భీమ్లా నాయక్ సినిమా నుండి మరో ఇంట్రస్టింగ్ న్యూస్…

దీపావళి రోజున భీమ్లా నాయక్ గ్లిమ్ప్స్ రిలీజ్... 

వకీల్ సాబ్ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు లైన్ లో పెట్టి అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్‌ ఇచ్చారు . పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తరువాత ఎనౌన్స్ చేసిన సినిమాల మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి . ప్రస్తుతం పవన్ క్రిష్ కాంబినేషన్ లో ‘హరి హర వీర మల్లు’ అలానే డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా , మరియు రానా తో ” భీమ్లా నాయక్” మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు .. ” భీమ్లా నాయక్” సినిమా టీజర్స్ , మరియు మోషన్ పోస్టర్స్ , మరియు రెండు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. పవన్ కళ్యాణ్ హీరోగా రానా కీలక పాత్రలో నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపించాయి . మలయాళం లో సూపర్ హిట్ అయిన , అయ్యప్పనుమ్ కోషియుమ్ కు సినిమాకు ఇది రీమేక్ అవుతున్నది .. ఈ సినిమాలో మల్టీ స్టారర్ గా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి .. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రానా టీజర్ , మరియు పవన్ టీజర్ రిలీజ్ చేయగా , ప్రేక్షకుల్లో వీరిద్దరి టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది ..పవన్ కళ్యాణ్ కు జోడీగా నిత్యా మీనన్ నటించడం , మరియు రానా సరసన మొదట్లో ఐశ్వర్య రాజేశ్‌ నటిస్తున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి కానీ దీనికి సంబంధించి అధికారంగా ప్రకటన అయితే రాలేదు .. మొత్తానికి ఇప్పుడీ , అవకాశం మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మేనన్‌ను వరించినట్లు తెలుస్తుంది ..ఈ సినిమా లో టైటిల్‌ పాత్రలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తుండగా , మరో హీరోగా రానా కనిపించనున్నారు, ఈ సినిమాకు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తుడంతో సినిమా మీద భారీ క్రేజ్ ఏర్పడింది … తాజాగా ఈ సినిమాకు సంబంధించి .. ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను రేపు ఉదయం 11 గంటలకు ఇవ్వబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి ..
ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది .. ఈ సినిమాకు సంబంధించి , రేపు అప్ డేట్ ఏమైనా చెప్తారేమో అంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరో వైపు సంక్రాంతికి ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో భీమ్లా నాయక్ సినిమాను వాయిదా వేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. . దీపావళికి అది ఏమైనా ఇస్తారా అంటే కావచ్చు అనే సమాధానం కూడా వినిపిస్తుంది. మొత్తానికి భీమ్లా నాయక్ రేపు ఉదయం 11 గంటల కు అప్ డేట్ సినిమా ఏమి చెప్పబోతున్నారు అంటూ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు …