పవన్ – క్రిష్ మూవీ లేటెస్ట్ అప్ డేట్ ..

వకీల్ సాబ్ సినిమా తరువాత పవన కళ్యాణ్ వరుసగా సినిమాలు లైన్ లో పేట్టాడు , ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్ లో హరి హర వీరమల్లు సినిమా ఒకటి , హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా , మూడవ ది సాగర్ కె చంద్ర కాంబినేషన్ లో వస్తున్న ” భీమ్లా నాయక్’ , . పవన్ క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా నుండి మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ , ఈ మోషన్ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ లుక్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు .. క్రిష్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మీద ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి , ఈ అంచనాలను ఎక్కడ తగ్గకుండా క్రిష్ సినిమా టేకింగ్ మరియు మేకింగ్ విషయంలోను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు .. క్రిష్ హరి హర వీరమల్లు సినిమాను కొంత భాగం షూటింగ్ అయిన తరువాత అనుకోకుండా మహమ్మారి కరోనా రావడం వల్లన సినిమా షూటింగ్ కొంత బ్రేక్ పడింది .. మహమ్మారి కరోనా సమయంలో చాలా పెద్ద సినిమాలు ,చిన్న సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి .. క్రిష్ పవన్ తో చేస్తున్న హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ బ్రేక్ రావడంతో , క్రిష్ ఈ లోపు వైష్ణవ్ తేజ్ తో సినిమా చేద్దాము అని డిసైడ్ అయ్యాడు ,అలా కొండపొలం సినిమా మొదలైయింది .. ఇక అసలు విషయం లోకి వెళ్ళితే ,వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన కొండపొలం సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. కరోనా టైమ్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంబించి అతి తక్కువ సమయంలో నే సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసింది చిత్ర యూనిట్ .. కొండపొలం సినిమా గురించి లాస్ట్ ఇయర్ ఈ సినిమా ను కంప్లీట్ చేశారు అని సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి . అయితే కొన్ని కారణాలు వల్ల ఈ సినిమాను విడుదల చేయలేదు . ఈ సినిమాను ఓటీటీ లో కూడా రిలీజ్ చేస్తున్నారు అని సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి .. ఫైనల్ గా డైరెక్టర్ క్రిష్ థియేటర్ రిలీజ్ కు మొగ్గు చూపడంతో ఈనెల 8న దసరా కానుకగా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు గాను సిద్దం అయ్యింది. కొండపొలం ప్రారంభించకుండానే పవన్ తో హరి హర వీరమల్లు సినిమాకు కమిట్ చేయించిన క్రిష్ గ్యాప్ ఉండటంతో ఈ సినిమాను పట్టాలెక్కించి రెండు నెలల్లోనే పూర్తి చేశాడు. క్రిష్ కొండపొలం సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో భాగంగా హరి హర వీరమల్లు సినిమా కు సంబంధించిన కీలక అప్డేట్ ను ఇచ్చి ఫ్యాన్స్ కు తీపి కబురు అందించాడు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో క్రిష్ మాట్లాడుతూ.. హరి హర వీరమల్లు సినిమా చిత్రీకరణ ప్రారంభించి ఇప్పటికే కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మార్చి వరకు సినిమా కు సంబంధించిన కీలక సన్నివేశాలను ముగించాం. ఇప్పటికే షూటింగ్ ను 50 శాతం వరకు ముగించినట్లుగా దర్శకుడు క్రిష్ ప్రకటించాడు. జనవరి వరకు సినిమా షూటింగ్ ను ముగిస్తామని క్రిష్ చెప్పాడు. ఈ సినిమా కు సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుందని క్రిష్ తెలిపారు .