గోల్డెన్ చాన్సు దక్కించుకున్న సుధీర్ వర్మ …

మాస్ మహా రాజ్ రవితేజ 70 వ సినిమా ను డైరెక్ట్ చేస్తున్న యంగ్ డైరెక్టర్ ….

మాస్ మహారాజ్ రవితేజ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ” క్రాక్” .. ” రాజా ది గ్రేట్ హిట్ సినిమా తరువాత , రవితేజ చేసిన టచ్ చేసి చూడు , నేల టిక్కెట్టు , అమర్ అక్బర్ ఆంటోని ,డిస్కో రాజా , సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద డిసాస్టర్ గా నిలిచాయి .. ఇక మాస్ మహారాజ్ రవితేజ టైమ్ అయిపోయింది అని సోషల్ మీడియా లో చాలా కామెంట్స్ వినిపించాయి .. కొత్త రకమైన స్టోరీస్ సెలెక్ట్ చేయడంలో , ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చేయడంలో రవితేజ ఎప్పుడు ముందుంటారు .. రవితేజ – వి ఐ ఆనంద్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా డిస్కో రాజా.. జనవరి 24 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ గా నిలిచింది .. సైన్స్‌ఫిక్షన్‌ అండ్‌ రివేంజ్‌ డ్రామా బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డిస్కో రాజా సినిమా లో రవితేజ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు , కానీ సినిమా మాత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది ..అమర్ అక్బర్ ఆంటోని సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకొని మాస్ మహారాజ్ రవితేజ కాన్సెప్ట్ కంటెంట్ ఉన్న దర్శకుడిగా పేరు గాంచిన డైరెక్టర్ వీఐ ఆనంద్‌ చెప్పిన కాన్సెప్ట్‌ నచ్చడం, అతడిపై పూర్తి విశ్వాసంతో ‘డిస్కో రాజా’ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు రవితేజ. డిస్కో రాజా సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , మరియు సాంగ్స్ , మేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాక్స్ ఆఫీస్ దగ్గర డైరెక్టర్ వీఐ ఆనంద్‌ చేసిన ఈ సైన్స్‌ఫిక్షన్‌ అండ్‌ రివేంజ్‌ డ్రామా ఫెయిల్ అవ్వడమే కాకుండా రవితేజకు కు ఫిల్మ్ క్రిటిక్స్ నుండి ఎన్నో విమర్శలు అందుకున్నారు ..

‘డిస్కో రాజా’ సినిమా ఇచ్చిన రిసల్ట్ తో రవితేజ కొంత గ్యాప్ తీసుకొని తనకు గతంలో డాన్ శ్రీను , బలుపు , లాంటి హిట్ సినిమాలు ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో హ్యాట్రిక్ గా క్రాక్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ..రవితేజ లాంటి మాస్ హీరోకి ఒక మంచి కథ పడటం అంటే మామూలు విషయము కాదు ,
లవ్, కామెడీ, ఎమోషన్స్, హీరోయిజం, మాస్, యాక్షన్ వీటిలో ఏది తగ్గినా కూడా ఏదో వెలితిగానే ఉంటుంది. డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా విన్నర్ , గోపీచంద్ మలినేని కి ఇండస్ట్రీ లో ఒక మంచి డైరెక్టర్ అని పేరుంది కానీ స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేర్చిన సినిమా క్రాక్ సినిమా అని బలంగా
చెప్పొచ్చు .. మాస్ మహారాజ్ రవితేజ – మరియు డైరెక్టర్ గోపీచంద్ మలినేని ది బెస్ట్ కాంబినేషన్ , వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన డాన్ శ్రీను , బలుపు సినిమాలు పెద్ద విజయం సాధించాయి .. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవ్వడమే కాకుండా మంచి కలెక్షన్స్ కలెక్ట్ చేసింది .. క్రాక్ సినిమా ఇచ్చిన రిసల్ట్ తో ఫుల్ స్పీడ్ ఉన్న మాస్ మాహా రాజ్ వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు ..క్రాక్ సినిమా తరువాత రవితేజ ,డైరెక్టర్ రమేష్ వర్మ డైరెక్షన్ లో ఖిలాడీ అనే సినిమా , మరియు శరత్ మాండవ డైరెక్షన్ లో ఒక సినిమా , మరియు త్రినాద్ రావు నక్కిన డైరెక్షన్ లో ఒక సినిమా లైన్ లో ఉన్నాయి .. మాస్ మహారాజా రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే, తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేశారు .. రవితేజ నటించనున్న 70వ సినిమా గురించి ఒక ఇంట్రస్టున్గ్ న్యూస్ సోషల్ మీడియా లో వినిపిస్తుంది .. ఈ సినిమాను డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు ..ఈ సినిమాను , నవంబర్ 5న టైటిల్- ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు. మరోసారి స్వామిరారా తరహాలోనే ఏదో థ్రిల్లింగ్ సబ్జెక్ట్ నే సుధీర్ వర్మ ఎంపిక చేసుకున్నారని అర్థమవుతోంది. కేశవ- రణరంగం తర్వాత డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ సినిమాని ఛాలెంజింగ్ గా తీసుకుని తెరకెక్కిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ..

ప్రస్తుతము , మాస్ మహారాజ్ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ చిత్రీకరణను పూర్తి చేసి తదుపరి చిత్రాలతో ఆయన బిజీగా ఉన్నారు, ఇప్పటికే మొదటి సింగిల్ విడుదలై మంచి స్పందన అందుకుంది. తదుపరి రెండో సింగిల్ ని రిలీజ్ చెయ్యడానికి తేది ఫిక్సయ్యింది. నవంబర్ 4న దీపావళి కానుకగా ఈ రెండో పాటను రిలీజ్ చేయనున్నామని టీమ్ ప్రకటించింది. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తుంది ఈ చిత్రంతో పాటు రామారావు ఆన్ డ్యూటీ అనే మరో చిత్రాన్ని రవితేజ సెట్స్ పైకి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. శరత్ మండవ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ధమాకా అంటూ మాస్ లోకి దూసుకుపోయే టైటిల్ ని రవితేజ టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ – డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్ లో సినిమా ఏ జానర్ లో ఉంటుంది అని పోస్టర్ రిలీజ్ చేసి చిన్న హింట్ ఇచ్చేసాడు , రవితేజ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్ లో రాబోతున్న 70 వ సినిమా కు సంబంధించి మరిన్ని విషయాలు , కాస్ట్ అండ్ క్రూ గురించి ప్రెస్ మీట్ లో డైరెక్టర్ సుధీర్ వర్మ అధికారికంగా ఎనౌన్స్ చేస్తే ఒక క్లారిటీ వస్తుంది .. —