పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ అప్ డేట్

మిర్చి లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా తరువాత ప్రభాస్ రాజమౌలి కాంబినేషన్ లో బాహుబలి సినిమా చేసాడు . ఈ సినిమా రెండు పార్ట్స్ తో విడుదల అయి ప్రభాస్ కు మంచి పేరు తీసుకొచ్చింది .. ప్రభాస్ బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు .. బాహుబలి సినిమా విజయంతో , ప్రభాస్ తను చేయపోయే తడిపరి సినిమాలు కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేద్దాము అని డిసైడ్ అయ్యాడు , ఈ క్రమంలో బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో “సాహో” సినిమా చేసాడు , సుమారు 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు , హిందీ తమిళ్ భాషల్లో రిలీజ్ అయి మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది .. “సాహో” సినిమా తరువాత ప్రభాస్ చేస్తున్నవి అన్ని పాన్ ఇండియా సినిమా సబ్జెక్ట్స్ మీదనే ప్రభాస్ ఎక్కవగా ఫోకస్ పెట్టాడు .. ప్రభాస్ సాహో” సినిమా తరువాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ , మరియు రాధా కృష్ణ డైరెక్షన్ లో చేస్తున్న రాధే శ్యామ్ , మరియు ఓం రావత్ దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్ , కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న “సాలార్” సినిమాలు లైన్ లో ఉన్నాయి . ప్రస్తుతం నాలుగు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్న ప్రభాస్.. తాజాగా తన కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీ గురించి సోషల్ మీడియా లో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి .. అసలు విషయానికి వెళ్ళితే ప్రభాస్ తన సిల్వర్ జూబ్లీ మూవీని ప్రకటించిన నేపథ్యంలో సోమవారం సోషల్ మీడియా అంతా ఈ విషయం మీద పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి .. . ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కు భారీ లెవెల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది , ప్రభాస్ చేస్తున్న సినిమాలు గురించి రోజు సోషల్ మీడియా లో ఎదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది .. ఈ క్రమంలో ప్రభాస్ అభిమానులు ‘#Prabhas25’ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్స్ పెడుతూ ట్విట్టర్ లో ట్వీట్స్ చేస్తున్నారు .. #Prabhas25 చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ 2021 అక్టోబర్ 7న రాబోతోందని ముందస్తు ప్రకటన బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ దర్శకుడు – నిర్మాతలు వంటి విషయాలు చాలా గోప్యంగా ఉంచబడింది .అయితే ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం ప్రభాస్ గత చిత్రాల కంటే ఈ సినిమా కథ పూర్తిగా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు అని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి .. ఈ ప్రాజెక్ట్ కోసం డార్లింగ్ మొదటిసారిగా కల్ట్ స్టేటస్ ఉన్న బ్లాక్ బస్టర్ మావెరిక్ డైరెక్టర్ తో కలిసి వర్క్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. దీని పై సోషల్ మీడియా లో వస్తున్నా వార్తల్లో ఎంత వరకు నిజం ఉందొ తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చేంతవరకు వెయిట్ చెయ్యాలిసిందే …

Leave a Reply