డబ్ల్యూ డబ్ల్యూ కమర్షియల్ యాడ్ లో రానా …

డబ్ల్యూ డబ్ల్యూ ప్రమోటర్ గా హీరో రానా...

              

దగ్గుబాటి రానా గురించి చెప్పాలి అంటే మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని చెప్పొచ్చు .. సినీ నటుడిగా , నిర్మాతగా , పారిశ్రామిక వేత్త గా బహుభాషా సినిమాల్లో నటించి బాహుబలి సినిమా తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు .. స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు మనవడు అయినప్పటికి , సొంతగా తన కాళ్ళు మీద నిలపడాలి అనే తపన తో రానా సినిమాల్లో విసువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ గా 70 సినిమాలకు పని చేశారు .. దగ్గుబాటి రానా 2010 లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన లీడర్ సినిమా తో టాలీవుడ్ లో హీరో గా పరిచయము అయ్యారు ..లీడర్ సినిమా తరువాత ఒక్కో మెట్టు ఎక్కుతూ తమిళ హిందీ భాషల్లో చాలా సినిమాలు చేసి యూనివెర్సల్ హీరోగా ఎదిగారు ..

ఇండస్ట్రీ లో అందరి హీరోలు ఒక రూట్ అయితే హీరో రానా ది మాత్రం ఒక రూట్ , హీరో గా నే కాకుండా , ప్రతినాయకుడిగా , ప్రొడ్యూసర్ గా , టెలివిజన్ హోస్ట్ గా యాడ్ ప్రమోటర్ గా ఇలా మల్టీ టాలెంటెడ్ యాక్టర్ గా తాను ప్రూవ్ చేసుకున్నాడు… ప్రస్తుతము రానా అరణ్య సినిమా తరువాత , కొన్ని భారీ ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి .. రానా వరుస పెట్టి సినిమాలు చేయడం తో పాటు కొన్ని కంపెనీలతో కొలబ్రేట్ అవుతూ ప్రమోటర్ గా వ్యవహరిస్తూన్నాడు .. రానా తెలుగులో సినిమాలు చేస్తుంటూ , మరో పక్క బాలీవుడ్ , తమిళ్ సినిమాలు లైన్ లో పెడుతుంటారు , అలానే రానా ఎప్పుడు కూడా ఏదో ఒక జాతీయ లేదా అంతర్జాతీయ సంస్థ లేదా ప్రాజెక్ట్ తో సంబంధాలు పెట్టుకుంటూనే ఉంటాడు. ఒక వైపు హీరోగా నటిస్తూ మరో వైపు బ్రాండ్ ప్రమోషన్స్ చేయడంలో రానా ఎప్పుడు ముందు ఉంటాడు ..రానా కొత్తగా సోనీ లీవ్ అనే “ఓటీటీ ని” ప్రమోట్ చేసేందుకు ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఉత్తరాదిన మంచి ఆధరణ దక్కించుకున్న సోనీ లీవ్ ఓటీటీని సౌత్ లో విస్తరించేందుకు గాను పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రముఖ స్టార్స్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను కూడా సోనీ వారు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం హీరో రానా ను ప్రమోటర్ గా వారు ఎంపిక చేసుకున్నారు. రానా సోనీ లీవ్ ప్రమోషన్ కోసం కమర్షియల్ యాడ్ లో హీరో రానా నటించాడు. ఇందులో డబ్ల్యూ డబ్ల్యూ ఈ ఆర్టిస్టుగా రానా కనిపించబోతున్నాడు అని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి . ఇప్పటి వరకు ఏ సౌత్ హీరో కూడా ఇలాంటి ప్రయోగాన్ని చేయలేదు. మొదటి సారి రానా నుండి ఇలాంటి ప్రయోగం రాబోతున్న నేపథ్యంలో ,ఇండస్ట్రీ లో ఉన్నవారంతా ఈ యాడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాకు ప్రాజెక్ట్ కు సంబంధించిన రానా అధికారికంగా త్వరలో ప్రకటించబోతున్నాడు. ప్రస్తుతము రానా సినిమాల విషయానికి వస్తే ఒక వైపు విరాట పర్వం సినిమా విడుదలకు సిద్దం అవుతుండగా , మరో వైపు పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. మరో వైపు బాబాయితో కలిసి ఒక వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తున్నాడు.. మొత్తానికి సినిమాలు.. వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న రానా ఇప్పుడు ఓటీటీ తో పాటు పలు సంస్థలకు ప్రమోటర్ గా వ్యవహరిస్తున్నాడు..
.