టెలిఫొటో కెమెరాతో పొట్రెయిట్‌ ఫొటోగ్రఫీకి కొత్త నిర్వచనం చెప్తున్న OPPO Reno10 5G

తెలుగు సూపర్ న్యూస్ ,హైదరాబాద్, 31 జూలై, 2023: ప్రముఖ గ్లోబల్ స్మార్ట్ పరికరాల బ్రాండ్ OPPO, దాని Reno10 సేల్ జూలై 27న INR 32,999కి ప్రత్యక్ష ప్రసారం చేయబడిందని ప్రకటించింది.. OPPO ఈ-స్టోర్స్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఇతర మెయిన్‌లైన్‌ రిటెయిల్‌ ఔట్‌లెట్స్‌లో అర్థరాత్రి 12 గంటల నుంచి ఈ హ్యాండ్‌సెట్‌ అందుబాటులో ఉంటుంది.

ఆల్ట్రా-స్లిమ్‌ 3D కర్వ్డ్‌ డిజైన్‌ అల్ట్రా-స్లిమ్ బాడీ కలిగిన Reno10 5G ఐస్ బ్లూ, సిల్వరీ గ్రేలో లభిస్తుంది—3D కర్వ్డ్ డిజైన్‌ కలిగి ఎంతో తేలిగ్గా ఉండే ఈ ఫోన్‌ను పట్టుకోవడం సులభం. 120Hz 6.7-అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, స్క్రీన్-టు-బాడీ 93% నిష్పత్తితో హద్దుల్లేని, మైమరిపింపజేసే అనుభూతిని అందిస్తుంది. డ్రాగన్‌ట్రైల్ స్టార్ 2 డిస్‌ప్లే, దృఢమైన పాలికార్బోనేట్ బ్యాక్‌ దీని సొంతం. దీని 2412×1080px స్క్రీన్ ప్రత్యక్ష సూర్యకాంతిలోనూ స్పష్టమైన, చక్కని విజువల్స్‌ను అందించడానికి 950నిట్స్‌ HDR ప్రకాశంతో ఒక బిలియన్ రంగులు కలిగి ఉంది.

అంతే కాకుండా సరౌండ్ సౌండ్ అనుభూతి కోసం డిరాక్‌ పరీక్షించిన రియల్‌ ఒరిజినల్‌ టెక్నాలజీతో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్స్‌ మీరు అందుకుంటారు. ఆల్ట్రా క్లియర్‌ పోట్రెయిట్స్‌ కోసం టెలిఫొటో కెమెరా
శక్తిమంతమైన కెమెరా సిస్టమ్‌ కలిగిన Reno10 5Gలో 64MP OV64B అల్ట్రా-క్లియర్ మెయిన్‌ కెమెరా, 32MP IMX709 టెలిఫొటో
పొట్రెయిట్‌ కెమెరా, 8MP IMX355 112° అల్ట్రా-వైడ్ కెమెరా, 32MP OV32C అల్ట్రా- కెమెరా ఉన్నాయి. ఈ సెటప్‌తో వినియోగదారులు
తక్కువ-కాంతిలో పోట్రెయిట్స్‌ షూట్ చేస్తున్నప్పుడు లేదా వైడ్ యాంగిల్ షాట్స్‌ను కూడా అసాధారణమైన స్పష్టతతో క్యాప్చర్
చేయవచ్చు.
వేగవంతం, సురక్షితం & భద్రమైన ఛార్జింగ్‌ అనుభూతి దీని 5000mAh బ్యాటరీ Reno సిరీస్‌లో ఇప్పటి వరకు అతి పెద్దది -67W SUPERVOOC TM ఫోన్‌ను 47 నిమిషాల్లోనే 100% ఛార్జ్‌ చేస్తుంది. హడావుడిగా ఉండేవారు 30 నిమిషాల చార్జింగ్‌తో హ్యాండ్‌సెట్‌ను 70% వరకు నింపుకోవచ్చు.  ఇవే కాకుండా అవార్డు-గెల్చుకున్న OPPO బ్యాటరీ హెల్త్ ఇంజిన్ (BHE) ఛార్జింగ్ జీవితకాలం పెంచేందుకు రియల్‌-టైమ్‌ మానిటరింగ్‌ ద్వారా కరెంట్, వోల్టేజీని తెలివిగా నియంత్రిస్తుంది. నాలుగు సంవత్సరాల్లో 1,600 సార్లు ఛార్జింగ్‌ చేసిన తర్వాత కూడా హ్యాండ్‌సెట్, బ్యాటరీని 80% వరకు పదిలంగా ఉంచుతుంది.
 
దీర్ఘకాలం మన్నే చక్కని పనితీరు Reno10 5G మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 SoC, 8GB ర్యామ్‌, 256GB స్టోరేజ్‌పై పై నడుస్తుంది. OPPO ర్యామ్‌ విస్తరణ సాంకేతికత కలిగి ఉంటుంది కాబట్టి వినియోగదారులు ర్యామ్‌ను మరో 8GB వరకు పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. సమర్థవంతమైన కూలింగ్‌ కోసం వేడిని వెదజల్లేందుకు, అవాంతరం లేని ఉపయోగానికి అధిక-పనితీరు గల T19 బై-లేయర్‌ గ్రాఫైట్‌ను ఇది ఉపయోగిస్తుంది. గత తరంతో పోల్చితే OPPO డైనమిక్‌ కంప్యూటింగ్‌ ఇంజిన్‌ Reno10లో యాప్ ఓపెనింగ్ వేగాన్ని 12%

పెంచుతుంది. అంతే కాకుండా, ఇది 48 నెలల ఫ్లూయన్సీతో వస్తుంది, అంటే ఈ పరికరం నాలుగు సంవత్సరాల తర్వాత కూడా కొత్త ఫోన్ వలె సాఫీగా పని చేస్తుంది. స్మార్ట్‌ అనుభూతులు ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ యాప్‌ కలిగిన Reno10 5G ద్వారా మీరు ఏసీలు, సెట్-టాప్ బాక్సుల వంటి గృహోపకరణాలను రిమోట్‌ ద్వారా నియంత్రించవచ్చు.

Leave a Reply