ఇక విరాటపర్వం మూవీ ఓటీటీ లో చుడాలిసిందేనా ???”

బాహుబలి సినిమాతో హీరో రానాకు ప్రేక్షకుల్లో మంచి నటుడిగా గుర్తింపు వచ్చింది .. దగ్గుబాటి హీరో రానా అటు హీరోగా మరో వైపు విలన్ గా నటిస్తూ దూసుకుపోతున్నాడు. అప్పుడప్పుడు సెకండ్ హీరోగా కూడా కనిపించి ఆకట్టుకుంటున్నాడు. లీడర్ సినిమాతో హీరోగా కెరీర్ మొదలు పెట్టిన ఈ యంగ్ హీరో ఇప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హీరోగా రాణిస్తున్న రానా బాలీవుడ్ సినిమాల్లో గెస్ట్ పాత్రల్లో నటిస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాడు .. రెగ్యులర్ సినిమాలకు దూరంగా ఉంటూ , విభిన్నమైన పాత్రలు చేయడంలో హీరో రానా ఎప్పుడు ముందు వరసలో ఉంటారు .. ఇక రానా చేసిన అరణ్య మూవీ లో రానా యాక్టింగ్ కు ఇండస్ట్రీ నుండి బెస్ట్ కాంప్లిమెంట్స్ దక్కాయి ..

.. ఇక ఈ మధ్య పవర్ స్టార్‌తో కలిసి భీమ్లానాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రానా. ఈ సినిమాలో రానా యాక్టింగ్ కు మరోసారి మంచి మార్కులు పడ్డాయి.డ్యానియల్ శేఖర్ గా రానా యాక్టింగ్ కు ధీయేటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది …

వేణు ఉడుగుల – రానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ విరాటపర్వం ఈ మూవీ లో హీరో రానా నక్సలైట్ గా కనిపిస్తున్నాడు .. ఇక ఈ మూవీలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ సినిమా విడుదలకు మాత్రం చాలా సార్లు వాయిదా పాడుతా వచ్చింది .. కరోనా కారణంగా చాలా రోజులు వాయిదా పడిన ఈ మూవీ రిలీజ్ పై ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు చిత్రయూనిట్. అయితే ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేస్తారని గతంలో వార్తలు వచ్చాయి .. దృశ్యం 2 నారప్ప చిత్రాలని ఓటీటీలో విడుదల చేసిన సురేష్ బాబు ఈ మూవీని కూడా ఓటీటీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో విరాటపర్వం రిలీజ్ కు థియేటర్స్ దొరకకపోవచ్చు.. దాంతో కనీసం 4 నెలల సమయమైనా పట్టేలా కనిపిస్తోంది. దాంతో ఈ మూవీ ఓటీటీ లో రిలీజ్ అవ్వడం కాయం అంటున్నారు కొందరు విశ్లేషకులు. రానా నటించిన భీమ్లా నాయక మూవీ ట్రైలర్స్ టీజర్స్ రానా ఇంటెన్స్ యాక్టింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది , అయితే ఈ హిట్ మాత్రం పవన్ కళ్యాణ్ ఎకౌంట్ లోకి వెళ్ళిపోయింది , ఇక రానా నటించిన విరాటపర్వం మూవీ టీజర్స్ రానా ఫస్ట్ లుక్ తో సినిమా మీద అంచనాలు బాగా పెరిగాయి , అయితే ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయితే బాగుటుంది అని కొందరు భావిస్తున్నారు . మొత్తానికి విరాట పర్వం మూవీ ఓటీటీ లో రిలీజ్ అవుతుందా , లేక ధియేటర్స్ లో రిలీజ్ అవుతుందా అనే విషయం పై క్లారిటీ రావాలి అంటే మరి కొద్దీ రోజులు అగలిసిందే…