అల్లు అర్జున్ కోసం రంగంలోకి దిగిన సమంత…

పుష్ప సినిమా కోసం ఐటమ్ సమంత సాంగ్...

అల్లు అర్జున – డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప .. ఆల వైకుంఠపురములో సినిమా తో బిగెస్ట్ హిట్ అందుకున్నా హీరో అల్లు అర్జున్ కొంత గ్యాప్ తీసుకొని డైరెక్టర్ సుకుమార్ తో పుష్ప అనే పాన్ ఇండియా సినిమా ఎనౌన్సుమెంట్ చేశారు ..సుకుమార్ – అల్లు అర్జున్ ది హిట్ కాంబినేషన్ , గతంలో కూడా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య , ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి ..పుష్ప సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ మరియు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేయగా వీటి పై అల్లు అర్జున అభిమానుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది . .. ఈ సినిమాలో అల్లు అర్జున సరసన ఫస్ట్ టైమ్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతుంది ,, డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను రెండు పార్ట్శ్ గా తెరకెక్కిస్తున్నారు .. పుష్ప సినిమాకు సంబంధించి రోజు ఎదో ఒక న్యూస్ సోషల్ మీడియా లో వస్తూనే ఉంది .. ..పుష్ప సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు , తాజాగా ఈ ట్రైలర్ రిలీజ్ డేట్ ఎనౌన్సుమెంట్ చేస్తూ ఒక చిన్న పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ ..ఈ పోస్టర్ లో డిసెంబర్ 6 న ట్రైలర్ రిలీజ్ అవుతుంది అని మేకర్స్ ఎనౌన్సమెంట్ చేశారు .. .ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియా లో వినిపిస్తుంది .ఈ సినిమా లో డైరెక్టర్ సుకుమార్ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేశారు . సుకుమార్ సినిమాలో ఐటమ్ సాంగ్ కంపల్సరీ గా ఉండాలిసిందే , సుకుమార్ మొదటి సినిమా నుండి చివరి సినిమా రంగస్థలం సినిమా వరకు తన ప్రతి సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ పక్కాగా ఉంటుంది ..పుష్ప సినిమా విషయంలో నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడ రాజీ పడకుండా నిర్మిస్తున్నారు , ఈ సినిమా లో ఐటమ్ సాంగ్ కోసం డైరెక్టర్ సుకుమార్ సమంత ను రంగంలోకి దింపారు ..

ప్రస్తుతం అల్లు అర్జున్, సమంతల మధ్య వచ్చే ఐటమ్ నంబర్ ను రామోజీ ఫిల్మ్ సిటీలోని భారీ సెట్‌లో షూట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి సమంత అద్భుతమైన పోస్టర్‌ను షేర్ చేసింది .. ఈ పాట ఈ సంవత్సరం అద్భుతమైన సాంగ్ గా ఉంటుంది అని డైరెక్టర్ సుకుమార్ పూర్తి నమ్మకంగా ఉన్నారు …సమంత షేర్ చేసిన పిక్ లో సామ్ మొహం చూపకపోయినా, రంగురంగుల కాస్ట్యూమ్స్‌లో మెరిసిపోతున్న సామ్ తో పాటు ఈ పాట ఎలా ఉండబోతుందో ఓ ఐడియా ఇచ్చింది. ఈ సాంగ్ కు ప్రముఖ హిందీ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందిస్తున్నారు .పుష్ప సినిమాకు సంబంధించి సమంత షేర్ చేసిన పిక్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయింది .. పుష్ప సినిమా లోని ఈ ఐటమ్ సాంగ్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు , మరి డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ – సమంత లతో ఐటమ్ సాంగ్ ను ఏ రేంజ్ లో చూపిస్తారో తెలియాలంటే మరి కొద్దీ రోజులు ఆగలిసిందే ..