బిగ్ బి తో స్క్రీన్ షేర్ చేసుకున్న పూజ హెగ్డే …

లెజెండరి నటుడు అమితాబ్ స్క్రీన్ షేర్ చేసుకున్న పూజ హెగ్డే …

మన టాలీవుడ్ లో బాగా డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో పూజా హెగ్డే ఒకరు .. అక్కినేని నాగ చైతన్య – విజయ్ కుమార్ కొండా డైరెక్షన్ లో వచ్చిన ఒక లైలా కోసం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయము అయింది ఈ మహారాష్ట్ర ముద్దుగుమ్మ ..మొదటి సినిమా లో తన అందం , అభినయం నటనతో ప్రేక్షకులను బాగా అక్కటుకొని ప్రేక్షకుల హృదయంలో మంచి స్థానం సంపాదించుకుంది .. ఒక లైలా కోసం సినిమా తరువాత ఈ ముద్దుగుమ్మ కు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి ..ముకుంద , దువ్వాడ జగన్నాధం , అరవింద సమేత వీర రాఘవ ,మహర్షి , అల వైకుంఠపురములో , వాల్మీకి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ గా ఎదిగిపోయింది .. బొమ్మరిల్లు భాస్కర్ – అఖిల్ డైరెక్షన్ లో వచ్చిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో పూజ హెగ్డే అఖిల్ సరసన నటించి మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ..ప్రస్తుతం హీరోయిన్ పూజ హెగ్డే చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి , వాటిలో పాన్ ఇండియా సినిమా గా రాబోతున్న రాధే శ్యామ్ సినిమా లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన పూజ నటిస్తుంది , అలానే ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సరసన ఒక స్పెషల్ రోల్ లో నటిస్తున్నది .. ఇటీవలే ఆచార్య, రాధేశ్యామ్ సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేసిన పూజ కొద్ది రోజులు మాల్దీవుల టూర్‌ను ఎంజాయ్‌ చేసి వచ్చింది. ఈ నేపథ్యంలో ఓ షూటింగ్‌ పాల్గొన్న ఆమె సెట్స్‌ ఫొటోలను షేర్‌ చేసింది. అయితే ఇందులో ఓ లెజెండరి నటుడు అమితాబ్ ఉండటం విశేషం. నటిగా ఏ హీరోయిన్ కి అయినా కొన్ని డ్రీమ్ రోల్స్ ఉంటాయి , అలానే పలానా యాక్టర్స్ తో పని చెయ్యాలి అని ఉంటుంది ..అలానే హీరోయిన్ పూజా కు కూడా బాలీవుడ్ ‘లెజెండ్ అమితాబ్ గారితో కలిసి వర్క్ చేయాలి, కోరిక ఉంది ఆ కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది. వీరిద్దరి కలిసి ఉన్న పిక్ సోషల్ మీడియా లో షేర్ చేసింది .ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది ..