పుష్ప ని బయపెడుతున్న సునీల్…

పుష్ప లో సునీల్ లుక్ రచ్చ చేశాడు…

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా అల వైకుంఠపురములో .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది .అల వైకుంఠపురములో సినిమా తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొంత గ్యాప్ తీసుకొని డైరెక్టర్ సుకుమార్ తో హ్యాట్రిక్ గా పుష్ప సినిమా ఎనౌన్సుమెంట్ చేశారు .. సుకుమార్ – అల్లు అర్జున్ ది హిట్ కాంబినేషన్ , వీరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య , ఆర్య 2 సినిమాలు బిగ్గెస్ట్ హిట్స్ అయ్యాయి . సుకుమార్ – అల్లు అర్జున్ – దేవిశ్రీ ప్రసాద్ ముగ్గురికి హ్యాట్రిక్ సినిమా , అలానే ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు .. అల్లు అర్జున్ ఈ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మరో మెట్టు ఎక్కడానికి బాగా కష్టపడుతున్నారు . పుష్ప సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ , టీజర్ , మరియు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ . సుకుమార్ పుష్ప సినిమా మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు .ఈ సినిమాకు సంబంధించి ఒక్కో సర్‌ప్రైజ్‌ న్యూస్ వదులుతూ అల్లు అర్జున్ అభిమానులను సంతోషపెడుతున్నారు చిత్ర యూనిట్ .. ఇప్పటికే రిలీజ్ అయిన , మూడు లిరికల్ సాంగ్స్ కు అభిమానుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది .. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ కీలక పాత్రను పోషిస్తున్నారు , దీనికి సంబంధించి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు .. పుష్ప సినిమా కు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియా లో వినిపిస్తోంది .. ఈ సినిమాలో సునీల్ ఒక ముఖ్యమైన రోల్ లో నటిస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపించాయి .. సునీల్ కమీడియన్ నుండి హీరో మారి హిట్స్ అందుకొని మల్లి టైమ్ బాగోక , మల్లి క్యారెక్టర్ రోల్స్ మరియు సపోర్టింగ్ రోల్స్ , మరియు విలన్ రోల్స్ చేస్తూ సునీల్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు .. డిస్కో రాజా , కలర్ ఫోటో , లో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసి సునీల్ , విలన్ క్యారెక్టర్ ఇచ్చిన కాన్ఫిడెంట్ గా చేయగలడు అని పేరు సంపాదించుకున్నాడు .. ప్రస్తుతము సునీల్ చేతిలో వరుస సినిమాలు లైన్ లో ఉన్నాయి , సుకుమార్ మొదటి సినిమా ఆర్య లో సునీల్ నటించాడు , మల్లి చాలా కాలం తరువాత సునీల్ పుష్ప సినిమా లో నటిస్తున్నారు , సునీల్ కు ఏ క్యారెక్టర్ ఇచ్చిన ప్రాణం పెట్టి పని చేస్తాడు , అలానే సుకుమార్ ఆర్టిస్ట్ ల దగ్గర నుండి పెర్ఫార్మన్సెస్ బాగా రాబట్టగలడు , మరి సునీల్ లో సుకుమార్ ఎం చూశాడో తెలియదు గాని , పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న పుష్ప సినిమాలో సునీల్ కు బంపర్ ఆఫర్ దక్కింది అనుకోవాలి .. పుష్ప సినిమా లో సునీల్ మంగళం శ్రీను అనే పాత్రలో నటిస్తున్నారు , ఈ పాత్ర కు సంబంధించి సునీల్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ .. ఈ పోస్టర్ లో సునిల్ లుక్స్ అదిరిపోయాయి , సునీల్ లుక్స్ బాగున్నాయి అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి .. అరవింద సమేత వీర రాఘవ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయి సునీల్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు ..సునీల్ ఎంతో కాలంగా వేచి చూస్తున్న బ్రేక్ పుష్ప చిత్రంతో అందుకోవడం ఖాయంగానే అనిపిస్తుంది …