రానా సరసన మలయాళీ

రానా సరసన మలయాళీ ముద్దుగుమ్మ ..

వకీల్ సాబ్ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు లైన్ లో పెట్టి అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్‌ ఇచ్చారు . పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తరువాత ఎనౌన్స్ చేసిన సినిమాల మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి . ప్రస్తుతం పవన్ క్రిష్ కాంబినేషన్ లో ‘హరి హర వీర మల్లు’ అలానే డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా , మరియు రానా తో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు .. మలయాళంలో పెద్ద విజయవంతమైన ‘అయ్యప్పానుమ్‌ కోశియుమ్‌’ సినిమాను తెలుగులో తెలుగు లో రీమేక్ చేస్తున్నారు .. ఈ సినిమా కు సంబంధించి ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , టైటిల్ ఎనౌన్సుమెంట్ చేసినప్పటినుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి , పవన్ కళ్యాణ్ మరియు రానా కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద ఇటు ఇండస్ట్రీ లోను ,అభిమానుల్లోనూ ఈ సినిమా మీద వేపరీతమైన అంచనాలు నెలకొన్నాయి .. ‘అయ్యప్పానుమ్‌ కోశియుమ్‌’ రీమేక్ గా భీమ్లా నాయక్‌ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి ఇప్పటికే మొదటి లిరికల్ సాంగ్ రిలీజ్ చేయగా ఈ సాంగ్ హిట్ టాక్ సొంతం చేసుకుంది .. భీమ్లా నాయక్‌ సినిమా నుండి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కు సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ ,ఇప్పటికే పవన్ టీజర్ కు సంబంధించి సోషల్ మీడియా లో పవన్ అభిమానుల నుంచి భారీ లెవెల్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది .. పవన్ కళ్యాణ్ టీజర్ తో పాటు రానా టీజర్ కూడా రిలీజ్ చేసి , అభిమానులకు ఈ సినిమా మీద అంచనాలను పెంచేలా చేసింది చిత్ర యూనిట్ .. టైటిల్‌ పాత్రలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తుండగా , మరో హీరోగా రానా కనిపించనున్నారు, ఈ సినిమాకు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తుడంతో సినిమా మీద భారీ క్రేజ్ ఏర్పడింది ……ఈ సినిమా లో పవన్ కు జోడిగా నిత్యామేనన్‌ నటిస్తున్నది ,మరి రానా సరసన మొదట్లో ఐశ్వర్య రాజేశ్‌ నటిస్తున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి కానీ దీనికి సంబంధించి అధికారంగా ప్రకటన అయితే రాలేదు .. మొత్తానికి ఇప్పుడీ అవకాశం మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మేనన్‌ను వరించినట్లు తెలిసింది. ఇదే నిజమైతే ఆమె తొలి తెలుగు చిత్రం అవుతుంది. ఈ సినిమాలో డేనియల్‌ శేఖర్‌గా రానా ఓ శక్తిమంతమైన పాత్రలో సందడి చేయనున్నారు.