ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా లేటెస్ట్ న్యూస్ ……

మిర్చి లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా తరువాత ప్రభాస్ రాజమౌలి కాంబినేషన్ లో బాహుబలి సినిమా చేసాడు . ఈ సినిమా రెండు పార్ట్స్ తో విడుదల అయి ప్రభాస్ కు మంచి పేరు తీసుకొచ్చింది .. ప్రభాస్ బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు .. బాహుబలి సినిమా విజయంతో , ప్రభాస్ తను చేయపోయే తదుపరి సినిమాలు కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేద్దాము అని డిసైడ్ అయ్యాడు , ఈ క్రమంలో బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో “సాహో” సినిమా చేసాడు , సుమారు 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు , హిందీ తమిళ్ భాషల్లో రిలీజ్ అయి మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది .. “సాహో” సినిమా తరువాత ప్రభాస్ చేస్తున్నవి అన్ని పాన్ ఇండియా సినిమా సబ్జెక్ట్స్ మీదనే ప్రభాస్ ఎక్కవగా ఫోకస్ పెట్టాడు .. ప్రభాస్ సాహో” సినిమా తరువాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ , మరియు రాధా కృష్ణ డైరెక్షన్ లో చేస్తున్న రాధే శ్యామ్ , మరియు ఓం రావత్ దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్ , కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న “సాలార్” సినిమాలు లైన్ లో ఉన్నాయి .. ‘సాహో’ సినిమా తరువాత ప్రభాస్ నుంచి ఇంతవరకూ మరో సినిమా రాలేదు. అందువలన ‘రాధేశ్యామ్’ కోసం అంతా ప్రభాస్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు .. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు మరియు టి సిరీస్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ..జిల్ సినిమా తరువాత డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు .. ఈ సినిమా లో ప్రభాస్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తున్నది , ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ , టీజర్ రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద ఆ భారీ అంచనాలు క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ ..

ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది , ఈ సినిమా ఇటలీ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ . పునర్జన్మలతో ముడిపడి ఈ ప్రేమకథ ఉండబోతుంది అని మరియు ప్రభాస్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు అని సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి .. ఈ సినిమాకు , జస్టిన్ ప్రభాకరన్ బాణీలను అందించాడు. పాటల కోసమే కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది .. ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులగా ఎటువంటి న్యూస్ తెలియకపోవడంతో ప్రభాస్ అభిమానులు బాధపడుతున్నారు . తాజాగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ న్యూస్ బయటకు రావడంతో అభిమానులు సంతోషపడుతున్నారు .. . ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేస్తూ ప్రభాస్ అభిమానులకు విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు చిత్ర యూనిట్ .. సాహో” సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి , సాహో సినిమా కొంత వరకు నిరాశపరిచిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం డిస్సపాయింట్మెంట్ చేయకుండా డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ ఈ సినిమా మేకింగ్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు .. మొత్తానికి ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమా గురించి తెలిసిన లేటెస్ట్ న్యూస్ ప్రభాస్ అభిమానులకి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది …..

Leave a Reply