ర‌క్త‌హీన‌త‌పై అవగాహన కల్పించేందుకు 21న‌గ‌రాల్లో పీఅండ్‌జీ హెల్త్ ‘నా నా ఎనీమియా బ‌స్సు యాత్ర 2.0’..

తెలుగు సూపర్ న్యూస్,జూలై 13,2023: గ‌త సంవ‌త్స‌రం భార‌త‌దేశంలోని ఉత్త‌రాది ప్రాంతంలో ‘నా నా ఎనీమియా బ‌స్సు యాత్ర’ను విజ‌య‌వంతంగా చేప‌ట్టిన పీఅండ్‌జీ హెల్త్, ఫాగ్సి (FOGSI) (ద ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్ అండ్ గైన‌క‌లాజిక‌ల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా) స‌హ‌కారంతో ‘నా నా ఎనీమియా బ‌స్సు యాత్ర 2.0’ ను ప్రారంభించింది.

భార‌త‌దేశంలోని ద‌క్షిణాది ప్రాంతాల‌కు ఈ కార్య‌క్ర‌మాన్ని విస్త‌రించే ఉద్దేశంతో ‘నా నా ఎనీమియా బ‌స్సు యాత్ర 2.0’ ఐర‌న్ డెఫిషియెన్సీ ఎనీమియా (ఐడీఏ)పై అవ‌గాహ‌న పెంచుతుంది.

విశాఖ‌ప‌ట్నంలో ప్రాక్ట‌ర్ అండ్ గాంబుల్ హెల్త్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ మిళింద్ థాటే, ఫాగ్సి (FOGSI) ప్రెసిడెంట్ డాక్ట‌ర్ హృషికేశ్ పాయ్ క‌లిసి ప్రారంభించిన ఈ యాత్ర ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, కేర‌ళ మీదుగా సాగి బెంగ‌ళూరులో ముగుస్తుంది.

ఈ సంద‌ర్భంగా ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హెల్త్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మిలింద్ థాటే మాట్లాడుతూ, ‘‘ఈ ఏడాది ‘నా నా ఎనీమియా బ‌స్సు యాత్ర 2.0’ను ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఇందులో ర‌క్త‌పోటు ప‌రీక్ష‌ల‌తో పాటు, 2000 మందికి పైగా వ్యక్తులకు ఉచితంగా గైనకాలజిస్ట్ / ఫిజీషియన్ ద్వారా స్క్రీనింగ్ పరీక్షను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

భారతదేశంలో ఐర‌న్ లోపంపై అవగాహన పెంచడానికి, దీనిపై పూర్తి విజ్ఞానం అందించేందుకు పి అండ్ జి హెల్త్ అంకితమైంది. గత సంవత్సరం ఉత్తర భార‌త నగరాలలో నా నా ఎనీమియా బస్సు యాత్ర ద్వారా గణనీయమైన సంఖ్యలో ప్రజలు ఈ అవగాహన కార్యక్రమాన్ని ఉప‌యోగించుకున్నారు.

ఇప్పుడు భారతదేశంలోని దక్షిణ ప్రాంతాలకు కూడా విస్తరించడానికి, ఐడీఏ ప్రారంభ లక్షణాలను గుర్తించడానికి, వాటిని అధిగమించడానికి చర్యలు తీసుకోవడానికి ప్రజలను శక్తివంతం చేయడానికి ఆ విజ‌యం మమ్మల్ని ప్రోత్సహించింది’’ అని తెలిపారు.

ఐర‌న్‌ లోపం పిల్లలు, గర్భిణులు లేదా రుతుస్రావం ఉన్న మహిళలు సహా అన్ని వయస్సుల వారిని ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా ముందు చెప్పిన‌వారికి ఈ ప్రమాదం ఎక్కువ‌. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్‌హెచ్ఎస్ -5) డేటా ప్రకారం, భారతదేశంలో ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరు రక్తహీనతతో బాధపడుతున్నారు.

గర్భవతి కాని మహిళల్లో 57%, గర్భిణీ స్త్రీలలో 52% ఈ స‌మ‌స్య ఉంది. ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు అలసట, మైకం, పాలిపోవడం, జుట్టు రాలడం వంటి ఐర‌న్‌ లోపం లక్షణాలతో బాధపడుతున్నారు. కానీ ఈ లక్షణాలను తరచుగా విస్మరిస్తారు, ఈ లక్షణాలను ముందుగానే గుర్తించడం, సకాలంలో రోగ నిర్ధారణ చేయించుకోవ‌డం చాలా అవసరం.

ఫాగ్సి (FOGSI) అధ్య‌క్షుడు డాక్టర్ హృషికేశ్‌ పాయ్ మాట్లాడుతూ, “నా నా అనీమియా బ‌స్సు యాత్ర విజయవంతం కావడంతో, దక్షిణాది నగరాల్లో పి అండ్ జి హెల్త్ వారితో మా సహకారాన్ని కొనసాగించడానికి, ఐర‌న్ లోపం వ‌ల్ల వ‌చ్చే రక్తహీనత, దాని సంబంధిత సమస్యల గురించి అవగాహన కల్పించడానికి మా సహకారాన్ని కొనసాగిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాము.

భారతదేశంలో పోషకాహార లోపాలు ఎక్కువ‌. ఐర‌న్‌ లోపం, రక్తహీనత కేసులు కూడా ఇక్క‌డ అత్యధికం. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడంలో మరియు అట్టడుగు స్థాయికి చేరుకోవడంలో బస్సు యాత్ర కీలక పాత్ర పోషిస్తుందని మేము ఆశిస్తున్నాము.

నిరంతర ప్రయత్నంలో భాగంగా, ఐర‌న్‌ లోపం వ‌ల్ల వ‌చ్చే రక్తహీనతపై అవగాహన పెంచడానికి, ఈ విష‌యంలో సహాయపడటానికి పి అండ్ జి హెల్త్ రోగులు, వినియోగదారులు, వైద్య నిపుణుల‌తో నిరంతరం నిమగ్నమవుతోంది. గత సంవత్సరం, పి అండ్ జి హెల్త్ ప్రసిద్ధ నిపుణులతో కలిసి ఒక ఎక్స్‌ ప‌ర్ట్ కాన్సెన్స‌స్ ప‌బ్లికేష‌న్‌ను ర‌చించింది.

ఇది భారతదేశంలోని పెరి-మెనోపాజ్ మహిళల ఆరోగ్యంపై ఐర‌న్‌ లోపం ప్రభావాన్ని వెలుగులోకి తెచ్చింది. డయాగ్నోస్టిక్ వ‌ర్క్‌షాపులు, నిరంతర వైద్య విద్య, కేసు-ఆధారిత చర్చలతో సహా వైద్య విద్యార్థుల‌ కోసం సైంటిఫిక్ లెర్నింగ్‌, నాలెడ్జి ఫోరంల‌కు కూడా పి అండ్ జి హెల్త్ దోహదం చేస్తోంది.

Leave a Reply