టాలీవుడ్ కి మరో రాక్ స్టార్…

ర్యాప్ రాక్ షకీల్

మంచి బజ్ తో అక్టోబర్ 29 న రిలీజ్ ఐన మిషన్ 2020 కి సంగీతాన్ని అందిచాడు , ఈ సినిమా మంచి బజ్ రావటానికి ముఖ్యమైన కారణాల్లో రాప్ రాక్ షకీల్ మ్యూజిక్, ‘అల్లుడు గారెలు వండలా… అనే సాంగ్ జనాల్లో ఇప్పటికే జనాల్లో నానుతూ ఉంది. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ ‘సముద్ర’ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశాన్ని అందుకున్నాడు…

రాప్ రాక్ షకీల్ రణం 2 సినిమాతో రాగాలు పలికించి , అలా మొదలైన ప్రస్తానం… మిషన్ 2020 నుండి సక్సెస్ ఫుల్ గా సంగీతాన్ని అందించాడు . చిన్న సినిమా ప్రొడ్యూసర్స్ కి వరం లా దొరికాడు . ఇప్పుడు తన పాటలు విపరీతంగా ప్రేక్షకులని అలరించడం తో పెద్ద పెద్ద సినిమా టీమ్స్ రాప్ రాక్ షకీల్ నీ వారి సినిమాలలో మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకోవాలని ఆఫర్స్ కూడా వస్తున్నాయి . త్వరలో ఎవ్వరూ ఊహించని పెద్ద సినిమా తో రాబోతున్నాడు , త్వరలో వీటి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు…

ఇప్పటి వరకు రాప్ రాక్ షకీల్ మ్యూజిక్ అందించిన సినిమాల వివరాలు…

2017 – చిన్ని చిన్ని ఆశలు నాలో రేగేనే
2018 – రా రా (2018 చిత్రం)
2019 – ఆపరేషన్
2019 – మనసంతా నువ్వే
2021 – మిషన్ 2020
TBA – గంధర్వ
TBA – దర్జా

వీటితోపాటు రాప్ రాక్ షకీల్ చేయబోతున్న సినిమాలో యాక్షన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు నిర్మిస్తున్న సినిమా గంధర్వ ( జార్జ్ రెడ్డి హీరో సందీప్ ) , దర్జా ( అనసూయ , సునీల్ ) . వీటితో పాటు రాప్ రాక్ షకీల్ యొక్క పనితీరు తెలుగు లోనే కాదు ఇతర భాషల దర్శక నిర్మాతలకు నచ్చి వారి సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా చేయమని అప్రోచ్ అయినట్లు తెలుస్తుంది.

అతి తక్కువ సమయం లో ఇంతటి స్థాయికి రావడం రాప్ రాక్ షకీల్ యొక్క కృషి , పట్టుదల. వీటన్నిటి మధ్య రాప్ రాక్ షకీల్ తో పని చేసిన దర్శక నిర్మాతలు ఈ విధంగా చెప్పారు ” దేవీశ్రీ ప్రసాద్ , తమన్ , మణిశర్మ తర్వాత ఆ స్థాయి లో మ్యూజిక్ కొట్టగలిగే డైరెక్టర్ రాప్ రాక్ షకీల్ అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. “

అలాగే కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో లో ప్రజల కోసం సోషల్ అవార్నెస్ కోసం కరోనా పై పాడిన పాటతో ఆయన్ని మరింత దగ్గర చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చిపెట్టింది …