దుబాయ్‌లో  కొత్త స్టేషన్ సౌండ్‌ను ఆవిష్కరించడం ద్వారా  ‘వైబ్ ఆఫ్ ది సిటీ’ని మార్చిన రేడియో సిటీ

తెలుగు సూపర్ న్యూస్,12 జూన్ 2023: భారతదేశపు ప్రముఖ రేడియో నెట్‌వర్క్ అయిన రేడియో సిటీ అధికారికంగా Rag Rag Mein Daude City’ ’ #CityLoKothaVibe ఆధునిక వెర్షన్‌ను విడుదల చేసింది . అత్యంత ఉత్సాహపూరితమైన కొత్త ట్రాక్ ప్రేక్షకులను, ముఖ్యంగా  ‘Gen Z’ తరాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దబడింది. ఈ విడుదల కార్యక్రమం దుబాయ్‌లో జూన్ 9 నుండి 11 వరకు రేడియో సిటీ బిజినెస్ టైటాన్స్ ఈవెంట్‌ జరిగిన సమయంలో జరిగింది. 

మారుతున్న  ప్రేక్షకుల నాడిని ఒడిసి పట్టుకోవడానికి ప్రసిద్ధి చెందిన రేడియో సిటీ, తమ  అనుభవాల్లో నవ్యత  కోరుకునే యువ, ఉత్సాహవంతులైన Gen Z ప్రేక్షకులను అలరించడానికి కొత్త స్టేషన్ సంగీతాన్ని రూపొందించింది.  ఇది 39 మార్కెట్‌లలోని ప్రేక్షకులకు  పరిపూర్ణమైన అనుభూతిని కలిగిస్తుంది.

ఈ ఆకర్షణీయమైన జింగిల్‌కి ప్రాణం పోసేందుకు, రేడియో సిటీ ఇద్దరు అసాధారణ గాయకులు, లాలస రాచపూడి ,ఎల్‌వి రేవంత్‌లతో జతకట్టింది. ఈ ద్వయం జింగిల్‌ను డైనమిక్,ఎనర్జిటిక్ టచ్‌తో నింపి, ఆసక్తిగల సంగీత ప్రియులకు మరపురాని సంగీత అనుభూతిని అందిస్తుంది.

రేడియో సిటీ సీఈఓ అషిత్ కుకియాన్ మాట్లాడుతూ, “రేడియో సిటీలో, మేము ఎల్లప్పుడూ అర్థవంతమైన మార్గాల్లో  అందరి  కంటే ముందు ఉండేందుకు ప్రయత్నిస్తాము. ఈ వినూత్నమైన  జింగిల్,  మా ప్రేక్షకుల,   ప్రత్యేకించి ‘Gen Z’ విభాగపు  మారుతున్న ప్రాధాన్యతలతో నిమగ్నమవ్వడానికి మా నిబద్ధతను సూచిస్తుంది.  Rag Rag Mein Daude City #CityLoKothaVibe  కొత్త వెర్షన్ రేడియో సిటీ యొక్క కొత్త స్ఫూర్తిని , మా అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందని మేము విశ్వసిస్తున్నాము..”అని అన్నారు. 

గాయకుడు ఎల్‌వి రేవంత్ మాట్లాడుతూ, “రేడియో సిటీ కొత్త స్టేషన్ సౌండ్ మార్పులో భాగం కావడం ఆనందం గా వుంది . ఈ జింగిల్ శ్రోతలను ఉత్తేజపరుస్తుందని వారికి చిరస్మరణీయమైన సంగీత అనుభవాన్ని అందిస్తుందని నేను నమ్ముతున్నాను” అని అన్నారు. 

ప్రముఖ గాయని లాలస రాచపూడి మాట్లాడుతూ.. ” రేడియో సిటీ సూపర్ సింగర్ సీజన్ 13 విజేతగా, వారి విప్లవాత్మక మార్పులో భాగం కావడం ప్రత్యేకమైనది. ఈ  జింగిల్ Gen Zలో అభిమానుల అభిమానాన్ని పొందుతుందని నేను విశ్వసిస్తున్నాను.” అని అన్నారు. 

Leave a Reply