చాలు రవితేజ దాన్ని నెక్స్ట్ లెవెల్ లో చుపిస్తానికి ట్రై చేస్తారు .. మాస్ మహారాజ్ రవితేజ ది – డైరెక్టర్ శ్రీను వైట్ల ది హ్యాట్రిక్ కాంబినేషన్ , గతంలో వీరిద్దరి కాంబో లో వచ్చిన వెంకీ సినిమా , మరియు దుబాయ్ శ్రీను సినిమాలు బిగ్గెస్ట్ హిట్స్ అయి , డైరెక్టర్ శ్రీను వైట్ల కు మంచి పేరు తీసుకొచ్చాయి . మాస్ మహారాజ్ రవితేజ – డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన హ్యటిక్ సినిమా “అమర్ అక్బర్ ఆంటోని ” .. ఈ సినిమా మాస్ మాహారాజ్ రవితేజ కు కెరీర్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా రవితేజ స్టోరీ సెలెక్షన్ సరిగ్గా లేనందువల్లే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అని సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి ..అమర్ అక్బర్ ఆంటోని సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకొని మాస్ మహారాజ్ రవితేజ కాన్సెప్ట్ కంటెంట్ ఉన్న దర్శకుడిగా పేరు గాంచిన డైరెక్టర్ వీఐ ఆనంద్‌ డైరెక్షన్ లో డిస్కో రాజా సినిమా చేసారు ,సైన్స్‌ఫిక్షన్‌ అండ్‌ రివేంజ్‌ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ గా నిలిచింది ..రవితేజ చేసిన సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవ్వుతున్నడంతో , ఇక రవితేజ కెరీర్ అయిపోయింది అని అనుకుంటున్న టైమ్ లో తనకు గతంలో హిట్స్ డాన్ శ్రీను , బలుపు లాంటి హిట్స్ ఇచ్చిన , డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో క్రాక్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు , ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అవ్వడమే కాకుండా డైరెక్టర్ గోపీచంద్ మలినేని కు మంచి పేరు తీసుకొచ్చింది ..

క్రాక్ సినిమా ఇచ్చిన రిసల్ట్ తో ఫుల్ ఫామ్ మీద ఉన్న రవితేజ , ఆ తరువాత వరుస సినిమాలు లైన్ లో పెట్టి అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు .గతంలో ఏ స్టార్ హీరో అయినా ఒక సినిమా పూర్తి అయిన తరువాతనే ఇంకో సినిమా సెట్స్ మీదకు తీసుకువెళ్ళేవారు , కానీ , మాస్ మాహారాజ్ రవితేజ స్పీడ్ పెంచి ఒక సినిమా సెట్స్ మీద ఉన్నప్పకుడే మరొక సినిమాను లైన్ లో పెడుతున్నాడు ..ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ చేతిలో ఖిలాడీ సినిమా , మరియు శరత్ మాండవ డైరెక్షన్ లో ఒక సినిమా , మరియు త్రినాద్ రావు నక్కిన డైరెక్షన్ లో ఒక సినిమా లైన్ లో ఉన్నాయి ., వీటితో పాటు డైరెక్టర్ సుధీర్ వర్మ చేతిలో ఒక సినిమా ఇలా వరుస సినిమాలను లైన లో పెట్టి తన డైరీ ని నింపేసాడు ..

క్రాక్ సినిమా ఇచ్చిన రిసల్ట్ తో ఫుల్ ఫామ్ మీద ఉన్న రవితేజ , ఆ తరువాత వరుస సినిమాలు లైన్ లో పెట్టి అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు .గతంలో ఏ స్టార్ హీరో అయినా ఒక సినిమా పూర్తి అయిన తరువాతనే ఇంకో సినిమా సెట్స్ మీదకు తీసుకువెళ్ళేవారు , కానీ , మాస్ మాహారాజ్ రవితేజ స్పీడ్ పెంచి ఒక సినిమా సెట్స్ మీద ఉన్నప్పకుడే మరొక సినిమాను లైన్ లో పెడుతున్నాడు ..ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ చేతిలో ఖిలాడీ సినిమా , మరియు శరత్ మాండవ డైరెక్షన్ లో ఒక సినిమా , మరియు త్రినాద్ రావు నక్కిన డైరెక్షన్ లో ఒక సినిమా లైన్ లో ఉన్నాయి ., వీటితో పాటు డైరెక్టర్ సుధీర్ వర్మ చేతిలో ఒక సినిమా ఇలా వరుస సినిమాలను లైన లో పెట్టి తన డైరీ ని నింపేసాడు .. రవితేజ నాలుగు సినిమాలను లైన్ లో పెట్టి , ఒక్కో సినిమా అప్ డేట్ నెమ్మది నెమ్మదిగా ఇస్తూ , తన సినిమాల పట్ల ప్రేక్షకులకు ఎంతో కీరియాసిటీని పెంచుతున్నారు.. రవితేజ లైన్ లో మరో సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది .. దీపావళి పండుగ సందర్భంగా రవితేజ -దొంగాట’ ఫేమ్ వంశీ దర్శకత్వంలో రవితేజ హీరోగా ”టైగర్ నాగేశ్వరరావు” అనే చిత్రాన్ని అనౌన్స్ చేశారు.,, ఈ సినిమాను , తేజ్ నారాయణ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో అభిషేక్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ‘అక్కడ దొంగలు దోపిడీదారులు ఉండేవారు. అదే విధంగా టైగర్ నాగేశ్వరరావు కూడా ఉన్నారు’ అని చిత్ర బృందం ట్వీట్ చేసింది.‘ఫీల్ ది సైలెన్స్ బిఫోర్ ది హంట్’ అంటూ రిలీజ్ చేసిన ”టైగర్ నాగేశ్వరరావు” అనౌన్స్ మెంట్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటోంది…