“పుష్ప” రిలీజ్ డేట్ ఫిక్స్

“పుష్ప” రిలీజ్ డేట్ ఫిక్స్ …

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా “అల వైకుంఠపురములో” , ఈ సినిమా వీరిద్దరి హ్యాట్రిక్ కాంబినేషన్ , ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది . “అల వైకుంఠపురములో సినిమా తరువాత అల్లుఅర్జున్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ కలయిక లో ఐకాన్ సినిమా చేస్తున్నాడు , అలానే డైరెక్టర్ బోయపాటి శ్రీను , ఏ ఆర్ మురగదాస్ , కాంబినేషన్ లో సినిమాలు రెడీ గా ఉన్నాయి అని సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి .. నిజానికి “అల వైకుంఠపురములో” సినిమా తరువాత బన్నీ చాలా కధలు విన్నాడు , ఫైనల్ గా డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబో లో దిల్ రాజు ఐకాన్ సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ లో గట్టిగానే వార్తలు వినిపించాయి .. మొత్తానికి ఐకాన్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా బన్నీ తో ఉంటుందా లేక వేరే హీరోతో ఉంటుందా అనే విషయం పై సోషల్ మీడియా లో బాగా వార్తలు వినిపించాయి . బన్నీ ఐకాన్ సినిమాను పక్కన పెట్టి ఫైనల్ గా డైరెక్టర్ సుకుమార్ కి ఛాన్స్ ఇచ్చాడు , అలా పుష్ప సినిమా మొదలైయింది .. సుకుమార్ “రంగస్థలం ” సినిమా తరువాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని , మహేష్ బాబు కోసం స్టోరీ రెడీ చేసాడు , ఆ స్టోరీని మహేష్ కి వినిపించగా , చిన్న క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం వల్ల ఈ సినిమా ఆగిపోయింది , చివరికి సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తో సినిమా ఎనౌన్స్ చేయడం జరిగింది .. సుకుమార్ అల్లు అర్జున్ మొదటి సినిమా ఆర్య , రెండొవ సినిమా ఆర్య 2 , ముచ్చటగా మూడవ సినిమా ఎనౌన్సమెంట్ చేయడంతో ఈ సినిమా మీద అల్లు అర్జున్ అభిమానులకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి .. పుష్ప సినిమా టీజర్ , మరియు పోస్టర్ , రిలీజ్ చేసిన్నప్పటి నుండి అభిమానుల్లో ఈ సినిమా మీది భారీ అంచనాలు ఉన్నాయి , బన్నీ మరియు అల్లు అర్హున్ హ్యాట్రిక్ కాంబినేషన కాబట్టి సుకుమార్ ఈ సినిమా మేకింగ్ , విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావడంలేదు .. సుకుమార్ బన్నీ , మరియు దేవిశ్రీప్రసాద వీరి ముగ్గురు కాంబినేషన గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు ,వీరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య , ఆర్య 2 సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో , ఇప్పుడు వస్తున్న పుష్ప సినిమా కూడా పెద్ద సక్సెస్ అవుతుంది అని చిత్ర యూనిట్ గట్టి నమ్మకం తో ఉంది . ఇక అసలు విషయానికొస్తే , ఐకాన్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. స్టైలిష్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ‘పుష్ప’ రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 17న ‘పుష్ప’ ఫస్ట్‌ పార్ట్‌ను ‘పుష్ప ది రైజ్‌’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు చిత్ర యూనిట్ .. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రాబోతున్నది ,ఈ ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్‌ పాత్ర పోషిస్తున్నారు , బన్నీ ఈ సినిమా లో ఊరమాస్‌ గెటప్‌లో కనిపించనున్నారు. అల్లు అర్జున్ కి జోడీగా రష్మిక నటిస్తున్నది .. ఈ సినిమాను మైత్రిమూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది ..