హైదరాబాదీ కనెక్షన్ఢిల్లీలో నెలోఫర్ కర్రింబోయ్ నిర్మించిన నాటకాన్ని వీక్షించడానికి రౌనక్ యార్ ఖాన్ ఆహ్వానించబడ్డారు.

తెలుగు సూపర్ న్యూస్ ,హైదరాబాద్, అక్టోబర్ 26, 2023:నెలోఫర్ కర్రింబోయ్ నిర్మించిన “ఆనంద – ఐస్ ఆఫ్ ది హీలర్” అనే థియేటర్ ప్రదర్శనకు అసఫ్ జాహీ రాజవంశానికి చెందిన 9వ నిజాం రౌనక్ యార్ ఖాన్ ఆహ్వానించబడ్డారు. నెలోఫర్ కర్రింబోయ్ “షహనాజ్ హుస్సేన్ హెర్బల్స్’ సంస్థకు డైరెక్టర్. ఆమె “హెర్బల్ క్వీన్” షెహనాజ్ హుస్సేన్ కుమార్తె. ఆనంద-ఐస్ ఆఫ్ ది హీలర్ అనే సంగీత నాటకంతో, నెలోఫర్ కర్రింబోయ్ నాటక ప్రపంచంలోకి అడుగుపెట్టారు.

నెలోఫర్ కర్రింబోయ్, రచయిత్రి , మూలికా అందాల సామ్రాజ్ఞి షానాజ్ హుస్సేన్ కుమార్తె. ఆమె భావోద్వేగాలు, సంగీతం,ఆధ్యాత్మికతను మిళితం చేసే కథనాన్ని రాశారు.

“ఆనంద – ఐస్ ఆఫ్ ది హీలర్” అనే కార్యక్రమం సంగీత నాటకం. దీనికి ముజఫర్ అలీ దర్శకత్వం వహించగా, శివాని వర్మ కొరియోగ్రఫీ అందించారు. కబీర్ బేడి కథనం అందించారు. వీరంతా కలిసి కథ చెప్పే కళకు గొప్పదనాన్ని అందిస్తున్నారు

ఈ కార్యక్రమంలో 9వ నిజాం పాల్గొనడం కేవలం పాల్గొనడం కంటే చాలా ఎక్కువ. నెలోఫర్ హైదరాబాదులోని నిజామ్ వంశానికి సంబదించిన వారు. ఆమె ముత్తాత, సర్ అఫ్సర్ ఉల్ ముల్క్ అసఫ్ జాహీ నిజాంల హైదరాబాద్ స్టేట్ ఫోర్సెస్(రక్షణ దళాలు) కమాండర్ & చీఫ్. ఆమె తల్లి అందాల భామ షెహనాజ్ హుస్సేన్ జన్మస్థలం కూడా హైదరాబాద్.

నాటకం అనూహ్యంగా సృజనాత్మకమైనది మరియు ప్రధాని మోడీ కార్యాలయం నుండి కూడా టిక్కట్లకోసం అభ్యర్థనలు వచ్చినట్లు అనూహ్య స్పందన లభినట్లు తెలుపుతున్నారు

“ఆనంద-ది ఐస్ ఆఫ్ ది హీలర్” అనే నాటకం ఈరోజు ఢిల్లీలో ఐకానిక్ గోల్ఫ్ క్లబ్‌లో పార్టీ తర్వాత ప్రముఖుల డిన్నర్‌తో ముగుస్తుంది, ఇది 27వ తేదీన కూడా కొనసాగుతుంది . ఈ నాటకం చిత్రం “ఉమ్రావోజాన్” ప్రముఖ నిర్మాతచే దర్శకత్వం వహించబడింది.

నెలోఫర్ ఈ సందర్బంగా మాట్లాడుతూ , “మన హైదరాబాద్ 1 నుండి 7 వరకు పాలించిన అసఫ్ జాహీ నిజాం వారసులు 9వ చట్టపరమైన హక్కుదారులు తమ రాజకుటుంబానికి అధిపతిగా తమ 9వ నిజాంగా అంగీకరించిన ఘనత రౌనక్ యార్ ఖాన్‌ను కలిగి ఉండటం మాకు గౌరవం అన్నారు

6వ నిజాం కళ సంస్కృతిని ప్రోత్సహించడంలో అగ్రగామిగా ఉన్నాడు నవాబ్ రౌనక్ అతని మనవడు కాబట్టి మా నాటకరంగ సృష్టిని ఆస్వాదించాడు నా తల్లి పుట్టిన హైదరాబాద్‌లో నా పనిని ప్రోత్సహించడానికి ముందుకు వచ్చారు అని అన్నారు “.

ఈ సందర్భంగా రౌనక్ మాట్లాడుతూ.. ”హైదరాబాద్‌లోని నెలోఫర్స్ పనిని కళను ఇష్టపడే హైదరాబాదీలందరికీ ఫేవర్‌గా ప్రోత్సహిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను అన్నారు

రౌనక్ యార్ ఖాన్ ఢిల్లీలో కూడా మంచి ఆధారం కలిగి ఉన్నారు ,ఈ నెల 28న ఢిల్లీలోని మెరిడియన్ హోటల్‌లో మరో కార్యక్రమంలో కూడా పాల్గొననున్నారు . ఆయన,ప్రముఖ గాయని పద్మశ్రీ పెన్జా మసాని, మాధవి అద్వానీచే నిర్వహించబడే దేశవ్యాప్త మేధో వేదికను ఆవిష్కరిస్తారు.

తొమ్మిదవ నిజం తాజ్ ఫలక్‌నుమాలో టర్కీయే ప్రభుత్వం నిర్వహించే టర్కీ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా పాల్గొంటారు.

Leave a Reply